Diabetes : ఈ ఆకుల రసంతో షుగర్ వ్యాధికి చెక్ పెట్టవచ్చు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetes : ఈ ఆకుల రసంతో షుగర్ వ్యాధికి చెక్ పెట్టవచ్చు…!!

Diabetes : ప్రస్తుతం వయసు తరహా లేకుండా చాలామంది ఎదుర్కొనే సమస్య షుగర్. ఇది ఒకసారి ఎంట్రీ ఇస్తే జీవితాంతం బాధపడవల్సిందే.. ఈ డయాబెటిస్ ను తగ్గించుకోవడానికి కొన్ని సహజ చిట్కాలు ఉన్నాయని ఆయుర్వేద డాక్టర్ కపిల్ త్యాగి చెప్తున్నారు.. భారత దేశంలో 18 సంవత్సరాలు కన్నా ఎక్కువ వయసు ఉన్న 77 మిలియన్ల మంది టైప్ టు షుగర్ 25 మిలియన్ల మంది ఫ్రీ డయాబెటిస్ తో ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. కావున మన దేశాన్ని […]

 Authored By prabhas | The Telugu News | Updated on :22 January 2023,7:00 am

Diabetes : ప్రస్తుతం వయసు తరహా లేకుండా చాలామంది ఎదుర్కొనే సమస్య షుగర్. ఇది ఒకసారి ఎంట్రీ ఇస్తే జీవితాంతం బాధపడవల్సిందే.. ఈ డయాబెటిస్ ను తగ్గించుకోవడానికి కొన్ని సహజ చిట్కాలు ఉన్నాయని ఆయుర్వేద డాక్టర్ కపిల్ త్యాగి చెప్తున్నారు.. భారత దేశంలో 18 సంవత్సరాలు కన్నా ఎక్కువ వయసు ఉన్న 77 మిలియన్ల మంది టైప్ టు షుగర్ 25 మిలియన్ల మంది ఫ్రీ డయాబెటిస్ తో ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. కావున మన దేశాన్ని షుగర్ రాజధానిగా పిలుస్తున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోతే శరీరంలో ఎన్నో అవయవాలు పాడైపోతూ ఉంటాయి. టైప్ టు షుగర్ ఉన్నవాళ్లు గుండె సంబంధిత సమస్యలు స్ట్రోక్ కిడ్నీ సమస్యలు కంటి సమస్యలు వస్తూ ఉంటాయి. నిత్యం మందులు వేసుకోవడం వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం బరువుని అదుపులో ఉంచుకుంటే ఈ షుగర్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

అయితే ఈ డయాబెటిస్ ని తగ్గించుకోవడానికి కొన్ని సహజ చిట్కాలు ఉన్నాయని ఆయుర్వేద డాక్టర్ కపిల్ త్యాగి తెలుపుతున్నారు. మన చుట్టుపక్కల ఉండే మొక్కలు తో ఈ వ్యాధిని తగ్గించుకోవచ్చని చెప్తున్నారు. అయితే అవేంటో ఇప్పుడు మనం చూద్దాం… తులసి మొక్క: తులసిని ఆయుర్వేదంలో ఎంతో గొప్ప ఔషధంగా పరిగణిస్తారు. తులసి అనేక ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. తులసి వల్ల ప్యాంక్రియాటిక్ బీటా కణాల పనితీరు ఇన్సులిన్ ని స్రవించే విధానం మెరుగుపడుతుందని ఆధ్యాయంలో తేలింది. తులసి ఆకులలో హైపో గ్లైసిమిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి. జామ ఆకు : జామ ఆకు రక్తంలో షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. జామ ఆకులతో టీ తయారు చేసుకుని కూడా తీసుకోవచ్చు. జామ ఆకుల రసంలో యాంటీ ఐ ఫర్ గ్లైసోమిక్ లక్షణాలు ఉన్నాయని అధ్యయనంలో బయటపడింది. మామిడి ఆకులు:  మామిడి ఆకులలో మాంగి ఫెరిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆల్ఫా గ్లూకోస్సి డెసిని నిరోధిస్తుంది.

Diabetes can be checked with the juice of these leaves

Diabetes can be checked with the juice of these leaves

మాంగి ఫైరన్ ప్రేగులలో కార్బోయిడ్ జీర్ణక్రియ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే రక్తంలో షుగర్ ఎదుగుదలను కూడా తగ్గిస్తుంది. మామిడాకులలో విటమిన్ సి ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ని తగ్గించడానికి కొలెస్ట్రాల్ కరిగించటానికి ఉపయోగపడతాయి.. కరివేపాకు: కరివేపాకుని ప్రతి కూరల్లో వేస్తూ ఉంటారు. కానీ దాని తీసి పక్కన వేస్తూ ఉంటారు. ఈ కరివేపాకు షుగర్ ని కంట్రోల్లో చేయడానికి చాలా సహాయపడుతుంది. కరివేపాకులో యాంటీ కార్సి మ్యూజియం, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన కాలయానికి ఎక్కువగా రక్షణ కల్పిస్తూ ఉంటాయి. కరివేపాకులో ఎన్నో మూలకాలు పుష్కలంగా ఉంటాయి.

ఇవి షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే దీని రసం తాగిన లేదా కరివేపాకులు తిన్న చాలా మంచిది అని చెప్తున్నారు.. ఇన్సులిన్ ఆకు : ఇన్సులిన్ ఆకులు ప్రోటీన్ తెర్ప నాయుడ్లు, ప్లవనాయిడ్లు ఆంటీ ఆక్సిడెంట్లు ఇంకా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇన్సులిన్ ఆకులో ఉండే ఆసిడ్స్ ప్యాంక్రియాస్ నుంచి ఎక్కువగా విడుదల అయ్యేలా చేస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకుల్లో ఉన్న సహజ రసాయనం మానవ శరీరంలోని షుగర్ గ్లైకోజంగా మారుతుంది. ఈ ఆకులను నిత్యం తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది