Fridge Water : వామ్మో… ఈ వేసవిలో చల్లగా ఉన్నాయని తెగ తాగుతున్నారా.? అయితే ఇక అంతే సంగతులు…!
Fridge Water : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగ లకు ప్రజలు చల్ల చల్లగా నీటిని తాగడానికి ఇష్టపడతారు. ఎండలో బయటకు వెళ్ళినప్పుడు చెమటలు వస్తుంటాయి. దాహం వేస్తుంది. ఇక ఏ సమయంలో బయటకి వెళ్ళిన ఇంట్లోకి రాగానే చల్ల చల్లని నీళ్లు తాగాల్సిందే.. అయితే ఫ్రిడ్జ్ లోని చల్లటి నీటిని తాగడం వల్ల శరీరానికి ఉపశమనం అనిపిస్తుంది. అయితే ఫ్రిడ్జ్ లోని చల్లటి నీరు శరీరానికి ఉపశమనం కలిగించడం ఏమో కానీ ఎక్కువ ప్రమాదం కలిగిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఈ వేసవిలో బయట తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లోని చల్లని నీరు తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఎండ వేడిమి కి ఫ్రిజ్లోని చల్లని నీటిని తాగడం వలన శరీరంపై ఎఫెక్ట్ పడుతుంది. వేసవిలో బయటికి వెళ్లి వచ్చి కూల్ వాటర్ తాగడం వలన ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Fridge Water : దంత సమస్యలు పెరుగుతాయి
చల్లని నీరు తాగడం వలన దంత సమస్యలు ఏర్పడతాయి. పంటి నొప్పి అధికమవుతుంది. పంటి నొప్పితో పాటు చిగుళ్ళ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.
అధిక బరువు పెరుగుతారు:ఫ్రిడ్జ్ లోని చల్లటి నీరు తాగడం వలన బరువు పెరుగుతారని చాలామంది చెప్తూ ఉంటారు. ఇది వాస్తవమే నీటిని తరచుగా తీసుకోవడం వలన శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. ఈ విధంగా చేస్తే బరువు తగ్గడం కష్టమవుతుంది.
అజీర్ణం సమస్య; ఫ్రిజ్లోని చల్లటి నీరు జీర్ణ సమస్యల్ని పెంచుతాయి. వేడి వాతవరణంలో అకస్మాత్తుగా చల్లని నీరు తాగడం వలన రక్తనాళాలు కుచించక పోతాయి. పొట్ట కూడా పెరుగుతుంది. దీని మూలంగా ఆహారం తిన్న తర్వాత జీర్ణ క్రియ ప్రక్రియ మందగిస్తుంది. ఆహారం సరిగా జీర్ణం అవ్వదు. అలాగే చల్లటి నీరు తాగడం వలన జీర్ణ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది.మైగ్రేన్ సమస్య: మైగ్రేన్ ఉన్నవారు తలనొప్పి గురించి బాగా తెలుసు. ఎండలో నడిచేటప్పుడు మైగ్రేన్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లోని చల్లటి నీరు తాగితే తలనొప్పి వెంటనే మొదలవుతుంది.
జలుబు; మండే ఎండ నుండి ఇంటికి వచ్చిన తర్వాత చల్లని నీరు త్రాగే ధోరణి అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది జలుబు వేడిని కలిగించే ప్రమాదం ఉంటుంది. గొంతు సమస్యలు వస్తాయి. స్లేష్మం ఏర్పడుతుంది. అక్కడ నుండి మంట పెరుగుతాయి. కొన్నిసార్లు గొంతు ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు.. మీరు జలుబులు నివారించాలనుకుంటే చల్లని నీటిని తాగకుండా ఉండడమే మంచిది.