Diabetes : మనకు ఆరోగ్యం బాగాలేకపోయినా జలుబు, జ్వరం, దగ్గు వంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా వైద్యుడికి వెళ్లేందుకు ఆలోచిస్తాం. పరిస్థితి మరీ తీవ్రమైతే తప్ప ఆసుపత్రికి వెళ్లం.అయితే వాటిని తగ్గించుకునేందుకు మాత్రం చిన్న చిన్న చిట్కాలు పాటిస్తా. క్షణాల్లో ఆరోగ్యాన్ని చక్కదిద్దుకునేందుకు ట్రై చేస్తాం. అయితే చాలా మందికి మాత్రం చిన్న చిన్న చిట్కాలు కూడా తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఇంట్లో చెప్పేందుకు పెద్దవాళ్లు లేకపోతే మాత్రం మరిన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యుడి వద్దకు పరుగులు పెట్టే వారి కోసమే ఈ చిన్న చిన్న చిట్కాలు. వీటిని పాటిస్తే ఆరోగ్యంతో పాటు పలు సమస్యలను దూరం చేసుకోవచ్చు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఈ మధ్య చాలా మందికి షుగర్ వస్తోంది. అయితే ఎక్కువ శాతం మందిలో చక్కెర స్థాయిలు పెరిగి పలు సమస్యలను తెచ్చిపెడుతోంది.
ఈ షుగర్ రక్తంలో పెరిగితే తిరిగి తగ్గడం చాలా కష్టమని అసలు తగ్గదనే భయంతో చాలా మంది మందుల మీద ఆధారపడుతారు. అలాంటి వారు ఒక్కసారి ఈ వంటింటి చిట్కాలను పాటిస్తే… షుగర్ సాధారణ స్థితికి వచ్చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేరేడు గింజలు షుగర్ వ్యాధికి అద్భుతంగా పనిచేస్తాయి. నేరేడు గింజలను మెత్తగా దంచి అన్నంలో కలుపుకొని తిన్నా.. లేదంటే నీళ్లలో కలుపుకొని తాగిని మంచి ఫలితం ఉంటుందట. అంతే కాకుండా 8 గంటల పాటు మెంతులను నానబెట్టి 24 గంటల పాటు వెచ్చని ప్రదేశంలో ఉంచాలి. అలా మొలకలు వచ్చిన వాటిని ఎండబెట్టి ఆ తర్వాత దోరగా వేయించాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి జత చేసి కారప్పొడిలా తయారు చేసుకోవాలి. వాటిని టిఫిన్లలో కానీ అన్నంలో కాని తినడం వల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుపడుతుందట.
ముఖ్యంగా మెంతుల్లో రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యం ఉంటుందట.అలాగే గింజ తీసేసిన ఉసిరికాయలను, పసుపు కొమ్ములను సమాన భాగాలుగా తీసుకొని మొత్తగా దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ప్రతీరోజు ఒక చెంచా వరకు రెండు పూటలా మజ్జిగలో కలిపి తీసుకుంటే మధఉమేహం ఇట్టే తగ్గిపోతుందట. అంతే కాకుండా పాడపత్రి ఆకులు, మారేడు లేత చిగుళ్లు, నేరేడు గింజల లోపలి పప్పు సమాన భాగాలుగా తీసుకొని ఎండబెట్టాలి. బాగా ఎండాకా వీటిని పొడి చేసుకొని మజ్జిగలో కలిపి తాగడం వల్ల కూడా షుగర్ కంట్రోల్ లోకి వస్తుందట. అలాగే మధుమేహ సమస్యతో బాధపడే వారు చక్కెర దూరంగా ఉంటూ… ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.