Capsicum : క్యాప్సికం పేరు విన్నారా ఎప్పుడైనా? సిటీలలో ఎక్కువగా దీన్ని తింటుంటారు కానీ.. గ్రామాల్లో ఎక్కువగా క్యాప్సికంను తినరు. ఇది చూడటానికి పచ్చి మిరపకాయలా ఉంటుంది. ఇది కూడా మిర్చీరకమే కానీ.. ఇది పచ్చి మిరపకాయంత కారం ఉండదు. దీన్ని ఒక కూరగాయగానే తింటారు. క్యాప్సికంలో చాలా రకాలు ఉంటాయి. ఎరుపు రంగు క్యాప్సికం.. పసుపు రంగు, గ్రీన్ కలర్ లో క్యాప్సికం లభ్యం అవుతుంది.
అలాగే.. క్యాప్సికంలోనూ చాలా రకాలు ఉంటాయి. బెంగళూరు మిర్చి, సిమ్లా మిర్చి లాంటి చాలా రకాలు ఉంటాయి. అయితే.. క్యాప్సికంలో చాలా రకాలు ఉన్నట్టే.. చాలా పోషకాలు కూడా ఉంటాయి. ఈ విషయం తెలియక చాలామంది అస్సలు క్యాప్సికంనే ముట్టుకోరు. కొందరికైతే క్యాప్సికంను తింటే ఏదో వెగటుగా ఉంటుందని.. పచ్చి మిర్చీని తిన్నట్టే ఉంటుందని దాన్ని అస్సలు ముట్టుకోరు. కానీ.. క్యాప్సికంలో ఉన్న పోషకాల గురించి మీరు తెలుసుకున్నారంటే వద్దన్నా కూడా వినకుండా మార్కెట్ కు వెళ్లి కొనుక్కొని తినేస్తారు.
క్యాప్సికంలో ఎన్ని విటమిన్లు ఉంటాయో తెలుసా? విటమిన్ ఏ, సీ, కే.. పుష్కలంగా ఉంటాయి. క్యాప్సికంలో కావాల్సినంత ఫైబర్ ఉంటుంది. దీంట్లో ఉండే విటమిన్ సీ.. కొల్లజన్ ను ఉత్పత్తి చేస్తుంది. దీంట్లో ఉండే విటమిన్ కే.. రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకల మధ్య జాయింట్స్ ను ధృడంగా ఉంచుతుంది. దీంట్లో ఉండే విటమిన్ ఏ.. కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రేచీకటి సమస్యలు ఉన్నా కూడా తగ్గిస్తుంది. చాలామందికి వృద్ధాప్యంలో కంటి సమస్యలు వస్తుంటాయి. అటువంటి సమస్యలను క్యాప్సికంలో ఉండే.. కెరోటినాయిడ్స్.. తగ్గిస్తాయి.
రెడ్ కలర్ లో ఉండే క్యాప్సికంలో లైకోపిన్ అనే పదార్థం ఉంటుంది. అది శరీరంలోని చెడు కొలెస్టరాల్ ను కరిగిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అనీమియా సమస్యతో బాధపడేవారు.. క్యాప్సికంను నిత్యం తీసుకుంటే.. అనీమియా సమస్యకు చెక్ పెట్టొచ్చు.
మధుమేహం ఉన్నవాళ్లకు కూడా క్యాప్సికం అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. రక్తంలో షుగర్ లేవల్స్ ను క్యాప్సికం కంట్రోల్ లో ఉంచుతుంది. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు.. క్యాన్సర్ కణాలతో పోరాడుతారు. దాని వల్ల క్యాన్సర్ ను రాకుండా అడ్డుకోవచ్చు.
ఇది కూడా చదవండి ==> అందరం చూసిన మొక్కే.. దీనివల్ల ఎన్ని లాభాలో మనకు ఇప్పటిదాకా తెలియదు..?
ఇది కూడా చదవండి ==> ఉలవచారు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు అస్సలు వదలరు…!
ఇది కూడా చదవండి ==> షుగర్ ఎందుకు వస్తుందో తెలుసా? అసలు కారణం తెలిస్తే బిత్తరపోతారు..!
ఇది కూడా చదవండి ==> రాత్రి పూట దిండు కింద వెల్లుల్లి పెట్టుకొని నిద్రపోతే బాడీ లోపల ఏం జరుగుతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు?
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.