Jaggery : బెల్లం నీటిని ఉదయాన్నే తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
Jaggery : మనం జీవిస్తున్న జీవనశైలిలో మార్పుల వలన ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. వాటి వలన చాలామంది షుగర్ తీసుకోవడం మానేసి బెల్లాన్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటూ ఉన్నారు. బెల్లం లో మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ ,కార్బోహైడ్రేట్స్, సోడియం లాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరానికి ఎంతగానో సహాయ పడతాయి. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో బెల్లం కలుపుకుని తాగడం వలన జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఈ నీటిని తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.
శరీర బరువును ఈ బెల్లం నీరు కంట్రోల్లో ఉంచుతాయి. ఊబకాయంతో బాధపడుతున్న వారు ఉదయాన్నే బెల్లం నీటిని తీసుకోవడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. బెల్లంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిని వేడి నీటిలో కలిపి త్రాగడం ఉన్న రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే గురికాకుండా రక్షిస్తుంది. బెల్లం తీసుకోవడం వలన లివర్ నుంచి విష పదార్థాలను ఈజీగా బయటికి పంపిస్తుంది. దీనిలో పోషక విలువలు ప్రభావాన్ని కలిగి ఉండే సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి. ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకోండి. దాంట్లో బెల్లం ముక్క లేదా బెల్లం పొడి వేసి బాగా కలుపుకోవాలి.
ఈ ఆరోగ్యకరమైన నీటిని నిత్యం కాలి కడుపుతో త్రాగాలి. బెల్లం నీళ్లలో కలిపి తాగడం ఇష్టం లేకపోతే బెల్లం ముక్క తిని ఆ తర్వాత నీటిని త్రాగవచ్చు. ఉదయాన్నే వేడి నీరు తాగడం వలన పొట్ట కూడా క్లియర్ అవుతుంది. సుఖ విరోచనం అవుతుంది. బిపి ఎక్కువగా ఉన్న తక్కువగా ఉన్న బెల్లం నీటిని తీసుకోవాలి. ఇది బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. దీనిలో ఉన్న ఐరన్ రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. చాలామంది మలబద్ధకం సమస్యతో చాలా బాధపడుతూ ఉంటారు. నిద్రలేచిన తర్వాత కాలకృత్యాలు ముగించుకొని ఖాళీ కడుపుతో బెల్లం నీటిని త్రాగాలి. ఇలా చేస్తే ఉదయాన్నే సుఖ విరోచనం జరుగుతుంది.