Chia Vs Sabja Seeds : చియా vs సబ్జా విత్తనాల మధ్య వ్యత్యాసం ఏమిటి… వీటితో ఎలాంటి లాభాలు ఉన్నాయి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chia Vs Sabja Seeds : చియా vs సబ్జా విత్తనాల మధ్య వ్యత్యాసం ఏమిటి… వీటితో ఎలాంటి లాభాలు ఉన్నాయి…!

 Authored By ramu | The Telugu News | Updated on :25 August 2024,12:00 pm

Chia Vs Sabja Seeds : ప్రస్తుత కాలంలో చాలామంది తమ ఆహారంలో చియా గింజలను తీసుకుంటున్నారు. వీటితో స్మూతీస్ తో సహా ఎన్నో రకాల పానీయాలను కూడా తయారు చేసుకోవచ్చు. అయితే ఎంతో మంది ఇప్పటికే చియా విత్తనాలు మరియు సబ్జా గింజల మధ్య తేడాను మాత్రం గుర్తించలేరు. ఈ రెండు విషయంలో గందరగోళంగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి చియా గింజలకు బదులుగా సబ్జా గింజలు సబ్జాకు బదులుగా చియా విత్తనాలను తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ రెండు విత్తనాలు మాత్రం మనకు ఎంతో ప్రయోజనకరమైనవి. అలాగే మంచి మొత్తంలో పోషకాలను కూడా కలిగి ఉంటాయి. అయితే చాలా మంది బరువు తగ్గటానికి చియా గింజలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఏవి సబ్జా గింజలు, ఏవి చియా గింజలు అనే అయోమయంలో మీరు కూడా ఉన్నారా. అయితే వీటిని ఎలా గుర్తించాలి? వీటితో ఏ విధమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…

సబ్జా గింజలు అంటే ఏమిటి : సబ్జా గింజలను తులసి గింజలు అని కూడా అంటూ ఉంటారు. అయితే ఈ తులసి గింజలు చాలా చక్కగా మరియు ముదురు రంగులో ఉంటాయి. ఈ విషయాన్ని మీరు కచ్చితంగా గమనించాలి. అలాగే చేతిలో తులసి గింజలను తీసుకున్నప్పుడు లేక దంతాల క్రింద వీటిని ఉంచినప్పుడు దాని స్వభావ స్పష్టంగా మీకు తెలుస్తుంది. అలాగే సబ్జా గింజలను నీటిలో వేసినప్పుడు అవి చియా గింజల లాగా బాగా ఉబ్బుతాయి. కానీ ఇది జెల్ లాగా మారవు. అయితే వీటిని ఫలూడా మరియు షర్బత్ లో కూడా ఎక్కువగా వాడతారు…

చియా విత్తనాలు : ఈ చియా విత్తనాలనేవి చియా మొక్కల నుండి దొరుకుతాయి. దీని శాస్త్రీయ నామం వచ్చి సాల్వియా హిస్పానిక. అయితే ఈ విత్తనాలను నీటిలో నానబెట్టినప్పుడు అవి ఎంతో మృదువుగా మారతాయి. అలాగే చియా విత్తనాలు జల్ లాగా బాగా మారతాయి. ఇవి ఓవల్ మరియు ఎంతో మృదువుగా కూడా మారతాయి. అలాగే ఎంతో తేలిక కూడా ఉంటాయి. వీటిని పానీయాలు, ఫుడ్ మొదలైన వాటిని తయారు చేసేందుకు ఎక్కువగా వాడతారు…

Chia Vs Sabja Seeds సబ్జా విత్తనాల ప్రయోజనాలు

ఈ సబ్జా గింజలు అనేవి మలబద్ధకంతో ఇబ్బంది పడే వారికి బాగా మేలు చేస్తాయి. అంతేకాక ఇది శరీరంపై శీతలీ కరణ ప్రభావాన్ని కూడా కలిగి ఉంటాయి. అలాగే రక్తంలో చక్కెరను తగ్గించడంలో కూడా ఎంతో మేలు చేస్తాయి. దీనిలో మెగ్నీషియం, కాల్షియం లాంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ సబ్జా గింజలు ఎముకలకు కూడా ఎంతో మేలు చేస్తాయి. దీనిలో చాలా తక్కువ కెలరీలా కారణంగా ఇవి బరువు తగ్గించేందుకు కూడా మేలు చేస్తాయి…

Chia Vs Sabja Seeds చియా vs సబ్జా విత్తనాల మధ్య వ్యత్యాసం ఏమిటి వీటితో ఎలాంటి లాభాలు ఉన్నాయి

Chia Vs Sabja Seeds : చియా vs సబ్జా విత్తనాల మధ్య వ్యత్యాసం ఏమిటి… వీటితో ఎలాంటి లాభాలు ఉన్నాయి…@

చియా విత్తనాల ప్రయోజనాలు : బరువు తగ్గాలి అనుకునేవారు మరియు కండరాలను టోల్ చెయ్యాలి అని అనుకునే వారు ఈ చియా గింజలను తీసుకోవాలి. ఇవి ప్రోటీన్ కు మంచి ములకాలు అని కూడా చెప్పవచ్చు. అలాగే ఈ విత్తనాలలో కాల్షియం ఫాస్ఫరస్, మెగ్నీషియం లాంటి యాక్సిడెంట్లు కూడా మంచి పరిమాణంలో ఉంటాయి. వీటి పోషకాల విలువలో స్వల్ప వ్యత్యాసం అనేది ఉంటుంది…

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది