Protein food : ప్రోటీన్ ఎక్కువ అయితే ఏమవుతుందో తెలుసా…?
Protein food : మన శరీరానికి ప్రోటీన్స్ ఎంతో అవసరం. అయితే ప్రోటీన్స్ తక్కువ తీసుకున్న నష్టమే, ఎక్కువ తీసుకున్న నష్టమే. ప్రోటీన్స్ ఎక్కువైన వారిలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వలన బ్లడ్ లో పీహెచ్ లెవెల్ లో మార్పులు వస్తాయి. దీని వలన ఎముకలు బలహీనంగా అయిపోతాయి. బ్లడ్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వలన లివర్ ప్రోటీన్ ఫ్యాట్ లాగా మార్చేస్తుంది. ఈ క్రమంలో లివర్ నుంచి యూరియా యూరిక్ యాసిడ్ వంటి చెడు పదార్థాలు బయటికి రిలీజ్ అవుతాయి. అయితే ఇలా వచ్చిన చెడు పదార్థాలను బయటికి పంపించడానికి కిడ్నీల అవసరం పడుతుంది.
అయితే కిడ్నీలు 50 శాతం వరకు ఈ వేస్ట్ పదార్థాలను బయటికి పంపించగలుగుతాయి. మిగతా పదార్థాలు ఉండటం వలన కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. దీంతో బోన్స్ ఎఫెక్ట్ పడతాయి. తద్వారా కీళ్ల నొప్పులు వస్తాయి. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వలన లివర్ కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. అలాగే జంతువుల ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వలన జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఎక్కువ ప్రోటీన్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండడమే మంచిది. అయితే మొక్కల నుంచి వచ్చిన ప్రోటీన్స్ డ్రై ఫ్రూట్స్ డ్రైనట్స్ లో ఉండే ప్రోటీన్ వలన ఎటువంటి ప్రమాదం జరగదు.
అయితే చాలామంది ప్రోటీన్ పౌడర్స్ షేక్స్ వాడుతుంటారు. వీటిని ఎక్కువగా తాగటం వలన శరీరంలో ప్రోటీన్స్ మోతాదు ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోకుండా ఉండడమే మంచిది. అయినా ఏ ఆహారాన్ని అయినా పరిమితిలో తింటే ఆరోగ్యానికి మంచిది. దేనినైనా ఎక్కువగా తింటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. వచ్చాక బాధపడడం కంటే ముందు నుంచి జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలుగా ఆరోగ్యం చక్కగా ఉంటుంది.