TEA : “టీ” ఎక్కువసార్లు తాగడం వలన వచ్చే ఇబ్బందులు ఏమిటో తెలుసా మీకు… తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
TEA : చాలామందికి టీ అనేది లేకుండా రోజు గడవనే గడవదు.. టీ ఒక అలవాట్ల మార్చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరైతే టీ ని ఎక్కువసార్లు త్రాగుతూ ఉంటారు. ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్న దీని అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చెడు కలుగుతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.. అధికంగా తింటే అమృతం కూడా విషమవుతుందని ఒక సామెత ఉంది. రోజు టీ తాగే అలవాటు ఉంటే మంచిది. అయితే అది మన ఆహారపు అలవాట్లలో భాగమై అధికమైతే అది ఆరోగ్యానికి ఎంతో డేంజర్ అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రోజుకి మూడు నాలుగు కప్పులు కంటే టీ ఎక్కువగా తీసుకోవడం వలన ఆరోగ్యానికి ప్రమాదం అని పరిశోధనలో బయటపడింది. సహజంగా జీవన విధానంలో టీ తాగడం చాలా మంచి అలవాటే.
టీ అనేది ఒత్తిడి నుంచి బయటపడేస్తుంది. కాబట్టి రోజుకి ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవచ్చు. అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే టీ ని అధికంగా తీసుకోవద్దని కూడా హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదారణ పొందిన పానీయాలలో టీ గొప్ప స్థానంలో ఉంది. చక్కెర పాలతో తయారయ్యే టీ ని ఇండియాలో ఛాయ అని కూడా పిలుస్తారు. సాంప్రదాయంగా అయితే టీ ని జ్వరం లేదా జలుబు సమస్యలు వచ్చినప్పుడు వినియోగిస్తూ ఉంటారు. ప్రధానంగా చలికాలంలో టీ తాగడం వలన మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. అయితే ఈ టీ ని అధికంగా తీసుకోవడం వలన ఆరోగ్యానికి ప్రమాదం ఈ విధంగా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ఇబ్బందులు ఏంటో ఇప్పుడు చూద్దాం…
1) గర్భధారణ ఇబ్బందులు : గర్భ స్రావం లేదా జన్మించి బిడ్డ బరువుని టీ ప్రభావితం చేస్తూ ఉంటుంది. కాబట్టి గర్భధారణ టైంలో టీ తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
2) గుండెల్లో మంట : టీ లో ఉండే కెఫెన్ ఆరోగ్యంపై ఎన్నో ప్రతికూల ప్రభావాన్ని పడేలా చేస్తుంది. మీరు ఎంత టీ తాగితే మీ కడుపులో అంత ఎక్కువ ఆసిడ్ ఫామ్ అవుతూ ఉంటుంది. అందుకే గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంటుంది.
3) నిద్రలేమి సమస్య : మానవ జీవన క్రమంలో నిద్ర చాలా ప్రధానమైనది నిద్ర అనేది లేకపోవడం మానవ మానసిక స్థితిని నేరుగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎంత ఎక్కువగా టీ తాగితే అంత తక్కువ నిద్ర పడుతుంది. దీని మూలంగానే పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా నిద్ర పట్టకుండా ఉండడానికి టిని అధికంగా తీసుకుంటూ ఉంటారు.
4) ఆందోళన ఒత్తిడి : టీ ఆకులలో కెఫిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. టి అధికంగా తీసుకోవడం వలన అధిక మొత్తంలో కెఫిన్ ను తీసుకున్నట్లు అవుతుంది. కాబట్టి మనలో ఆందోళన భయం సంచలత లాంటి భావాలు ఎక్కువవుతూ ఉంటాయి.
5) మలబద్ధకం : టీలో ఉండే తీయొఫిలింన్ అనే పదార్థం మన శరీరంలోని జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. కాబట్టి మలబద్దకం సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది.