lotta peesu : అందరం చూసిన మొక్కే.. దీనివల్ల ఎన్ని లాభాలో మనకు ఇప్పటిదాకా తెలియదు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

lotta peesu : అందరం చూసిన మొక్కే.. దీనివల్ల ఎన్ని లాభాలో మనకు ఇప్పటిదాకా తెలియదు..?

 Authored By kondalrao | The Telugu News | Updated on :6 July 2021,8:10 pm

lotta peesu : పువ్వులు గులాబీ మాదిరిగా పూసే ఈ మొక్కను రబ్బరు మొక్క, లొట్ట పీసు మొక్క, పాల సముద్రపు మొక్క అంటూ రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ మొక్కల్లో నిలువెల్లా విషమే ఉంటుంది. అందువల్ల దీన్ని కనీసం పశువులు కూడా తినవు. జలాశయాల్లో ఎక్కువగా పెరిగే ఈ మొక్కకు సంబంధించిన ఏ చిన్న భాగమూ జంతువుల నోట్లోకి పోకూడదు. పొయిందంటే ప్రమాదమే. అందుకే ఈ లొట్ట పీసు మొక్కను కలుపు మొక్క అనే ఉద్దేశంతో తీసిపారేస్తుంటారు. అయితే ఈ మొక్కలో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. అవేంటో తెలిస్తే ‘అవునా?’ అని ఆశ్చర్యపోవటం మన వంతు అవుతుంది……..

తేలు కుడితే..

లొట్ట పీసు మొక్కలో పాలు ఎక్కువగా ఉంటాయి. అవి తేలు విషానికి విరుగుడులా పనిచేస్తాయి. చర్మం మీద తామర వచ్చినప్పుడు ఈ పాలు రాస్తే తగ్గిపోతుంది. మనుషులను కుట్టే దోమలను, పంటల దిగుబడిని దెబ్బతీసే దోమలను ఈ మొక్కల పొగతో నివారించొచ్చు. లొట్ట పీసు మొక్కలను కాగితం తయారీలోనూ వినియోగిస్తారు. చాటు కోసం, రక్షణ కోసం ఇంటి చుట్టూ లొట్ట పీసు మొక్కలను పెంచుకుంటారు. వీటిని సైంటిఫిక్ గా ఐఫోమియా కార్నియా అని పేర్కొంటారు.

Lotta Peesu Plant లొట్ట పీసు మొక్క గురించి మీకు తెలుసా దీని లాభాలు తెలిసే వదిలిపెట్టరు

Lotta Peesu Plant : లొట్ట పీసు మొక్క గురించి మీకు తెలుసా…! దీని లాభాలు తెలిసే వదిలిపెట్టరు..!

పిచి కారీ.. తయారీ..: lotta peesu

వరి పంటకు దోమకాటు తగలకుండా ఉండేందుకు లొట్ట పీసు మొక్కల ఆకులతో తయారుచేసిన పిచికారీని చల్లుకోవచ్చు. రసాయనాలతో కూడిన పురుగు మందులకు బదులు ఈ సహజ ద్రావణాన్ని వాడుకోవచ్చు. దీన్ని తయారుచేయటానికి పది కిలోల లొట పీసు ఆకులు, పది కిలోల గోమూత్రం, రెండు కిలోల ఆవు పేడ కావాలి. లొట్ట పీసు మొక్క ఆకులను మెత్తగా దంచి కుండలో వేయాలి. దానికి గోమూత్రం, ఆవు పేడ కలపాలి. ఈ మూడింటినీ ఏడు కిలోలు అయ్యే దాక మరిగించాలి. ఆ సారానికి రెండు చెంచాల డిటర్జెంట్ కలిపి చల్లార్చి వడకట్టాలి.

వరి పొలంలో చల్లే విధానం..

ఈ ఏడు లీటర్ల ద్రావణాన్ని వంద లీటర్ల నీటిలో కలిపి వరి చేలో పిచికారీ చేయాలి. ఆ సమయంలో వరి పొలంలో నీళ్లు లేకుండా చూసుకోవాలి. లొట్ట పీసు మొక్కల ద్రావణం రెండు రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. కాబట్టి ఈ లోపే వరి పొలంలో చల్లాలి. దోమలు వరి మొక్కల మొదళ్లలో ఉంటాయి గనుక ఆ దుబ్బులను విడదీస్తూ ఈ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. పిచ్చి మొక్కగా, కలుపు మొక్కగా భావించే లొట్ట పీసు మొక్క నేచురల్ మెడిసిన్ లా ఉపయోగపడుతుండటం విశేషం.
ఇది కూడా చ‌ద‌వండి ==> షుగర్ ఎందుకు వస్తుందో తెలుసా? అసలు కారణం తెలిస్తే బిత్తరపోతారు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> పరగడుపున మంచి నీళ్లు తాగితే శరీరంలో ఏమౌతుందో తెలిస్తే అస్సలు ఆగరు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> రోజూ తినే అన్నం దగ్గరే మనం చాలా తప్పు చేస్తున్నాం.. ఆ ఆహారమే ఎంత చెడు చేస్తోందో తెలుసుకోండి..!

ఇది కూడా చ‌ద‌వండి ==> అల్లాన్ని తెగ తినేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం..!

Advertisement
WhatsApp Group Join Now

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది