Diabetes : డయాబెటిస్.. దీన్నే మనం షుగర్ లేదా మధుమేహం అంటాం. ఈ జబ్బు వచ్చిందంటే చాలు.. ఇక జీవితాంతం షుగర్ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిందే. షుగర్ ను కంట్రోల్ చేసుకోవాల్సిందే. లేదంటే.. షుగర్ పెరిగిపోయి.. లేనిపోని సమస్యలు వస్తాయి. అయితే.. షుగర్ వ్యాధిని కూడా కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు. జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అలాగే.. ఫుడ్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే షుగర్ కంట్రోల్ అవుతుంది. లేకపోతే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.
అయితే.. డయాబెటిస్ వచ్చినవాళ్లు చాలామంది ఎక్కువ టెన్షన్ పెట్టుకుంటారు. సీజన్ మారుతున్నా కొద్దీ వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. టెన్షన్ పెట్టుకొని కూర్చుంటే షుగర్ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. ఏమాత్రం టెన్షన్ పడినా.. షుగర్ పెరగడమే కానీ తగ్గదు. అందుకే.. షుగర్ వచ్చినవాళ్లు ఎంత సంతోషంగా ఉంటే అంతమంచిది.
షుగర్ వ్యాధి వచ్చిన వాళ్లు తీసుకోవాల్సిన ఇంకొన్ని జాగ్రత్తలు ఏంటంటే.. సీజన్ మారినప్పుడల్లా వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండకపోతే.. లేనిపోని సమస్యలు వస్తాయి. ఉదాహరణకు.. వర్షాకాలంలో కేవలం షుగర్ వ్యాధి ఉన్నవాళ్లకే కొన్ని సమస్యలు వస్తాయి. వాటిని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. వాటిని దూరం చేసుకోవడం కోసం ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు.
వర్షాకాలంలో మధుమేహం ఉన్నవాళ్లకు జర్వం ఎక్కువగా వస్తుంది. జ్వరంలో పాటు.. రకరకాల వైరస్ లు త్వరగా అటాక్ అవుతాయి. దాని వల్ల.. దగ్గు, జలుబు.. ఇంకా చాలా రకాల సమస్యలు వస్తాయి. మామూలుగా.. వర్షాకాలంలో ఇటువంటి వైరస్ లు అందరినీ అటాక్ చేసినా.. డయాబెటిస్ ఉన్నవాళ్లను ఇంకాస్త ఎక్కువగా అటాక్ చేస్తాయి. అందుకే.. షుగర్ ఉన్నవాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్లలో ఎక్కువ రోగనిరోధక శక్తి ఉంటుంది. కానీ.. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లలో రోగ నిరోధక శక్తి కాస్త తక్కువగా ఉంటుంది. అందుకే.. వాళ్లను వైరస్ లు తొందరగా అటాక్ చేస్తాయి.
షుగర్ ఉన్నవాళ్లకు ఎక్కువగా మూత్రం వస్తుంటుంది. దాని వల్ల వాళ్లు ఎక్కువగా నీళ్లు తాగరు. కానీ.. అది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే.. నీళ్లు తక్కువగా తాగితే.. డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. వర్షాకాలం అయినా సరే.. వర్షాలు ఎక్కువగా పడినా సరే.. నీళ్లు మాత్రం ఖచ్చితంగా తాగాల్సిందే. మూత్రం ఎక్కువగా వచ్చినా పర్లేదు కానీ.. మంచి నీళ్లు ఎక్కువగా తాగడం మరిచిపోవద్దు.
అలాగే.. వర్షాకాలంలో షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు.. పచ్చి కూరగాయలను అస్సలు తినొద్దు. ఎందుకంటే.. వర్షాకాలంలో వాటి మీద చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉంటాయి. అవి చాలా డేంజర్. కూరగాయలను ఉడికించి లేదా వండుకొని మాత్రమే తినాలి. ఎప్పుడూ వేడి వేడి ఆహారాన్ని మాత్రమే తినాలి. అలాగే.. ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వర్షంలో అస్సలు తడవొద్దు. తడి బట్టలను కూడా వేసుకోవద్దు. వర్షాకాలంలో ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.
ఇది కూడా చదవండి ==> పాలు, పండ్లను కలిపి ఒకేసారి తింటే… ఏమౌతుందో తెలుసా?
ఇది కూడా చదవండి ==> వర్ష కాలంలో వచ్చే ఏ వ్యాధులైన సరే… ఈ ఆరోగ్య చిట్కాలను పాలో అవ్వండి ?
ఇది కూడా చదవండి ==> పొట్టిగా ఉన్నవాళ్లు త్వరగా బరువు తగ్గరా? దానికి కారణం ఏంటో తెలుసా?
ఇది కూడా చదవండి ==> మహిళల కన్నా పురుషులే త్వరగా బరువు తగ్గుతారట.. దానికి కారణం ఏంతో తెలిస్తే నోరెళ్లబెడతారు?
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.