Curd : చాలామందికి పెరుగంటేనే పడదు. పెరుగు పేరు ఎత్తితేనే యాక్ అంటారు. పెరుగు, మజ్జిగ ఇలా ఏదీ తినరు. కనీసం తమ జీవితంలో ఒక్కసారి కూడా పెరుగును టేస్ట్ చేయని వాళ్లు ఉన్నారు. పెరుగును సింపుల్ గా వద్దు అంటారు. ఇంకొందరైతే.. పెరుగు తింటే జలుబు చేస్తుందని.. బరువు పెరుగుతామని భ్రమ పడతారు. అందుకే.. పెరుగును ముట్టుకోరు. ఇంకొందరికి పెరుగు అస్సలు పడదు. చిన్నప్పటి నుంచి కొందరికి అలవాటు ఉండదు. ఇలా.. పలు రకాల కారణాలతో పెరుగును పక్కన పెట్టేవాళ్లు మాత్రం చాలా ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అవుతున్నారు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
పెరుగులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి రోజు కనీసం ఒక్కసారి అయినా పెరుగును తినాల్సిందే. అలా తింటేనే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. లేదంటే చాలా నష్టం. అసలు.. పెరుగు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఈ కథనం చదివాక.. వెంటనే పెరుగు వేసుకొని తినేస్తారు.
పెరుగులో ఎటువంటి మినరల్స్, విటమిన్లు ఉండవని చాలామంది అనుకుంటారు. కానీ.. పెరుగులో చాలా మినరల్స్ ఉంటాయి. కాల్షియం, భాస్వరం, ప్రొటీన్లు, లాక్టోస్ పెరుగులో ఉంటాయి. పెరుగులో ఉండే కాల్షియం వల్ల.. శరీరంలోని ఎముకలు దృఢంగా తయారు అవుతాయి. అలాగే.. దంతాలు కూడా గట్టి పడుతాయి. మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. ఖచ్చితంగా పెరుగు తినాల్సిందే. పెరుగుతో పాటు.. మజ్జిగను కూడా రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి.
పెరుగును అలాగే తినకుండా.. పెరుగులో ఎండుద్రాక్షను కలుపుకొని తింటే.. విటమిన్ ఏ, బీ, సీ, బీ12 అందుతాయి. అలాగే.. పెరుగులో మిరియాల పొడిని కలుపుకొని తిన్నా.. జలుబు తగ్గుతుంది. పెరుగులో.. బెల్లం పొడి కూడా కలుపుకొని తినొచ్చు. వాతం ఉన్నా.. కఫం ఉన్నా పెరుగును తినండి. నీరసం ఉన్నా.. అలసటగా ఉన్నా.. పెరుగులో కాసింత చక్కెర కలుపుకొని తింటే శరీరానికి వెంటనే తగిన శక్తి లభిస్తుంది. హైబీపీ ఉన్నా కూడా రోజూ పెరుగు తినండి. పెరుగులో కాసింత తేనె కలుపుకొని తాగితే.. అల్సర్ తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా పెరుగు, తేనె కలుపుకొని తాగండి.
అయితే.. పెరుగు కంటే కూడా మజ్జిగలో ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మజ్జిగలో కాసింత నిమ్మరసం వేసుకొని తాగాలి. ఉప్పు, జీలకర్ర పొడి వేసుకొని తాగినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే.. డీహైడ్రేషన్ సమస్య ఉన్నవాళ్లు.. మజ్జిగ తాగితే చాలామంచిది.
ఇది కూడా చదవండి ==> పాలు, పండ్లను కలిపి ఒకేసారి తింటే… ఏమౌతుందో తెలుసా?
ఇది కూడా చదవండి ==> వర్ష కాలంలో వచ్చే ఏ వ్యాధులైన సరే… ఈ ఆరోగ్య చిట్కాలను పాలో అవ్వండి ?
ఇది కూడా చదవండి ==> పొట్టిగా ఉన్నవాళ్లు త్వరగా బరువు తగ్గరా? దానికి కారణం ఏంటో తెలుసా?
ఇది కూడా చదవండి ==> మహిళల కన్నా పురుషులే త్వరగా బరువు తగ్గుతారట.. దానికి కారణం ఏంతో తెలిస్తే నోరెళ్లబెడతారు?
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
This website uses cookies.