Sabja seeds : ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన సబ్జా గింజలు తీసుకుంటే… జుట్టు సమస్యలని ఇట్టే తొలగిపోతాయట … ఎలాగో తెలుసుకోండి…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sabja seeds : ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన సబ్జా గింజలు తీసుకుంటే… జుట్టు సమస్యలని ఇట్టే తొలగిపోతాయట … ఎలాగో తెలుసుకోండి…??

 Authored By ramu | The Telugu News | Updated on :11 November 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Sabja seeds : ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన సబ్జా గింజలు తీసుకుంటే... జుట్టు సమస్యలని ఇట్టే తొలగిపోతాయట ... ఎలాగో తెలుసుకోండి...??

Sabja Seeds : మండుతున్న ఎండల నుండి ఉపశమనం పొందడానికి సబ్జా గింజలు ఎంతో చక్కగా పనిచేస్తాయి. అలాగే ఈ సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే మలబద్ధకం మరియు అధిక బరువు,మధుమేహం, శ్వాసకోశ లాంటి సమస్యలకు సబ్జా గింజలు ఔషధంగా పని చేస్తాయి. అయితే ప్రస్తుతం అందరిని వేధిస్తున్న సమస్యలలో జుట్టు రాలే సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు ఉదయాన్నే ఈ వాటర్ ని తీసుకోవడం వలన కచ్చితంగా జుట్టును వేర్ల నుండి ఎంతో బలంగా చేస్తుంది. అలాగే జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి ప్రతిరోజు ఒక చెంచా సబ్జా గింజలను ఒక గ్లాస్ వాటర్ లో వేసి కనీసం 30 నిమిషాల పాటు నారనివ్వాలి. ఆ తర్వాత దానిలో ఒక చెంచా నెయ్యి మరియు నిమ్మరసం వేసి తాగాలి. మీరు గనక ప్రతిరోజు ఈ రకమైన డ్రింక్ ను తీసుకుంటే జుట్టు సమస్యలు మాత్రమే కాదు గుండెల్లో మంట మరియు అజీర్ణం లాంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.

ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి ఈ సబ్జా గింజలు అనేవి కాస్త గట్టిగానే ఉంటాయి. కానీ ఈ గింజలలో మాత్రం ప్రోటీన్లు మరియు పీచు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సబ్జా గింజలు బరువును నియంత్రించడంలో బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే మైగ్రేన్ మరియు తలనొప్పి సమస్యలతో ఇబ్బంది పడే వారు కూడా ఈ సబ్జా గింజలను నీటిలో నానబెట్టి అవి ఉబ్బిన తర్వాత తాగి చూడండి, సమస్య అనేది తగ్గిపోవడమే కాకుండా మనసుకు ఎంత ప్రశాంతంగా కూడా ఉంటుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేయటంలో మరియు మలినాలను బయటకు పంపించటంలో కూడా ఈ సబ్జా గింజలు ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఈ సబ్జా గింజలలో మన శరీరానికి ఎంతో అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ మరియు పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

Sabja seeds ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన సబ్జా గింజలు తీసుకుంటే జుట్టు సమస్యలని ఇట్టే తొలగిపోతాయట ఎలాగో తెలుసుకోండి

Sabja seeds : ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన సబ్జా గింజలు తీసుకుంటే… జుట్టు సమస్యలని ఇట్టే తొలగిపోతాయట … ఎలాగో తెలుసుకోండి…??

ఈ సబ్జా గింజలను నీటిని మహిళలు తాగితే ఫోలేట్ మరియు నియాసిన్, విటమిన్ ఇ లాంటి పోషకాలు శరీరానికి అందుతాయి. అలాగే మీకు వికారంగా మరియు వాంతి వచ్చినట్టు అనిపించినప్పుడు ఈ సబ్జా గింజల పానీయం తీసుకుంటే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. అలాగే తరచుగా డిహైడ్రేషన్ కి గురయ్యే వారు కూడా సబ్జా గింజల పానీయం తాగితే చాలా మంచిది. దీంతో శరీరంలోని ద్రవాలు అన్నీ కూడా సమతుల్యంగా ఉంటాయి

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది