Coffee : ఈ కాఫీతో కిడ్నీలలో రాళ్లు కరుగుతాయా..? నిపుణులు ఏమంటున్నారంటే…!!
Coffee : ప్రస్తుతం మన జీవిస్తున్న జీవనశైలి విధానంలో కొన్ని ఆహార మార్పుల వలన చాలామంది లో కిడ్నీలలో రాళ్లు ఏర్పడుతున్నాయి. శరీరంలో ప్రధానమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. కిడ్నీలు రక్తం నుండి వ్యర్ధాలను గ్రహించడానికి అదే విధంగా శరీరంలోని ద్రవ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. రక్తంలోని కొన్ని వ్యర్ధాలు అధికంగా ఉండి తగినంత ద్రవం లేకుంటే ఈ వ్యర్ధాలు పేరుకుపోయి కిడ్నీలలో రాళ్లు వస్తుంటాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎన్నో రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి.
అయితే కిడ్నీలలో ఉండే రాళ్లు పరిమాణం అలాగే వాటి వల్ల మూత్రం ఏదైనా ఇబ్బంది వస్తుందా అనే అంశాన్ని తీసుకుంటే.. దానికి మంచి చికిత్సలు ఉన్నాయి. ప్రధానంగా నీరు ఎక్కువగా తాగితే కిడ్నీలలో రాళ్లు కరుగుతాయని నిపుణులు చెప్తూ ఉంటారు. అయితే తాజా పరిశోధనలలో కాఫీ తరచుగా తాగేవారికి మూత్రపిండాలలో రాళ్ల సమస్య నుంచి బయటపడుతున్నారని కొన్ని పరిశోధనలో తెలిసింది. అయితే ఆ వివరాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం.. అధికంగా కాఫీ తాగితే డిహైడ్రేట్ అవుతారని చాలామంది నమ్ముతూ ఉంటారు. దాంతో మూత్రపిండాల రాళ్ల సమస్య పెరుగుతుందని
అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు చెప్తున్నారు. కాఫీలో అధికంగా మూత్ర విసర్జన గుణాలు ఉన్నాయని తద్వారా రాళ్లు మూత్రనాల ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉందని చాలామంది చెప్తున్నారు. కాఫీలో ఉండే కెఫెన్ వలన ముత్ర పిండాలలో రాళ్లు రాకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. టీ, సోడా, కాఫీ ఆల్కహాలలో లభించే టిఫిన్ మూత్రపిండాలలో రాళ్ల సమస్య నుంచి రక్షిస్తూ ఉంటాయి. కాఫీ తాగడం వలన మూత్రపిండాలలో రాళ్లు కరుగుతాయని కొన్ని పరిశోధనలలో వెలువడింది.