Diabetes : షుగర్ ఎందుకు వస్తుందో తెలుసా? అసలు కారణం తెలిస్తే బిత్తరపోతారు..!
Diabetes : డయాబెటిస్.. లేదా మధుమేహం లేదా షుగర్.. పేరు ఏదైనా.. ఈ వ్యాధి మాత్రం ప్రస్తుతం ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. నాకేం కాదు.. నాకే వ్యాధి రాదు.. అన్న వాళ్లకు కూడా షుగర్ వ్యాధి వస్తోంది. వయసుతో ఏమాత్రం పని లేకుండా.. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరినీ వేధిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందడానికి కారణం మన జీవన విధానం. ఈ వ్యాధి వచ్చిందంటే.. ఇక ఆచీ తూచీ అడుగులు వేయాలి. ఏది తినాలో.. ఏది తినకూడదో తెలుసుకోవాలి. డయాబెటిస్ వస్తే అంతే. అయితే.. చాలామందికి ఒక విషయం తెలియదు. అసలు.. షుగర్ వ్యాధి వాళ్లకు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు.
అయితే.. అసలు షుగర్ వ్యాధి ఎందుకు వస్తోందో.. నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. అసలు.. వయసు భేదం లేకుండా షుగర్ ఎందుకు అటాక్ చేస్తోందో పరిశోధకులు తమ రీసెర్చ్ లో కనిపెట్టారు. అసలు.. షుగర్ వ్యాధి ఎందుకు వస్తుందో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
Diabetes : జెనిటిక్స్ అసలు కారణమా?
చాలామందికి వంశపారంపర్యంగా కొన్ని వ్యాధులు సంక్రమిస్తుంటాయి. అందులో ఒకటే ఈ మధుమేహం. ఈ వ్యాధి.. ఎక్కువగా వంశపారంపర్యంగానే సక్రమిస్తుందట. నిజానికి.. వంశపారంపర్యంగానే ఈ వ్యాధి సోకుతున్నా.. ఇదివరకు వృద్ధాప్యం వచ్చినప్పుడు వచ్చేదట. కానీ.. ప్రస్తుత జనరేషన్ లో నగరీకరణ, పట్టణీకరణ జీవితాలు ఎక్కువ అవడంతో.. షుగర్ వ్యాధి.. లేత వయసులోనే అటాక్ చేస్తోంది. అంటే.. మన దేశంలో షుగర్ వ్యాధి క్రమక్రమంగా పెరుగుతూ పోవడానికి అసు కారణం జెనిటిక్స్ అన్నమాట. దానితో పాటు.. మనం అవలంభిస్తున్న విధానాలు, మన ఆహారపు అలవాట్లు కూడా దానికి కారణమే.
ప్రస్తుత జనరేషన్ లో 30 ఏళ్లు దాటితే లేని రోగాలన్నీ వస్తున్నాయి. షుగర్ తో పాటు బోనస్ గా బీపీ కూడా వచ్చేస్తోంది. మన జీవన విధానాన్ని మార్చుకోకపోతే.. వెస్టర్న్ కల్చర్ కు అలవాటు పడితే కష్టమే ఇక. అందుకే.. ఖచ్చితంగా లైఫ్ స్టయిల్, ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిందే. లేదంటే.. లేత వయసులోనే షుగర్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంటుంది.
ఇది కూడా చదవండి ==> ఉసిరికాయను రోజూ తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే వెంటనే కొనుక్కొని తినేస్తారు..!
ఇది కూడా చదవండి ==> ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే కొలెస్టరాల్ టెస్ట్ చేయించుకోండి.. లేదంటే మీరే నష్టపోతారు?
ఇది కూడా చదవండి ==> గోధుమ పిండిని ఎక్కువగా వాడుతున్నారా? దాని వల్ల జరిగే నష్టాలు తెలుసుకోకపోతే మీ లైఫ్ డేంజర్ లో ఉన్నట్టే?
ఇది కూడా చదవండి ==> ఊబకాయం సమస్య వేధిస్తోందా? ఈ ఒక్క పని చేయండి చాలు.. మీరే ఆశ్చర్యపోతారు?