Soaked Raisins : నానబెట్టిన కిస్మిస్ తో ఎన్ని లాభాలో… ముఖ్యంగా అలాంటి వారికి… !
ప్రధానాంశాలు:
Soaked Raisins : నానబెట్టిన కిస్మిస్ తో ఎన్ని లాభాలో... ముఖ్యంగా అలాంటి వారికి... !
Soaked Raisins : ఎండుద్రాక్ష దీన్ని కిస్మిస్ Raisins అని కూడా పిలుస్తారు. ఇది రుచి లోను మరియు పోషకాల లోనూ అద్భుతంగా ఉంటుంది. ఈ కిస్మిస్ లలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇక ఈ ఎండుద్రాక్షలను ప్రతిరోజు సరైన సమయంలో సరైన విధానంలో తిన్నట్లయితే పూర్తి ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే శరీరానికి కావలసిన ఐరన్ పొటాషియం వంటి పోషకాలు అన్ని కూడా కిస్మిస్ లలో లభిస్తాయి. అయితే కిస్మిస్ లో ఉండే పోలీఫెనోల్ , ఫ్లెవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేయడంలో సహాయపడతాయి. స్వెల్లింగ్ అలాగే తగ్గించి సూక్ష్మ క్రిముల వృద్ధి చెందకుండా కాపాడుతాయి. అంతేకాదు క్యాన్సర్ గుండె వ్యాధులు వంటి సమస్యలను తగ్గిస్తుంది. కిస్మిస్ లను ప్రతిరోజు ఉదయం తినడం మంచిది.
కిస్మిస్ లను ముందు రోజు రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున తిన్నట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కడుపు సమస్యలను కూడా తగ్గిస్తుంది. చాలామందికి మధ్యాహ్నం వేల నీరసంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాంటివారు కిస్మిస్లను తినడం అలవాటు చేసుకోవడం మంచిది. ఎందుకంటే కిస్మిస్ లలో నేచురల్ స్వీట్ ఉంటుంది. ముఖ్యంగా నానబెట్టిన కిస్మిస్ లో ఫైబర్ అధిక మోతాదులో ఉండడం వలన ఇవి తిన్న వెంటనే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అంతేకాకుండా సులభంగా బరువు తగ్గవచ్చు.
నానబెట్టిన కిస్మిస్లను ప్రతి రోజు తినడం వలన రక్తహీనత వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇక ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయ పడటం వలన రక్తహీనత ఏర్పడకుండా కాపాడుతుంది. ముఖ్యంగా నానబెట్టిన కిస్మిస్ లో గ్లూకోజ్ మరియు ఫ్రక్టోస్ లు మీకు తక్షణ శక్తిని అందిస్తుంది. దీంతో రోజంతా ఉల్లాసంగా ఉంటారు. వీటిని ప్రతిరోజు తినడం వల్ల చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా నానబెట్టిన కిస్మిస్ లలో ఒలినోలిక్ ఉన్నందున దంత క్షయం ఏర్పడకుండా దంతాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.