Vulava Charu : ఉలవచారు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు అస్సలు వదలరు…!
Vulava Charu : ఉలవల గురించి సిటీవాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు. పల్లెటూర్లలో ఉండేవాళ్లకి ఉలవలు బాగానే పరిచయం. ఉలవలను మనుషులు తినరేమో అనుకుంటారు. అవి పశువుల దాణాకు మాత్రమే పనికొస్తాయని భావిస్తారు. కానీ ఉలవలు తింటే మనుషులకు కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఉలవలను వేయించుకొని టైం పాస్ కి స్నాక్స్ మాదిరిగా నమలొచ్చు. అన్నంలోకి చారు పెట్టుకోవచ్చు. గుగ్గిళ్లుగా ఉడకబెట్టుకొని తినొచ్చు. ఉలవలను బాగా ఉడికించి, రుబ్బి, వస్త్రంలో వేసి పిండితే పాలు వస్తాయి. వాటిని తాగొచ్చు. ప్రస్తుతం కొన్ని రెస్టారెంట్లు ఉలవ చారు బిర్యానీని సైతం వండి వార్చుతున్నాయి. దీంతో ఈమధ్యే కాస్త ఉలవల గురించి పట్టణ ప్రజలకు తెలుస్తోంది. ఉలవల ఉపయోగాలను తెలుసుకుంటే వీటిని ఇన్నాళ్లూ మనం మిస్ అయ్యాం అనే ఫీలింగ్ కలగక మానదు.
బలవర్ధక ఆహారం..
ఉలవలను తింటే ముఖ్యంగా బలం వస్తుంది. అదే సమయంలో ఇవి స్థూలకాయాన్ని తగ్గిస్తాయి. స్థూలకాయం ఉన్నోళ్లకు తరచుగా చెమట పడుతుంది. ఉలవ చారును అలవాటు చేసుకుంటే ఈ చెమట ఇబ్బంది తొలిగిపోతుంది. వాతాలు, నొప్పులు నయమవుతాయి. ఉలవలను రోజువారీ స్వీకరిస్తే ఎంత పని చేసినా అలసట అనేదే ఉండదు. శ్రమను తట్టుకునే శక్తిని పొందుతాం. ఉలవ చారును తాగితే మంచి ఫిజిక్ మన సొంతమవుతుంది. ఉలవల పిండి ద్వారా వచ్చే పాలల్లో చక్కెర కలుపుకొని తాగితే బాలింతలకు పాలు పడతాయి. తద్వారా పిల్లలకు డబ్బా పాలు పట్టాల్సిన పని ఉండదు. డైలీ మెనూలో ఉలవ ఉత్పత్తులు ఉంటే కంటి చూపు మెరుగుపడుతుంది.
‘ఊపిరి’పోస్తుంది..: Vulava Charu
ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్లు ఉలవలను వాడాలి. పడిశం, ఆయాసం, తుమ్ములు, దగ్గు వంటివి మటుమాయం అవుతాయి. గరం గరం ఉలవ చారు తాగితే గొంతులో కఫం తగ్గిపోతుంది. కడుపు నొప్పికి కూడా ఉలవ చారే ఉత్తమ పరిష్కారం. ఉలవచారులో పెరుగు కలిపి మజ్జిగ చేసుకొని తాగితే బెటర్. గర్భాశయానికి సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్లకు సైతం ఉలవలు ఉపయోగపడతాయి. మంత్ సరిగా రానివాళ్లు, వైట్ ప్రాబ్లంతో బాధపడే లేడీస్ ఉలవలతో ఉపశమనం పొందొచ్చు.
విరేచనాలకు ఫుల్ స్టాప్
ఆగకుండా మోషన్స్ అయ్యేవాళ్లకి, కిడ్నీల్లో రాళ్లతో కష్టపడేవారికి ఉలవలు ఉపయుక్తంగా ఉంటాయి. ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఉలవల వల్ల ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది. వీటిని ఎక్కువగా వాడితే వేడి చేస్తుంది. కాబట్టి ఉలవ చారులో ముల్లంగి రసాన్ని కలుపుకుంటే బాడీ హీట్ చల్లారుతుంది. మూత్రపిండాలు బాగా పని చేస్తాయి. అందువల్ల ఉలవలను నిత్యం మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవటం ఉత్తమం. ఒంటికి ఏదైనా దెబ్బ తగిలి రక్తం కారుతున్నప్పుడు ఉలవల జోలికి పోకుండా ఉండటం మంచిది.
ఇది కూడా చదవండి ==> షుగర్ ఎందుకు వస్తుందో తెలుసా? అసలు కారణం తెలిస్తే బిత్తరపోతారు..!
ఇది కూడా చదవండి ==> పరగడుపున మంచి నీళ్లు తాగితే శరీరంలో ఏమౌతుందో తెలిస్తే అస్సలు ఆగరు..!
ఇది కూడా చదవండి ==> రోజూ తినే అన్నం దగ్గరే మనం చాలా తప్పు చేస్తున్నాం.. ఆ ఆహారమే ఎంత చెడు చేస్తోందో తెలుసుకోండి..!
ఇది కూడా చదవండి ==> అల్లాన్ని తెగ తినేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం..!