Gaju Teega : ఆనందయ్య ఆయుర్వేద మెడిసన్ లో వాడిన గాజు తీగలో ఉండే ఔషధ గుణాలు ఏంటో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Gaju Teega : ఆనందయ్య ఆయుర్వేద మెడిసన్ లో వాడిన గాజు తీగలో ఉండే ఔషధ గుణాలు ఏంటో తెలుసా?

Gaju Teega : ఆనందయ్య ఆయుర్వేద మందు గురించి తెలుసు కదా. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. దేశవ్యాప్తంగా ఈ మందు తెగ ఫేమస్ అయిపోయింది. అందరూ ఆనందయ్య మందు కోసం ఎగబడ్డారు. ఓవైపు వ్యాక్సిన్లు వేస్తున్నా కూడా వాటిని కాదని.. ఆనందయ్య మందు కోసం తెగ ఆరాటపడ్డారు. నిజంగా ఆనందయ్య మందు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కరోనాను నయం చేసే మందు. దీంతో దాని మీద అందరికీ నమ్మకం ఏర్పడింది. ఆయన తయారు చేసే మందులోనూ […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :2 August 2021,6:30 am

Gaju Teega : ఆనందయ్య ఆయుర్వేద మందు గురించి తెలుసు కదా. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. దేశవ్యాప్తంగా ఈ మందు తెగ ఫేమస్ అయిపోయింది. అందరూ ఆనందయ్య మందు కోసం ఎగబడ్డారు. ఓవైపు వ్యాక్సిన్లు వేస్తున్నా కూడా వాటిని కాదని.. ఆనందయ్య మందు కోసం తెగ ఆరాటపడ్డారు. నిజంగా ఆనందయ్య మందు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కరోనాను నయం చేసే మందు. దీంతో దాని మీద అందరికీ నమ్మకం ఏర్పడింది. ఆయన తయారు చేసే మందులోనూ అన్నీ ఆయుర్వేద గుణాలు ఉన్న ఔషధ మొక్కలను ఉపయోగించడంతో అందరూ ఆ మందుపై దృష్టి సారించారు.

gaju teega used in anandayya ayurvedic medicine health benefits

gaju teega used in anandayya ayurvedic medicine health benefits

అయితే… చాలామంది ఆనందయ్య తయారు చేసిన మందులో వాడిన ఔషధ మొక్కల గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు. అందులో ఒకటే గాజు తీగ. దీన్నే బంగారు తీగ అని కూడా అంటారు. బుట్ట బుడస అని కూడా అంటారు. తెల్ల జుంకీ అనే మరో పేరు కూడా ఉంది. ఇది తీగలా ఉంటుంది. ఈ మొక్కకు కాయలు కూడా కాస్తాయి.

gaju teega used in anandayya ayurvedic medicine health benefits

gaju teega used in anandayya ayurvedic medicine health benefits

Gaju Teega : గాజు తీగ ఆయుర్వేద ప్రయోజనాలు ఇవే

ఈ చెట్టు ఆకులే కాదు.. దాని కాయలు కూడా ఔషధ గుణాలు ఉన్నవే. ఈ చెట్టు ఆకుల కషాన్ని తాగితే.. నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు. అలాగే.. ఈ ఆకును పేస్ట్ చేసి నుదుటిపై రాస్తే వెంటనే తలనొప్పి తగ్గుతుంది. ఇక.. చర్మ వ్యాధులకు, దురదకు, అతి సార వ్యాధికి.. ఈ మొక్క ఆకులనే ఉపయోగిస్తారు.

gaju teega used in anandayya ayurvedic medicine health benefits

gaju teega used in anandayya ayurvedic medicine health benefits

ఈ మొక్క ఆకులతో తయారు చేసిన కషాయాన్ని తాగడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల్లో వచ్చి నిమ్ము, కఫం లాంటి సమస్యలకు దాని కషాయమే బెస్ట్ ఔషధం. ఈ మొక్క ఆకులతో పాటు వేర్లను కూడా ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తారు. దాదాపు అన్ని ఆయుర్వేద మందుల్లో ఈ మొక్కకు ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే.. ఈ మొక్కను ఆనందయ్య.. ఆయుర్వేద మందులో ఉపయోగించారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది