Beer : బీరు తాగితే కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయా..?
Beer : కిడ్నీ సమస్యతో బాధపడే వారి సంఖ్య భారతదేశంలో ప్రస్తుతం పెరిగిపోయింది. చిన్న పెద్ద వయసుతో తేడా లేకుండా ప్రతి ఒక్కరు కిడ్నీలో రాళ్లు కిడ్నీ ఫైల్యూర్ వంటి కిడ్నీ సంబంధిత వ్యాధులతో చాలామంది బాధపడుతున్నారు.. అసలు కిడ్నీలోకి రాళ్లు ఎలా వస్తాయో తెలుసా..? మనం తినే ఆహారంతోనే వెంట్రుకలు, రాళ్లు లాంటి చిన్నచిన్న పదార్థాలు అన్ని ఒకచోటికి వెళ్లి ఒక గడ్డలా తయారవుతాయి. వాటిని మనం కిడ్నీలో స్టోన్స్ అని అంటాము. ఒక్క మాటలో చెప్పాలంటే రోజుకి 700 లీ. నీటిని మనకు కిడ్నీలు శుభ్రం చేస్తూ ఉంటాయి. కిడ్నీలో రాళ్లు వచ్చినప్పుడు వెనక భాగం నొప్పి వస్తూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు చాలామంది చాలా ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు. అయితే చాలామంది బీరు తాగితే కిడ్నీలో స్టోన్ కరిగిపోతుందని నమ్ముతున్నారు. అదేపనిగా మద్యపానం చేస్తున్నారు. నిజంగా బీరు తాగితే కిడ్నీ రాళ్లు కరిగిపోతాయా.. బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని చాలామంది నమ్ముతారు.
వెయ్యి మంది పై చేసిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కిడ్నీలో రాళ్ళను కరిగించేందుకు బీరు తాగడమే ఉత్తమ చికిత్స అని భావించేవారు ప్రతి ముగ్గురిలో ఒకరు ఉన్నారు అని తెలుస్తుంది. అయితే బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయనిది వాదన మాత్రమేనని ఇది ఎంత మాత్రం నిజం కాదని వైద్య నిపుణులు చెప్తున్నారు. బీరు తాగితే మూత్ర విసర్జన పెరుగుతుందని మూత్రం పోతోపాటు రాళ్లు కూడా కరిగిపోతాయని కొందరు నమ్ముతున్నారు.. కానీ అది కేవలం అపోహ మాత్రమేనని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బీరు తాగడం వల్ల పెరిగిన మూత్ర విసర్జనతో మూత్ర ప్రవాహంలో మూడు మిల్లీమీటర్ల పరిణామం కలిగిన రాళ్ళ గుళికలు బయటికి వస్తాయి.
అంతే కానీ బీరు తాగడానికి కిడ్నీలో రాళ్లు కరగడానికి ఏమాత్రం సంబంధం లేదన్నారు వైద్యనిపుణులు. అధికంగా బీరు తాగడం వలన అధిక బరువు, కాలయానికి హాని కలిగిస్తుంది. కిడ్నీలో రాళ్లు కరిగించేందుకు నీరు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే బీన్స్, తాజా కూరగాయలు, దానిమ్మ వంటి తీసుకోవడం వల్ల కిడ్నీలు రాళ్లు తగ్గే అవకాశం ఉంది. అంతేకానీ బీరు తాగడం వలన కిడ్నీలో రాళ్లు కరుగుతాయనేది అపోహ మాత్రమే..