Surprising Benefits : మీరు రోజు తాగే నీటిలో చిటికెడు ఉప్పుని కలిపి చూడండి…. ఆ తరువాత ఒక అద్భుతమే జరుగుతుంది…?
ప్రధానాంశాలు:
Surprising Benefits : మీరు రోజు తాగే నీటిలో చిటికెడు ఉప్పుని కలిపి చూడండి.... ఆ తరువాత ఒక అద్భుతమే జరుగుతుంది...?
Surprising Benefits : వేసవికాలం కదా ఎక్కువగా శరీరం చమటలతో తడిసిపోతుంటుంది. దీనివలన శరీరం అలసిపోయి, నీరసం, నిసత్తువ ఏర్పడుతుంది. ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా శరీరం చెమటల వలన డిహైడ్రేషన్కు గురవుతుంది. దీంతో నీటిలోపం ఏర్పడవచ్చు. శరీరంలో ఎలక్ట్రోలైట్ ల తగ్గుదల కూడా జరుగుతుంది. అలాంటి సమయంలో గ్లాస్ నీటిలో చిటికెడు ఉప్పును కలిపి తాగితే. అనేక ఆరోగ్య సమస్యలకు ఎంతో ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది ఎండ తీవ్రత నుంచి శరీరాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచగలదు. కండరాల నొప్పులను తగ్గించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.

Surprising Benefits : మీరు రోజు తాగే నీటిలో చిటికెడు ఉప్పుని కలిపి చూడండి…. ఆ తరువాత ఒక అద్భుతమే జరుగుతుంది…?
మూడు ఋతువుల కాలంలో, వర్షాకాలం శరీరం నుంచి చెమటలు అంతగా రావు. చలికాలంలో కూడా శరీరం నుంచి చెమటలు రావు. కానీ ఎండాకాలంలో మాత్రం శరీరం అధిక వేడి వల్ల చమటలతో తడిసిపోతుంది. కానీ శరీరం చల్లగా ఉంచుకోవడం ఎంత అవసరమో, ఎక్కువ చెమటలు పట్టడం కూడా ముఖ్యం. అధికంగా చెమటలు పడితే నీటి లోపం శరీరంలో ఏర్పడవచ్చు. ఎలక్ట్రోలైట్ల తగ్గుదల వంటి సమస్యలు ఆరోగ్యం పై ప్రభావం చూపించవచ్చు. అలాంటి సమయంలో గ్లాస్ నీటిలో చిటికెడు ఉప్పు వేసుకొని తాగితే శరీరానికి అనేక రకాలుగా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరాన్ని హైడ్రేట్ చేయటానికి సహాయపడటమే కాకుండా, జీర్ణ క్రియను మెరుగుపరచడానికి.ఇంకా, కండరాల నొప్పులను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి ఈ సాధారణమైన ఉప్పు నీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం…
Surprising Benefits ఉప్పును కలిపిన నీటిని తాగితే ఏం జరుగుతుంది
మన శరీరం అధిక చెమట ద్వారా ముఖ్యమైన ఖనిజాలను కోల్పోతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరం ఎలక్ట్రోలైట్లను కోల్పోవడం చేత నీరసం, అలసట, దాహం, మలబద్ధకం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఈ లోటు భక్తి చేసేందుకు తాగునీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది సోడియం, పొటాషియం, మెగ్నీషియం లాంటి కనిజాలను సముతుల్యం చేయడంలో సహాయపడుతుంది. శరీరానికి ఎల్లప్పుడూ తేమా ఉండడం ఎంతో అవసరం. వచ్చే మాటలు పట్టే పరిస్థితిలో ముఖ్యంగా ఎండలో ఎక్కువసేపు పనిచేసే వ్యక్తులకు, వ్యాయామం చేసే వారికి డిహైడ్రేషన్ సమస్యలు ఎదుర్కొంటారు. వీరు ఈ ఉప్పునీటిని తాగితే ఉప్పులో ఉండే సోడియం శరీరంలోని నీటి నిల్వ ఉంచేలా సహాయపడుతుంది. దీనివల్ల నీరసం తగ్గి, అలసట కూడా తగ్గి శరీరం ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉంటుంది.
వ్యాయామం చేసినప్పుడు శరీరం అధిక శక్తిని వినియోగించి, కండరాల నొప్పి, అలసట అనుభవించినప్పుడు తక్షణ ఉపశమనం పొందే అందుకు ఉప్పు నీరు మంచి పరిష్కారం అందిస్తుంది. దీనివల్ల కండరాలు కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ కూడా మెరుగుపడుతుంది. కండరాల తిమ్మిరి, నరాల బిగుతు సమస్యలు, కూడా ఎదురైనప్పుడు ఉప్పునీరు తాగితే ఎంతో మేలు జరుగుతుంది. కారం సరిగ్గా జీర్ణం అవ్వాలంటే శరీరంలో సరైన మోతాదులో ఆమ్లాలు ఉత్పత్తి కావాలి. కొన్ని సందర్భాలలో ఆమ్ల ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు ఆహారం త్వరగా జీర్ణం అవ్వక, గ్యాస్, సమస్యలు ఎదురవుతుంటాయి. ఉప్పునీరు తాగితే కడుపులో ఆమ్లస్థాయిలో సరిగ్గా జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. తాగునీటిలో చిటికెడు ఉప్పు నీరు కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు, అయితే, ముఖ్యంగా మూతపిండాల సమస్యలు ఉన్నవారు ఉప్పునీరు తాగటం మానుకోవడం మంచిది. ఉప్పు తీసుకుంటే మూత్రపిండాలపై ఎక్కువ వద్దులే కలిగించవచ్చు. అలాగే హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు కూడా వైద్యుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఉప్పునీరు తాగాలి. చిటికెడు ఉప్పుతో నీటిని తాగండం అనేది సాధారణమైన విషయం అయినప్పటికీ… ఇది శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.