Milk and Fruits : పాలు, పండ్లను కలిపి ఒకేసారి తింటే… ఏమౌతుందో తెలుసా?
Milk and Fruits : మనిషికి జీర్ణవ్యవస్థ చాలా ముఖ్యం. ఎందుకంటే.. జీర్ణవ్యవస్థ సరిగ్గా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. లేదంటే ఎన్నో సమస్యలు. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోయినా.. జీర్ణ క్రియలో సమస్యలు ఉన్నా.. తిన్న ఆహారం జీర్ణం కాదు. దాని వల్ల చాలా సమస్యలు వస్తాయి. అందుకే.. జీర్ణ వ్యవస్థను ఎప్పుడూ ఆరోగ్యం ఉంచుకోవాలి. అసలు.. జీర్ణ సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా? మనం తినే ఆహారం వల్లనే. ఏది పడితే అది తినడం వల్ల.. దేన్ని పడితే దాన్ని లోపల వేయడం వల్ల. అందుకే.. ఏం తినాలో.. ఏం తినకూడదో ముందే తెలుసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం.
చాలామంది చేసే తప్పులేంటో తెలుసా? కొన్ని ఆహార పదార్థాలను కలిపి తినడం. ఉదాహరణకు.. పాలను పండ్లను కలిపి తినడం. నిజానికి.. పాలను, పండ్లను కలిపి తినకూడదు. అలా చేస్తే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. పాలకు, పండ్లకు పడదు. వాటిని ఒకేసారి తీసుకోకూడదు. అలా చేస్తే.. వాటి నుంచి ఏర్పడే ఆమ్లాల వల్ల శరీరానికి చాలా సమస్యలు వస్తాయి.
Milk and Fruits : జీర్ణ సమస్యలు రాకుండా ఏం చేయాలి?
ఇలా.. పాలను, పండ్లను కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అల్సర్, గ్యాస్ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇలా జీర్ణ సమస్యలు రాకుండా ఉండాలంటే.. జీర్ణవ్యవస్థ సక్రమంగ పనిచేసేలా చూసుకోవాలి. ఒకేసారి ఎక్కువ ఆహారాన్న తినకూడదు. ఆకలేస్తేనే తినాలి. కడుపు నిండిన భావన రాగానే.. తినడం ఆపేయాలి. లేట్ నైట్ ఎక్కువ తినకూడదు. టైమ్ కాని టైమ్ లో తింటే.. తిన్న ఆహారం అస్సలు అరగదు. కొందరు అర్ధరాత్రి దాటాక తింటుంటారు. అది అస్సలు మంచిది కాదు. కుదిరితే.. రాత్రి 8 లోపు తినేయాలి. రాత్రి పూట పడుకునే వరకే.. తిన్న అన్నం అరగాలి. అలా అయితేనే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. లేదంటే లేనిపోని సమస్యల్లో చిక్కుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి ==> జాగింగ్ ఎప్పుడు చేయాలి? ఉదయమా? సాయంత్రమా? ఎప్పుడు చేస్తే మంచిది?
ఇది కూడా చదవండి ==> బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే.. ఈ టీని మీరు రోజూ తాగాల్సిందే?
ఇది కూడా చదవండి ==> పామాయిల్ ఎక్కువగా వాడుతున్నారా? వెంటనే దీన్ని చదవండి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం
ఇది కూడా చదవండి ==> ప్యాకెట్ పాలు కొనుక్కొని తాగుతున్నారా? అసలు.. ఏ పాలు మంచివో తెలుసుకోండి..!