Eating Hot Food : మీకు వేడివేడి ఆహారం ఇష్టమా… అయితే, ఈ అనారోగ్య సమస్యలు తప్పవు…?
ప్రధానాంశాలు:
Eating Hot Food : మీకు వేడివేడి ఆహారం ఇష్టమా... అయితే, ఈ అనారోగ్య సమస్యలు తప్పవు...?
Eating Hot Food : వేడివేడి ఆహారాలను తినాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా, వర్షాకాలంలో వేడివేడిగా తినాలని కోరిక ఉంటుంది. ఇష్టంగానూ వేడివేడిగా ఆహారాలను ఇంకా రైస్ ను తింటూ ఉంటారు. ఇలా వేడివేడిగా ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో చాలామందికి తెలియదు. ఇలా వేడివేడి ఆహారాలను తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.. మరి దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. ఎవరికైనా ఆహారం రెడీ కాగానే వేడివేడిగా ఉన్నప్పుడే దానిని తినేయాలని అలాగే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కాలంలో వేడివేడిగా అప్పటికప్పుడు వండుకొని తింటూ ఉంటారు. కాలంలో కూడా వేడివేడి ఆహారాలను ఎక్కువగా తీసుకుంటారు. అయితే వేడి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు. వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాం…

Eating Hot Food : మీకు వేడివేడి ఆహారం ఇష్టమా… అయితే, ఈ అనారోగ్య సమస్యలు తప్పవు…?
Eating Hot Food వేడివేడి ఆహారాలను తీసుకుంటే ఏమవుతుంది
65 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ఆహార పదార్థాలను, పానీయాలను తీసుకున్నట్లయితే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ముఖ్యంగా అన్నవాహికలో సన్నని పోరా కాలిపోతుందట. దీనివలన భవిష్యత్తులో అనేక సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది.అందుకే ఎట్టి పరిస్థితుల్లో అతిగా వేడిగా ఉండే ఆహారాలను తీసుకోకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని సార్లు వేడివేడి ఆహారాలు లేదా వేడివేడి టీ,కాఫీలు వంటి డ్రింక్స్ ని, కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలా చేసినప్పుడు నాలుక లేదా కడుపులో వేడి బాగా పెరిగే కాలినట్లు అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మరోసారి అసలే వేడి ఆహారం తీసుకోకూడదట.దీని వలన కడుపులో మంట, కణజాలంలో మార్పులు సంభవించి. క్యాన్సర్ కు దారి తీసే ప్రమాదం కూడా ఉంది.
కొన్ని సార్లు వేడివేడి అన్నం తింటే ఇబ్బంది ఏర్పడుతుంది. ముఖ్యంగా, నాలుక చాలా సున్నితంగా కాలినట్లు అనిపిస్తుంది. ఆహారం తీసుకోవడం కూడా కష్టంగా అవుతుంది. అలాంటి సందర్భంలో వేడి వేడి అన్నం అసలే తీసుకోకూడదు. మీ శరీరానికి హెచ్చరికగా భావించాలి. లేకపోతే అనేక సమస్య ఎదురు కావాల్సి వస్తుంది. కొంతమందికి ధూమపానం, మద్యపానం వంటి అలవాటు కూడా ఉంటుంది. అలాంటివారు అసలే వేడి ఆహారాలను అస్సలు తీసుకోకూడదట. దీనివల్లన నోటిలోని శ్లేష్మ పొర పొగాకు వలన ప్రభావితమవుతుంది. అటువంటి సమయంలో వేడి వేడి ఆహారాలు తీసుకున్నట్లయితే, ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు,నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే.