Diabetes : ఒంట్లో షుగర్ ఉందా.. అయితే ఇంట్లో ఇవి ఉండాల్సిందే అంటున్న ఆరోగ్య నిపుణులు
Diabetes : షుగర్ నేటి రోజుల్లో అనేక మందిని వేధిస్తున్న సమస్య. ఈ సమస్యకు సరైన చికిత్స కానీ మందు కానీ ఇప్పటి వరకు సైంటిస్టులు కనుక్కోలేదు. ఈ వ్యాధి కనుక ఒక్క సారి అటాక్ చేస్తే ఇక మనం తినే ఆహారాలను చాలా కంట్రోల్ గా తినాలి. ఏది తిన్నా కానీ లెక్కలేసుకుని మరీ తినాలి. అలా పద్ధతిగా తింటేనే షుగర్ వ్యాధి మన కంట్రోల్ లో ఉంటుంది. లేకుంటే అదే మనల్ని కంట్రోల్ లోకి తీసుకుని ఆటాడిస్తుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి బారిన పడిన తర్వాత లెక్కలేసుకుని తినడం అలవాటు చేసుకోవాలి.
లేదు మా ఇష్టం వచ్చినట్లు తింటాం.. మా ఇష్టం వచ్చినట్లు ఉంటాం. అని పొగరుగా వ్యవహరిస్తే ఆసుపత్రి పాలవడం పక్కా. కాబట్టి అణిగిమణిగి ఉండడం అలవాటు చేసుకోవాలి.షుగర్ తో బాధపడే వారు ముఖ్యంగా ఆహారపు అలవాట్ల మీద దృష్టి పెట్టాలి. ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్లు తినేయకూడదు. మనం తినే ఆహారంలో ఎక్కువగా పిండి పదార్థాలు లేకుండా చూసుకోవాలి. కేవలం మాంసకృత్తులు, కొవ్వులను మాత్రమే తీసుకోవాలి. ఇవయితే తొందరగా జీర్ణం కావు. కాబట్టి ఎటువంటి సమస్యా ఉండదు.
Diabetes : ఇవి తింటే సరిపోతుంది..
అదే త్వరగా జీర్ణమయ్యే ఆహారాలను గనుక తీసుకుంటే మనం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనం తినే ఆహారంలో ప్రొటీన్స్ కూడా ఉండేలా చూసుకోవాలి. ఇవి కూడా జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి.. కాబట్టి మనకు ఎటువంటి సమస్యా రాదు. అలా కాకుండా నేను పిండి పదార్థాలే తీసుకుంటాను అని మొండికేసి కూర్చుంటే మాత్రం షుగర్ లెవెల్ పెరిగిపోతుంది. తర్వాత ఆసుపత్రిలో మనమే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.