Monsoon : వానాకాలంలో ఈ 3 రకాల పప్పులను తినకండి… లేదంటే సమస్యల్లో పడ్డట్టే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Monsoon : వానాకాలంలో ఈ 3 రకాల పప్పులను తినకండి… లేదంటే సమస్యల్లో పడ్డట్టే…

 Authored By ramu | The Telugu News | Updated on :17 July 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Monsoon : వానాకాలంలో ఈ 3 రకాల పప్పులను తినకండి... లేదంటే సమస్యల్లో పడ్డట్టే...

Monsoon : ప్రతి ఒక్కరి ఇంట్లో టైం కి కూరగాయలు లేకుంన్నా పప్పు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అయితే మాంసాహారం తీసుకొని వారికి వారి శరీరంలో ప్రోటీన్ల లోపాన్ని తీర్చె ఏకైక మార్గం పప్పు మాత్రమే. అందుకే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఆహారంలో పప్పులు తీసుకోవాలి అని నిపుణులు అంటున్నారు.ఈ పప్పులు అనేవి పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో ప్రోటీన్, పీచు తో పాటుగా మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఐరన్ లాంటి ఇతర మినరల్స్ ఈ పప్పులో ఉన్నాయి. అయితే ఈ పప్పులను తీసుకోవడం వలన మన శరీరంలో పోషకాహార లోపం ఉండదు. అయితే ఈ పప్పులను తీసుకోవటం వలన ఆరోగ్యానికి కూడా నష్టం ఉండదు. కానీ వర్షాకాలంలో మాత్రం ఈ పప్పులను అసలు తీసుకోకూడదు. ఇది మీకు విచిత్రంగా అనిపించిన ఇది మాత్రం నిజం. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ మూడు రకాల పప్పులను అసలు తినకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం…

కందిపప్పు : వాన కాలంలో గాలిలో తేమ అనేది అధికంగా ఉంటుంది. ఈ టైంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గ్యాస్,గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కందిపప్పును తీసుకోవటం వలన కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ పప్పులో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. అలాగే శరీరంలో పీచు పదార్థం అనేది పెరిగితే అజీర్తి సమస్య కూడా వచ్చే అవకాశం ఉన్నది.అలాగే కడుపు ఉబ్బరం సమస్యలు కూడా వస్తాయి. అప్పుడు మన శరీరం లో సమస్యలు ఏర్పడుతుంది…

Monsoon రాజ్మా పప్పు

రాజ్మాను బాగా ఉడకబెట్టి తీసుకోకపోతే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పప్పులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాపర్, పొటాషియం కూడా ఉన్నాయి. ఈ వర్షాకాలంలో రాజ్మాలు తీసుకోవడం వలన అజీర్ణ సమస్య వస్తుంది.

Monsoon వానాకాలంలో ఈ 3 రకాల పప్పులను తినకండి లేదంటే సమస్యల్లో పడ్డట్టే

Monsoon : వానాకాలంలో ఈ 3 రకాల పప్పులను తినకండి… లేదంటే సమస్యల్లో పడ్డట్టే…

శనగలు : ఈ శనగలను ఎంతో మంది ఉడికించి లేక మలకెత్తిన వాటిని తినటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే వానాకాలంలో ఈ పప్పును తినకుండా ఉండటమే చాలా మంచిది. ఈ శనగలలో ఎంన్నో లాభాలు ఉన్నప్పటికీ కూడా ఈ వానా కాలంలో వాటిని తీసుకోవటం వలన గ్యాస్, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది