Curry leaves : కరి వేపాకును ఇలా తినండి… శరీరంలో ఉన్న కొవ్వు ఇట్టే మాయం….!
ప్రధానాంశాలు:
Curry leaves : కరి వేపాకును ఇలా తినండి... శరీరంలో ఉన్న కొవ్వు ఇట్టే మాయం....!
Curry leaves : కరి వేపాకును తినటానికి చాలామంది ఇష్టపడరు. భోజనం మధ్యలో కరి వేపాకు దొరికితే వాటికి తీసి పక్కన పెట్టేయడం చాలామందికి ఉన్న అలవాటు. కానీ దీని ప్రయోజనాల గురించి తెలిసిన వారు మాత్రం పచ్చిగా కూడా తీసుకుంటారు. కరివేపాకును తినే అలవాటు మీకు లేకుంటే మీరు మీ శరీరానికి కూడా ఎంతో నష్టం చేసినట్లే. ఈ కరివేపాకును దక్షిణ భారత వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వంట రుచిని పెంచడమే కాక కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కరివేపాకు ఎన్నో ఆరోగ్య సమస్యల కు వ్యతిరేకంగా పోరాడటంలో బాగా పనిచేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ ను కరిగించటంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతే ఇది జుట్టు సమస్యలను కూడా నయం చేయగలదు. కరివేపాకు వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
Curry leaves కొలెస్ట్రాల్ నియంత్రణ
ప్రతిరోజు కూడా కరివేపాకు ఆకులు తీసుకోవటం వలన కొలెస్ట్రాల్ స్థాయిలు అనేవి పూర్తిగా తగ్గి రక్తనాళాల్లోని ఉన్న కొవ్వు కరిగిపోతుంది అని నిపుణులు తెలిపారు. కరివేపాకు రసం చేసుకొని కూడా తాగవచ్చు. నేటి ఆధునిక ప్రపంచంలో చాలా మందిలో కొలెస్ట్రాల్ సమస్య అనేది ఎంతో వేగంగా పెరుగుతూ ఉన్నది. కావున మార్కెట్లో లభిస్తున్న మందుల ద్వారా కొలెస్ట్రాల్ ను నియంత్రించలేము. ఈ తరుణంలో మీరు కరివేపాకు పై ఆధారపడటం చాలా మంచిది. కరివేపాకు నానబెట్టిన నీటిని ఖాళీ కడుపుతో తాగటం వలన కొలెస్ట్రాల్ అనేది కరిగిపోతుంది…
Curry leaves కంటి సమస్యలను దూరం చేస్తుంది
కరివేపాకులో విటమిన్ ఎ అనేది ఎక్కువగా ఉంటుంది. కళ్ళను ఆరోగ్యంగా ఉంచటంలో కూడా ఈ విటమిన్ ఎంతో ఉపయోగపడుతుంది. కరివేపాకు నానబెట్టిన నీటిని తీసుకోవటం వలన కళ్ళు ఆరోగ్యంగా కూడా ఉంటాయి. దృష్టి కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఇతర రకాల కంటి సమస్యలను కూడా నివారిస్తుంది…
Curry leaves : జుట్టు సమస్యలు దూరం
కరివేపాకు జుట్టుకు కూడా ఎంతో మంచిది అని అందరికీ తెలుసు. జుట్టు రాలే సమస్యలు వెంటనే తగ్గిస్తుంది. కరివేపాకును తీసుకోవటం వల్ల జుట్టుకు ఎంతో పోషణ కూడా లభిస్తుంది. కరివేపాకు నీటిలో నానబెట్టి రోజు తీసుకున్నట్లయితే జుట్టు రాలటం సమస్య కూడా తగ్గుతుంది. మంద పాటి మరియు ముదురు జుట్టుకు కూడా ఇది ఎంతో దోహదం చేయగలదు.
Curry leaves కాలేయ ఆరోగ్యం
ఆరోగ్యమైన జీవితాన్ని గడిపేందుకు ఆరోగ్యకరమైన కాలేయం చాలా అవసరం. కానీ బయటి ఆహారం మరియు జీవనశైలి మార్పుల వలన ఎన్నో ఇతర అంశాలు కాలే యాన్ని దెబ్బతీస్తున్నాయి. కాలేయం ఆరోగ్యంగా ఉండాలి అంటే. కరివేపాకును కచ్చితంగా తీసుకోవాలి. కరివేపాకు లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు లివర్ డ్యామేజ్ ను కూడా తగ్గిస్తుంది. అంతేకాక కరివేపాకు కాలయాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కావున మన రోగనిరోధక సమస్యలను కూడా బలంగా చేస్తుంది. దీని ఫలితంగా శరీర వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. ప్రతిరోజు కరివేపాకు నీరు తీసుకోవటం వల్ల జీర్ణక్రియ కూడా ఎంతో మెరుగుపడుతుంది. కరివే పాకును తినటం వల్ల గుండె ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. కడుపులోని మంట నుండి కూడా ఎంతో ఉపశమనం పొందవచ్చు. రక్తహీనత సమస్యల నుండి కూడా పూర్తిగా దూరం చేస్తుంది. అంతేకాక స్త్రీలకూ రక్తహీనత సమస్యలను కూడా దూరం చేయగలదు. బహిష్టు టైంలో నొప్పి అనేది తగ్గుతుంది. కరివే పాకులో ఐరన్ కంటెంట్ రక్తాన్ని పంచడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక మరేన్నో ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తుంది…