YS Jagan రాయలసీమలో మాస్ వైబ్రేషన్స్ మొదలయ్యాయి అంటున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి Byreddy Siddharth Reddy అభిమానులు.. సీఎం జగన్ YS Jagan ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని.. ఇక వచ్చే ఎన్నికల నాటికి తమ సత్తా ఏంటో చూపిస్తామని.. మరోసారి వైఎస్ జగన్ కు సీఎంగా చేసేంత వరకు పోరాడతాం అంటున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అభిమానులు.. తాజాగా భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టులో వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి సీఎం వైఎస్ జగన్ కీలక పదవి ఇచ్చారు. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి Byreddy Siddharth Reddy ని ఏపీ సర్కార్ నియమించింది. దీంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. పదవి ప్రకటించినప్పటి నుంచి మాస్ సంబరాలు మొదలయ్యాయి.
భారీ సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్న అభిమానులు సందడి చేస్తూనే ఉన్నారు. జై బైరెడ్డన్న అంటూ నినాదాలతో మారుమోగిస్తున్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపుకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత ఎమ్మెల్యే ఆర్థర్‌కు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి పడట్లేదని పలుమార్లు వార్తలు పెద్ద ఎత్తునే వచ్చాయి. పేరుకే ఎమ్మెల్యేగా ఆర్థర్ గెలిచినా పెత్తనం మాత్రం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిదే అని వార్తలు కూడా గుప్పుమన్నాయి.
అయితే అటు తర్వాత జరిగిన మున్సిపోల్, పంచాయితీ ఎన్నికల్లోనూ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, తన అనుచరులకు టిక్కెట్లు ఇవ్వలేదని ఆర్థర్ ఆరోపించారు. దీంతో ఇరువర్గాల మధ్య విబేధాలు కర్నూలు జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వరకు వెళ్లాయి. అయితే నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతోనే ఆర్థర్ కు టిక్కెట్ ఇచ్చామని, లేకుంటే, బైరెడ్డి సిద్ధార్థరెడ్డికే అవకాశం ఇచ్చేవారమని పార్టీ అధిష్టానం ఆర్థర్ కు తేల్చి చెప్పింది. నియోజకవర్గ ఇంఛార్జికే కీలక అధికారం ఇస్తున్నామని, దీనిపై గొడవకు తావు లేదని పార్టీ పెద్దలు స్పష్టం చేసినట్లు వార్తలు వెల్లువెత్తాయి.
ఆ వివాదం సంగతి ఎలా ఉన్నా, తాజాగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఛాన్స్ ఉంటుందని, కనీసం నామినేటెడ్ పోస్ట్ అయినా లభిస్తుందని వార్తలు వినిపించాయి.
.. పాదయాత్ర సమయంలో నందికొట్కూరు ప్రచార సభలో మాట్లాడిన వైఎస్ జగన్ YS Jagan .. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి Byreddy Siddharth Reddy తన మనసులో ఉన్నాడని ఖచ్చితంగా మంచి ప్రాధాన్యత గల పోస్ట్ ఇస్తానని హామీ ఇచ్చారు. అప్పుడు సీఎం వైఎస్ జగన్ Ys jagan ఇచ్చిన హామీని ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా నెరవేర్చారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలు, అనుచరులు చెప్పుకుంటున్నారు.
పోస్ట్ ఇస్తున్నట్లు ప్రకటించగానే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంటి దగ్గర.. పార్టీ ఆఫీసు దగ్గర కార్యకర్తలు, అనుచరులు స్వీట్లు పంచుకుని.. పటాసులు పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాదు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి పదవి ఇవ్వడమే.. ఇంతకాలం ఆయన్ను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే ఆర్థర్ కు చెక్ పెట్టినట్టే అంటున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గీయులు.. అయితే పోస్ట్ కేటాయించడంతో, ఇరువర్గాల మధ్య విబేధాలు తగ్గుతాయన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై మరింత రచ్చ తప్పదని స్థానిక కేడర్ అటోంది. మరి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి పోస్ట్ ఇవ్వడంపై ఎమ్మెల్యే ఆర్థర్ వర్గం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
ఇది కూడా చదవండి ==> వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి మధ్య గ్యాప్…? కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు?
ఇది కూడా చదవండి ==> ఉన్న పదవి ఊస్ట్… మంత్రి పదవి అయినా ఉందా జగన్ననా.. రోజా…!
ఇది కూడా చదవండి ==> ఈ మూడు జిల్లాలతో వైఎస్ జగన్‌కు తిప్పలు తప్పదా…?
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
This website uses cookies.