Ashwagandha Chai : అశ్వగంధ చాయ్ తో అద్భుత ఫలితాలు… తీవ్ర వ్యాధులకు తక్షణ ఉపశమనం…
ప్రధానాంశాలు:
Ashwagandha Chai : అశ్వగంధ చాయ్ తో అద్భుత ఫలితాలు... తీవ్ర వ్యాధులకు తక్షణ ఉపశమనం...
Ashwagandha Chai : ఆయుర్వేదంలో అశ్వగందాన్ని అద్భుతమైన మూలికగా పేర్కొనడం జరిగింది. అందుకే ప్రతిరోజు దీనిని తీసుకోవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెప్తున్నారు. అద్భుతమైన మూలికను ఉపయోగించి టీ తాగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయని తెలుస్తోంది. మరి ముఖ్యంగా శీతాకాలంలో అశ్వగంధ మూలికతో తయారుచేసిన చాయ్ తీసుకోవడం వలన ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉంటాయని తెలుస్తోంది.మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుంటాం. అశ్వగంధ మూలిక ఒక అద్భుతమైన అడాప్టోజెన్ అని చెప్పవచ్చు. ఇది శరీరాన్ని ఒత్తిడికి గురికాకుండా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాక చలికాలంలో ప్రతి ఒక్కరిని ఎంతగానో వేధించే జలుబు, దగ్గు, గొంతు గర గర వంటి సమస్యలకు ఇది తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాక ప్రతిరోజు అశ్వగంధ చాయ్ తాగడం వలన నిద్ర నాణ్యత మెరుగుపడుతుందట.ఇది నిద్రలేమి సమస్యను తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అలాగే ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. శరీరంలో శక్తి స్థాయిలను పెంచి అలసట రాకుండా యాక్టివ్ గా ఉండేలా చూస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ అశ్వగంధ ఛాయ్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Ashwagandha Chai తయారీ విధానం…
అశ్వగంధ టీ తయారీ కోసం ముందుగా ఒక కప్పు నీరు తీసుకోవాలి. దీనిలో అర టీ స్పూన్ అశ్వగంధ పొడి ,పావు టీ స్పూన్ దాల్చిన చెక్క ,మరియు యాలకుల పొడి , కొద్దిగా అల్లం తో పాటు రుచికి తగినంత తేనెను కలుపుకోవాలి. ఇవన్నీ కలిపిన మిశ్రమాన్ని చిన్న పాత్రలో మరిగించుకోవాలి. రెండు మూడు నిమిషాలు బాగా మరిగించిన తర్వాత ఈ నీటిని వడకట్టుకుని కప్పులోకి తీసుకోవాలి. మరలా దీనిలో రుచికి తగినంత తేనె కలుపుకొని వేడిగా ఉన్నప్పుడే తాగేయాలి.
Ashwagandha Chai ఎవరు తాగితే మంచిది…
ఈ అశ్వగంధం టీ అందరూ తాగకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ముఖ్యంగా గర్భవతులు పాలిచ్చే స్త్రీలు ఈ టీ పొరపాటున కూడా తీసుకోకూడదు. ఎందుకంటే అశ్వగంధం గర్భసంచి సంకోచాలను ప్రేరేపించే లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకే గర్భవతులు ఈ టీ పొరపాటున కూడా తీసుకోకూడదు. అదేవిధంగా ఏదైనా సర్జరీ చేయించుకున్న వారు కూడా ఈ చాయ్ కి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే అశ్వగంధం రక్తం గడ్డకట్టే ప్రక్రియను ప్రభావితం చేయగలదు.కాబట్టి ఏదైనా సమస్యతో బాధపడుతున్న వారు అశ్వగంధం చాయ్ తాగే ముందు వైద్యులను సంప్రదించటం మంచిది.