Weight Loss : మహిళల కన్నా పురుషులే త్వరగా బరువు తగ్గుతారట.. దానికి కారణం ఏంతో తెలిస్తే నోరెళ్లబెడతారు?
Weight Loss : బరువు తగ్గడం అనేది ఈ జనరేషన్ లో చాలెంజిగ్. ఎందుకంటే.. బరువు తగ్గడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. దాని కోసం కంటిన్యూగా కష్టపడాలి. బరువు పెరగడం కోసం ఏమాత్రం కష్టపడాల్సిన అవసరం లేదు కానీ.. బరువు తగ్గాలంటే కసరత్తులు చేయాలి. వ్యాయామాలు చేయాలి. బరువులు ఎత్తాలి. జిమ్ కు వెళ్లాలి. ఫిట్ నెస్ కోసం చాలా కష్టపడాలి. అలాగే.. డైట్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఫుడ్ తినాలో అదే తినాలి. ఎందుకంటే.. కొందరు బరువు తగ్గేందుకు ఓవైపు ప్రయత్నిస్తూనే మరో వైపు.. కేలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటారు. అలా చేస్తే బరువు తగ్గడం కాదు కదా.. ఇంకా పెరుగుతూ పోతూనే ఉంటారు.
అయితే.. బరువు తగ్గే విషయంలో.. కొన్ని సంచలన నిజాలు బయటికి వచ్చాయి. సాధారణంగా ఎవరు తొందరగా బరువు తగ్గుతారు అనే విషయంలో.. పురుషులు తొందరగా బరువు తగ్గుతారా? లేక మహిళలా? అనే దానిపై రీసెర్చ్ చేశారు. ఎందుకంటే.. స్త్రీ కానీ.. పురుషులు కానీ.. ఎవరైనా సరే.. బరువు తగ్గాలంటే అవే కసరత్తులు చేయాలి. వాకింగ్, జాగింగ్, రన్నింగ్.. ఇలా అన్ని రకాల వ్యాయామాలు చేయాల్సిందే. సేమ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి. అయినప్పటికీ.. ఇద్దరిలో ఎవరు ముందు బరువు తగ్గుతారు.. అనే దానిపై రీసెర్చ్ నిర్వహించగా.. సంచలన నిజాలు బయటికి వచ్చాయి.
Weight Loss : పురుషులు త్వరగా బరువు తగ్గడానికి అసలు కారణం ఇదే
బరువు తగ్గడం అంటే ఏంటి? శరీరంలో ఉన్న కేలరీలను ఖర్చు చేయడం. నిలువ ఉన్న కొవ్వును కరిగించడం. అలా చేయడం వల్ల బరువు తగ్గుతారు. అంటే.. ఎవరికైతే సన్నగా కండరాలు ఉంటాయో.. వాళ్లు త్వరగా బరువు తగ్గుతారు. అయితే.. మహిళల్లో ఈ కండరాలు.. అంత సన్నగా ఉండవట. పురుషుల్లో కండరాలు సన్నగా ఉండటం వల్ల.. వాళ్లు త్వరగా బరువు తగ్గుతారట. దాన్నే కండర ద్రవ్యరాశి అని పిలుస్తారు. ఈ కండర ద్రవ్యరాశి.. ఎక్కువ కేలరీలను కరిగిస్తుంది. దాని వల్ల పురుషులు త్వరగా బరువు తగ్గుతారు.
అలాగే.. బరువు తగ్గే విషయంలో.. జీవక్రియ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. జీవక్రియను ఎంత ఎక్కువగా ఉంటే.. అన్ని అధిక కేలరీలు ఖర్చు అవుతాయి. దాని వల్ల త్వరగా బరువు తగ్గుతారు. ఆ జీవక్రియ రేటు కూడా కండర ద్రవ్యరాశి మీద ఆధారపడి ఉంటుంది. పురుషులకు సన్నని కండరాలు కలిగి ఉండటం వల్ల.. వాళ్లు అధిక జీవక్రియను కలిగి ఉంటారు. దాని వల్ల.. వాళ్లు త్వరగా బరువు తగ్గుతారు.
అలాగే.. మహిళలకు, పురుషులకు వేర్వేరు ప్రాంతాల్లో కొవ్వు నిలువ ఉంటుంది. పురుషులకు అయితే ఎక్కువగా పొత్తి కడుపులో కొవ్వు పేరుకుప్గా.. మహిళలకు ఎక్కువగా తొడల్లో కొవ్వు పేరుకుపోతుంది. అయితే.. పొత్తికడుపులో పేరుకున్న కొవ్వు వల్లనే ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే.. దాన్ని కరిగించడం కూడా సులువు కావడం వల్ల.. పురుషులు త్వరగా బరువు తగ్గుతారు. అలాగే.. స్త్రీలలో విడుదలయ్యే ఈస్ట్రోజోన్ హార్మన్ ప్రభావం వల్ల కూడా మహిళలు త్వరగా బరువు తగ్గరు. ఆ హార్మోన్.. క్యాలరీలను ఖర్చు చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దాని వల్ల.. వాళ్లు త్వరగా బరువు పెరగడంతో పాటు.. అంత త్వరగా బరువు తగ్గరు.
ఇది కూడా చదవండి ==> జాగింగ్ ఎప్పుడు చేయాలి? ఉదయమా? సాయంత్రమా? ఎప్పుడు చేస్తే మంచిది?
ఇది కూడా చదవండి ==> బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే.. ఈ టీని మీరు రోజూ తాగాల్సిందే?
ఇది కూడా చదవండి ==> పామాయిల్ ఎక్కువగా వాడుతున్నారా? వెంటనే దీన్ని చదవండి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం
ఇది కూడా చదవండి ==> ప్యాకెట్ పాలు కొనుక్కొని తాగుతున్నారా? అసలు.. ఏ పాలు మంచివో తెలుసుకోండి..!