Lose Weight : పొట్టిగా ఉన్నవాళ్లు త్వరగా బరువు తగ్గరా? దానికి కారణం ఏంటో తెలుసా?
Lose Weight : బరువు తగ్గడం అనేది అంత ఈజీ కాదు. దాని కోసం చాలా కష్టపడాలి. దానికి తగ్గట్టు ఆహార నియమాలు ఉండాలి. నిత్యం వ్యాయామం చేయాలి. యోగా చేయాలి. జిమ్ కు వెళ్లాలి. రన్నింగ్, వాకింగ్.. ఇలా అన్ని చేస్తేనే బరువు తగ్గుతారు. లేదంటే బరువు తగ్గడం చాలా కష్టం. అయితే.. బరువు తగ్గడంలో కూడా చాలా విషయాలు ఉంటాయి. మహిళల కంటే పురుషులు త్వరగా బరువు తగ్గుతారు. అలాగే.. పొట్టిగా ఉన్నవాళ్ల కంటే పొడవుగా ఉన్నవాళ్లు త్వరగా బరువు తగ్గుతారు. అయితే.. పొట్టిగా ఉన్నవాళ్లు త్వరగా ఎందుకు బరువు తగ్గరు? అనేదే పెద్ద ప్రశ్న. చాలామంది పొట్టిగా ఉండేవాళ్లు ఇది ఎదురయ్యే ఉంటుంది. వాళ్లు ఎంత కష్టపడ్డా త్వరగా బరువు తగ్గరు. అదే పొడవుగా ఉన్నవాళ్లు త్వరగా బరువు తగ్గేస్తుంటారు. దానికి కారణం ఏంటో తెలుసుకుందా రండి.

it is harder to lose weight for shorter people
Lose Weight : బరువు తగ్గడానికి, ఎత్తుకు ఏంటి సంబంధం?
బరువు తగ్గడానికి, ఎత్తుకు సంబంధం ఉంటుందట. ఎందుకంటే.. పొడవుగా ఉండేవాల్లలో కండరాలు ఎక్కువగా ఉంటాయి. దాన్నే కండర ద్రవ్యరాశి అంటారు. వాళ్లకు ఎక్కువ కండర ద్రవ్యరాశి ఉండటం వల్ల.. వాళ్లు త్వరగా బరువు తగ్గుతారట. అదే పొట్టిగా ఉండేవాళ్లు తక్కువ కండర ద్రవ్యరాశిని కలిగి ఉంటారు. దీన్నే మనం మజిల్ మాస్ అంటారు. ఈ మజిల్ మాస్.. పొట్టిగా ఉండేవాళ్లలో తక్కువగా ఉంటుంది. అలాగే.. వీళ్ల మెటబాలిజం రేటు కూడా తక్కువగా ఉంటుంది. దానికి కారణం.. వీళ్లలో తక్కువ కండర ద్రవ్యరాశి ఉండటమే.

it is harder to lose weight for shorter people
Lose Weight : పొట్టిగా ఉండేవాళ్లు ఇలా చేస్తే త్వరగా బరువు తగ్గొచ్చు
తక్కువ ఎత్తు ఉన్నవాళ్లు ఇక బరువు తగ్గరు.. అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే.. వాళ్లు కూడా కొంచెం కష్టపడితే బరువు తగ్గొచ్చు. దానికోసం చేయాల్సింది ఏంటంటే.. వాళ్లు పర్ ఫెక్ట్ గా డైట్ ఫాలో అవ్వాలి. సరైన ఫిట్ నెస్ ను పాటించాలి. అధిక కేలరీలు ఉన్న ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు. తక్కువ కేలరీలు ఉన్న ఆహారానే తినాలి. అలాగే.. ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే.. కండర ద్రవ్యరాశిని పెంచుకోవాలి. దాని కోసం జిమ్ కు వెళ్లి.. కసరత్తులు చేయాలి. కండర ద్రవ్యరాశి పెరిగిందటే.. బరువు కూడా తొందరగా తగ్గొచ్చు.

it is harder to lose weight for shorter people
ఇది కూడా చదవండి ==> జాగింగ్ ఎప్పుడు చేయాలి? ఉదయమా? సాయంత్రమా? ఎప్పుడు చేస్తే మంచిది?
ఇది కూడా చదవండి ==> బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే.. ఈ టీని మీరు రోజూ తాగాల్సిందే?
ఇది కూడా చదవండి ==> పామాయిల్ ఎక్కువగా వాడుతున్నారా? వెంటనే దీన్ని చదవండి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం
ఇది కూడా చదవండి ==> ప్యాకెట్ పాలు కొనుక్కొని తాగుతున్నారా? అసలు.. ఏ పాలు మంచివో తెలుసుకోండి..!