Health Tips : ఈ టిప్స్ పాటించారంటే .. ఆంటీలు అమ్మాయిల లాగా కనిపిస్తారు ..!!
Health Tips : చాలామంది ఆడవారు ఎప్పటికీ యవ్వనంగా ఉండాలని కోరుకుంటారు. కొంతమంది 40 ఏళ్ల వయసులో కూడా తమ అందం ఏమాత్రం చెక్కుచెదరకుండా జాగ్రత్తలు పాటిస్తుంటారు. వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు, మచ్చలు చర్మం కాంతివంతంగా లేకపోవడం తెల్ల వెంట్రుకలు రావడం వంటి సమస్యలు మొదలవుతాయి. దీంతో అందంగా కనిపించరు. పెరిగే వయసును ఆపలేం కాబట్టి దాని ప్రభావాన్ని తగ్గించవచ్చు. 40 ఏళ్ల వయసులో కూడా 20 లో లాగా కనిపించాలంటే యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఎక్కువగా తినాలని నిపుణులు అంటున్నారు.
సరైన ఆహార పదార్థాలను తింటే ఎప్పటికీ యవ్వనంగా ఉండటం గ్యారెంటీ అని అంటున్నారు పరిశోధకులు. మన చర్మం అందంగా మెరవాలంటే పెరుగును ప్రతిరోజు తినాలి. పెరుగులో ఉంటే ప్రోబయోటిక్స్ శరీరంలోని మంచి బ్యాక్టీరియాను పోషిస్తుంది. శరీర రంద్రాలను నింపుతుంది. పెరుగులో ఉండే విటమిన్ బి12 చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అలాగే పచ్చని ఆకు కూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకుకూరల్లో ఉండే క్లోరోఫిల్ చర్మంలో కొల్లాజెన్ ను పెంచుతుంది. ఇది వృద్ధాప్యంతో పోరాడటానికి సహాయపడుతుంది.
చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలంటే బొప్పాయి ప్రతిరోజు తినాలి. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు వృద్ధాప్యానికి వ్యతిరేకంగా పోరాడుతాయి. అలాగే దానిమ్మలో పునికాలాగిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తుంది. అందుకే చర్మం ఎక్కువకాలం యవ్వనంగా ఉండాలంటే ప్రతి రోజు దానిమ్మలు తినాలి. క్యాబేజీ లో బలమైన ఆంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను నివారిస్తుంది. దీంతో చర్మం డ్యామేజ్ కాకుండా ఉంటుంది. క్యాబేజీని సలాడ్ లేదా తేలికగా ఉడకబెట్టి తీసుకోవచ్చు.