Capsicum : క్యాప్సికం గురించి అసలు నిజం తెలిస్తే.. వెంటనే మార్కెట్ కు వెళ్లి కొనుక్కొని తినేస్తారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Capsicum : క్యాప్సికం గురించి అసలు నిజం తెలిస్తే.. వెంటనే మార్కెట్ కు వెళ్లి కొనుక్కొని తినేస్తారు..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :7 July 2021,8:30 pm

Capsicum : క్యాప్సికం పేరు విన్నారా ఎప్పుడైనా? సిటీలలో ఎక్కువగా దీన్ని తింటుంటారు కానీ.. గ్రామాల్లో ఎక్కువగా క్యాప్సికంను తినరు. ఇది చూడటానికి పచ్చి మిరపకాయలా ఉంటుంది. ఇది కూడా మిర్చీరకమే కానీ.. ఇది పచ్చి మిరపకాయంత కారం ఉండదు. దీన్ని ఒక కూరగాయగానే తింటారు. క్యాప్సికంలో చాలా రకాలు ఉంటాయి. ఎరుపు రంగు క్యాప్సికం.. పసుపు రంగు, గ్రీన్ కలర్ లో క్యాప్సికం లభ్యం అవుతుంది.

capsicum health benefits telugu

capsicum health benefits telugu

అలాగే.. క్యాప్సికంలోనూ చాలా రకాలు ఉంటాయి. బెంగళూరు మిర్చి, సిమ్లా మిర్చి లాంటి చాలా రకాలు ఉంటాయి. అయితే.. క్యాప్సికంలో చాలా రకాలు ఉన్నట్టే.. చాలా పోషకాలు కూడా ఉంటాయి. ఈ విషయం తెలియక చాలామంది అస్సలు క్యాప్సికంనే ముట్టుకోరు. కొందరికైతే క్యాప్సికంను తింటే ఏదో వెగటుగా ఉంటుందని.. పచ్చి మిర్చీని తిన్నట్టే ఉంటుందని దాన్ని అస్సలు ముట్టుకోరు. కానీ.. క్యాప్సికంలో ఉన్న పోషకాల గురించి మీరు తెలుసుకున్నారంటే వద్దన్నా కూడా వినకుండా మార్కెట్ కు వెళ్లి కొనుక్కొని తినేస్తారు.

Capsicum : క్యాప్సికం తింటే కలిగే లాభాలు ఇవే?

క్యాప్సికంలో ఎన్ని విటమిన్లు ఉంటాయో తెలుసా? విటమిన్ ఏ, సీ, కే.. పుష్కలంగా ఉంటాయి. క్యాప్సికంలో కావాల్సినంత ఫైబర్ ఉంటుంది. దీంట్లో ఉండే విటమిన్ సీ.. కొల్లజన్ ను ఉత్పత్తి చేస్తుంది. దీంట్లో ఉండే విటమిన్ కే.. రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకల మధ్య జాయింట్స్ ను ధృడంగా ఉంచుతుంది. దీంట్లో ఉండే విటమిన్ ఏ.. కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రేచీకటి సమస్యలు ఉన్నా కూడా తగ్గిస్తుంది. చాలామందికి వృద్ధాప్యంలో కంటి సమస్యలు వస్తుంటాయి. అటువంటి సమస్యలను క్యాప్సికంలో ఉండే.. కెరోటినాయిడ్స్.. తగ్గిస్తాయి.

capsicum health benefits telugu

capsicum health benefits telugu

రెడ్ కలర్ లో ఉండే క్యాప్సికంలో లైకోపిన్ అనే పదార్థం ఉంటుంది. అది శరీరంలోని చెడు కొలెస్టరాల్ ను కరిగిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అనీమియా సమస్యతో బాధపడేవారు.. క్యాప్సికంను నిత్యం తీసుకుంటే.. అనీమియా సమస్యకు చెక్ పెట్టొచ్చు.

capsicum health benefits telugu

capsicum health benefits telugu

మధుమేహం ఉన్నవాళ్లకు కూడా క్యాప్సికం అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. రక్తంలో షుగర్ లేవల్స్ ను క్యాప్సికం కంట్రోల్ లో ఉంచుతుంది. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు.. క్యాన్సర్ కణాలతో పోరాడుతారు. దాని వల్ల క్యాన్సర్ ను రాకుండా అడ్డుకోవచ్చు.

ఇది కూడా చ‌ద‌వండి ==> అందరం చూసిన మొక్కే.. దీనివల్ల ఎన్ని లాభాలో మనకు ఇప్పటిదాకా తెలియదు..?

ఇది కూడా చ‌ద‌వండి ==>  ఉలవచారు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు తెలిస్తే మీరు అస్స‌లు వ‌ద‌ల‌రు…!

ఇది కూడా చ‌ద‌వండి ==> షుగర్ ఎందుకు వస్తుందో తెలుసా? అసలు కారణం తెలిస్తే బిత్తరపోతారు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> రాత్రి పూట దిండు కింద వెల్లుల్లి పెట్టుకొని నిద్రపోతే బాడీ లోపల ఏం జరుగుతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది