Drink : ఈ డ్రింక్స్… రాత్రి పడుకునే ముందు తాగాలి… ఇక దబిడి దిబిడే..!
ప్రధానాంశాలు:
Drink : ఈ డ్రింక్స్... రాత్రి పడుకునే ముందు తాగాలి... ఇక దబిడి దిబిడే..!
Drink : ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అనారోగ్య సమస్యలకు ఎక్కువగా గురవుతున్నారు. దీనికి గల కారణం ఏది లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు రావడం. ఆరోగ్య సమస్యల వలన మీరు పదే పదే డాక్టర్లను సంప్రదించవలసి వస్తుంది. అయితే మీ జీవన శైలిలోనూ మరియు ఆహారము విషయంలో శ్రద్ధ పెట్టాలి. దీనికోసం ఇంట్లోనే తేలికపాటి చిట్కాలను పాటిస్తే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తమ పనులలో నీలమైపోయి, టైం కి తినటం టైం కి నిద్రించటం క్రమం తప్పుతూ వస్తుంది. దీనితో లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి గల ముఖ్య కారణం ప్రజలు జీవనశైలి విధానం, అనారోగ్యకరమైన ఆహారం.. చిన్నవయసులోనే వ్యాధుల బారిన పడేలా చేయడం. ఇలాంటి పరిస్థితుల్లోనే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మీ లైఫ్ స్టైల్ ని కొంచెం మార్చుకుంటే సరిపోతుంది. మీ ఆరోగ్యం పట్ల కొంచెం దృష్టి సాగించిన సరే డాక్టర్ వద్దకు పదేపదే వెళ్లవలసిన అవసరం ఉండదు. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం మరియు ఆహారంలోనూ మార్పులు చేసుకోవాలని కొన్ని చిట్కాలు పాటించాలి అని వైద్యులు తెలియజేస్తున్నారు. మీ ఆరోగ్యానికి మేలు చేసే ప్రయోజనకరమైన ఆహారాలు ఉన్నాయి. కొన్ని ఆహార పదార్థాల కలయికల వలన అనారోగ్య సమస్యలు పోతాయి. మీ ఆరోగ్యానికి మేలు చేసే ప్రయోజనకరమైన చాలా ఆహారాలు ఉన్నాయి. అందులో ఒకటి నల్ల మిరియాలు, ఇంకా పాలు. దీన్ని తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

Drink : ఈ డ్రింక్స్… రాత్రి పడుకునే ముందు తాగాలి… ఇక దబిడి దిబిడే..!
అయితే ఇటువంటి పరిస్థితుల్లో, రాత్రి నిద్రించే ముందు నల్ల మిరియాలు కలిపిన పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుంది.. ఆయుర్వేద నిపుణులు ఏమంటున్నారు.. వీటన్నిటికీ సమాధానం తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు పాలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ పాలకి కొన్ని మిరియాల పొడిని జోడిస్తే, దాని ప్రయోజనాలు చాలా రెట్లు పెరుగుతాయి. మిరియాల లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అనేక పోషక విలువలు ఉంటాయి. అంతేకాదు శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగితే అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. అయితే ఈ పాలు మిరియాలు విషయం గురించి ఆయుర్వేద నిపుణులు డాక్టర్ కిరణ్ గుప్తా మాట్లాడుతూ… మిరియాలు పొడి కలిపిన పాలు తాగితే జలుబు, దగ్గు అంటే ఉపశమనం లభించడమే కాదు ఎముకలు కూడా బలపడతాయి. ఎందుకంటే పాలలో కాల్షియం,విటమిన్ డి ఉంటాయి. నల్ల మిరియాలు పాలలో ఉండే పోషకాలను శోషణ ను పెంచుతాయి. దీనివల్ల ఎముకలో బలంగా దృఢంగా మారుతాయి.
ఈ నల్ల మిరియాల లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్లను తగ్గించి మనల్ని రక్షిస్తాయి అని డాక్టర్ గుప్తా చెప్పారు. వీటిని పాలలో కలిపి మరీ తాగితే శరీర రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుందని తెలియజేశారు. దీంతో పాటు, ఎల్ల మిరియాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి గొంతు నొప్పి, శ్లేష్మం తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు గోరువెచ్చని పాలలో కలిపి తీసుకుంటే కఫం కూడా తగ్గుతుంది. దీనివల్ల ఛాతి క్లియర్ అవుతుంది.
అయితే నల్ల మిరియాలు జీర్ణ ఎంజైములను సక్రియను చేస్తాయి. ద్వారా ఆహారం ద్వారా మరియు అద్భుతంగా జీర్ణం అవుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ పాలను తాగితే అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలునుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇంకా బరువు తగ్గాలనుకునే వారు కూడా నల్ల మిరియాల పాలు తాగితే మంచి ఫలితం ఉంటుంది. నా క్రియను వేగవంతం చేస్తుంది. తీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వులు కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
Drink ఈ మిరియాల పాలను ఎలా తయారుచేసుకోవాలి
నల్ల మిరియాల పాలను తయారు చేయాలి అంటే, మొదట ఒక గ్లాస్ పాలు మీడియం మంట మీద వేడి చేసి, దానికి ఒక చిటికెడు నల్ల మిరియాల పొడిని కలపాలి, తరువాత బాగా కలిపే రెండు మూడు నిమిషాలు మరిగించాలి… తద్వారా నల్ల మిరియాల పోషకాలు పాలలో కరిగిపోతాయి. ఆ తరువాత చల్లార్చి రుచిని పెంచడానికి… ఆరోగ్యంగా చేయడానికి. మీరు దానికి ఒక టీ స్పూన్ పసుపును కూడా జోడించవచ్చు. ఆ తర్వాత దాన్ని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. పోయేముందు ఈ పాలు తాగితే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి, మంచి నిద్ర కూడా వస్తుంది. కో ఏదైనా అలర్జీ లేదా గ్యాస్టిక్ సమస్యలు ఉంటే పసుపు కలిపిన పాలు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. దీనికి వైద్యం సంప్రదించవలసి ఉంటుంది.