Egg : ఎగ్స్ తినేటప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా… అసలుకే ఎసరు…
ప్రధానాంశాలు:
Egg : ఎగ్స్ తినేటప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా... అసలుకే ఎసరు...
Egg : మనల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుటకు మంచి ప్రోటీన్ ఆహారాన్ని తీసుకోవాలి. అయితే గుడ్లను తినేటప్పుడు కొంతమంది కొన్ని తప్పులు చేస్తుంటారు. గుడ్లు తినడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది అనే విషయం పక్కన పెడితే, గుడ్ల వల్ల ఆరోగ్యం ఏమో కానీ, తీవ్ర హాని కూడా కలగవచ్చని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అసలు గుడ్డు ఏ సమయంలో తినాలో ఇక్కడ తెలుసుకుందాం…
కోడిగుడ్లు ఒక మంచి ఫుడ్ గా చెప్పబడింది. ఇందులో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ బి టు లోపం ఉన్నవారు దీన్ని రోజు తినాలి. గుడ్లు తినడం వల్ల బలహీనతను తగ్గించి బలం పెంచుతుంది. మద్యస్థ పరిమాణంలో ఉండే గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఫిట్నెస్ కావాలని అనుకునేవారు గుడ్డుని తప్పకుండా తినాలి. ఇది కండరాలని నిర్మించడంలో సహాయపడుతుంది. దీని వినియోగించడం వల్ల ఫొలేట్, విటమిన్ ఏ, విటమిన్ B5,B12, ఫాస్ఫరస్,సెలీనియం లను కూడా అందిస్తుంది. అసలు విషయానికి వస్తే గుడ్లు తినేటప్పుడు కొంతమంది చాలా తప్పులు చేస్తుంటారు. ఇలా చేస్తే గుడ్డులో మనకి లభించాల్సిన ప్రోటీన్ అందదు. తద్వారా ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. మరి ఆ తప్పులు ఏమిటో తెలుసుకుందాం…
Egg పచ్చి గుడ్డు వద్దు
గుడ్లని బాయిల్ చేసి తినాలి. పచ్చి గుడ్లను అస్సలు తినకూడదు. ఈ గుడ్డులో సాల్మొనెల్ల బ్యాక్టీరియా ఉంటుంది. సాల్మొనెల్ల సంక్రమణ ప్రమాదాన్ని విపరీతంగా పెంచుతుంది. ఒక్కొక్కసారి ఫుడ్ పాయిజన్ కూడా కావచ్చు. పచ్చి గుడ్లలో అవిడిన్ అనే ఆంటీ న్యూట్రియంట్ ఉంటుంది. ఇది బయోటిన్ తో బంధిస్తుంది. బయోటిన్ లోపం ఏర్పడుతుంది. జుట్టు ఆరోగ్యానికి ఈ విటమిన్ చాలా ముఖ్యం. ఈ విటమిన్ లోపం వల్ల జుట్టు సమస్య దారి తీస్తుంది. 1998 నాటి వైద్య అధ్యయనం ప్రకారం శరీరానికి 90% ప్రోటీన్లు ఉడికించిన గుడ్ల నుంచే లభిస్తుంది. కానీ పచ్చి గుడ్ల నుంచి వచ్చే ప్రోటీన్ రాత్రి మాత్రమే అందుతాయి. మిగిలిన ప్రోటీన్ అంతా వృధాప్రాయస అవుతుంది.
Egg గుడ్డు తినటానికి ఉత్తమ మార్గం ఏమిటి?
ఉడకపెట్టిన గుడ్డును తినడం వల్ల, ప్రమాదకరమైన బ్యాక్టీరియా సాల్మొనెల్ల, యాంటీ న్యూట్రియంట్ అవిడింట్ నాశనం చేస్తుంది. అదనంగా ప్రోటీన్ కూడా అందుతుంది. అవును పచ్చి గుడ్లు తినడం కంటే ఎప్పుడూ బాయిల్ చేసిన గుడ్డుని తినడం మంచిది. కించి తినడం వలన ఆరోగ్యానికి మంచిది.
గుడ్లు తినడానికి ఉత్తమ సమయం ఏది : మనం రెండు సమయాల్లో గుడ్లు తినొచ్చు. ఒకటి ఉదయం టైం లో, మరొకటి రాత్రి సమయంలో. ఉడకపెట్టిన గుడ్లు తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాత్రిపూట గుడ్లు తినడం వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఉదయం టైం లో గుడ్లు తినడం వల్ల రోజంతా శక్తి లభిస్తుంది. గుడ్లు తినడం వల్ల చాలాసేపు ఆకలి తగ్గి కడుపు నిండినట్లుగా ఉంటుంది. తద్వారా బరువు కూడా తగ్గడానికి సహాయపడుతుంది. రాత్రిపూట గుడ్లు తింటే శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మన కండరాలు రిలాక్స్ అవుతాయి. సన్నగా ఉన్నవారు బరువు పెరగాలంటే రాత్రిపూట గుడ్లు తినడం చాలా ప్రయోజనకరం. రాత్రి సమయంలో రెండు నుంచి మూడు గుడ్లు తినవచ్చు. చిన్నపిల్లలకు కూడా నైట్ పూట ఎగ్గు ఇవ్వడం వల్ల పుష్టిగా ఉంటారు