Monsoon Detox Drinks : వర్షాకాలంలో ఈ డ్రింక్స్ ని తీసుకున్నట్లయితే… మీకు ఫుల్ పవర్స్ వచ్చేస్తాయి…?
ప్రధానాంశాలు:
Monsoon Detox Drinks : వర్షాకాలంలో ఈ డ్రింక్స్ ని తీసుకున్నట్లయితే... మీకు ఫుల్ పవర్స్ వచ్చేస్తాయి...?
Monsoon Detox Drinks : మార్పులు సంభవిస్తే మన శరీరంలో కూడా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అయితే,సీజన్లను బట్టి శరీరం అనారోగ్యానికి గురవుతూ ఉంటుంది. వర్షాకాలంలో కూడా శరీరం వివిధ అనారోగ్య సమస్యలకు గురవుతుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు కూడా కలుగుతాయి. ఎందుకంటే వాతావరణంలోని మార్పులు, ఇంకా తక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉండడం, తక్కువ నీటిని తాగటం వలన కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో మీరు ఇంట్లోనే సులువుగా కొన్ని చిట్కాలను ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.మరి వర్షాకాలంలో ఎలాంటి డ్రింక్స్ ని తాగితే ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చో తెలుసుకుందాం. వర్షాకాలం ప్రారంభం కాగానే వాతావరణంలో తేమ కూడా పెరిగిపోతుంది. దీనితో, చాలామందికి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్ అజీనం వికారం మలబద్ధకం లాంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి గల ముఖ్య కారణం తక్కువ నేరు తాగటం వాతావరణం లోని మార్పులు తక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉండడం, కలుషితమైన ఆహారాలు తీసుకోవడం, నీరు చాలా తక్కువగా తీసుకోవడం, వాటి వల్ల జీర్ణక్రియలో అనేక మార్పులు సంభవిస్తాయి. వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరిగా ఈ డ్రింక్స్ ని తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఆ డ్రింక్స్ ఏమిటో తెలుసుకుందాం..

Monsoon Detox Drinks : వర్షాకాలంలో ఈ డ్రింక్స్ ని తీసుకున్నట్లయితే… మీకు ఫుల్ పవర్స్ వచ్చేస్తాయి…?
Monsoon Detox Drinks అల్లం టీ
వర్షాకాలంలో అల్లం టీ అయినట్లయితే అజీర్ణం, కడుపునొప్పి, వికారం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. అల్లం లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.ఇవి వర్షాకాలంలో పెరిగే పేగు అంటువ్యాధుల నుంచి కాపాడగలుగుతుంది. రోజు కూడా ఒక కప్పు వేడి అల్లం టీ తాగినట్లయితే జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది.
పుదీనా టీ : పుదీనా సహజంగా పేగుల్లో గ్యాస్ ను తగ్గించే గుణాన్ని కలిగి. సమస్యలు తగ్గించే శరీరానికి తాజాగా ఉన్న భావాన్ని కలిగిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా,భోజనం తర్వాత ఈ పుదీనా టీ తాగితే మంచి ఫలితం కలుగుతుంది.
సోంప్ టీ : సోంపు జీర్ణవ్యవస్థకు దివ్య ఔషధం. ఈ టీ తాగితే గ్యాస్ వల్ల వచ్చే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. శరీరంలో మంట కూడా తగ్గుతుంది. రోజుకి 1 లేదా రెండు సోంపు టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది.
చామోమిలే టీ : చాము మిలే మొక్క నుండి తయారయ్యే ఈ టీ ఎంతో ప్రశాంతంగా ఉండడానికి ప్రేరేపిస్తుంది.అంతేకాదు,యాంటీ ఇన్ఫలమెంటరీ యాంటీ స్పాస్మోడిక్ గుణాలను కలిగి ఉండడం వలన, కడుపులోని వాపు కూడా తగ్గుతుంది. వీటి వల్ల వచ్చే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది మంచి నిద్రను కూడా ఇస్తుంది.
కొత్తిమీర టీ : మీరు టీ కూడా కాలేయానికి ఎంతో మంచిది. ఇది కాలయాన్ని శుభ్రం చేస్తుంది. చెడు కొలెస్ట్రాలను తొలగించి వేస్తుంది.కొత్తిమీర టీ తాగితే అజీర్ణం,ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరానికి సహజంగా శుద్ధి చేసే గుణాన్ని కలిగింపజేస్తుంది.
నిమ్మకాయ టీ : నిమ్మకాయ టీ ని లెమన్ టీ అని కూడా అంటారు. ఈ టీ తాగితే సిట్రిక్,జీర్ణక్రియ ఉత్తేజమవుతుంది. శరీరంలోని వ్యర్ధాలు తొలగిపోతాయి. వర్షాకాలంలో కలుషితమైన నీరు తాగడం వల్ల వచ్చే అంటూ వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. నిమ్మకాయ టీ తాగితే మూత్ర విసర్జన సరిగ్గా జరిగేలా చేస్తుంది.
జిలక్రర టీ : జీలకర్ర టీ శరీరానికి తేలికపాటి జిటాక్స్ డ్రింకుగా పనిచేస్తుంది.జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహకరిస్తుంది. పోషకాలను శరీరానికి సరిగ్గా అందజేస్తుంది. గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన డ్రింక్స్ ని వర్షాకాలంలో తీసుకున్నట్లయితే జీర్ణ క్రియ మెరుపు పడుతుంది. శరీరాన్ని శుద్ధి చేస్తుంది. వ్యాధుల బారి నుంచి కాపాడుతుంది. రోజువారి ఆహారాలతో ఈ డ్రింక్స్ ని జోడిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.