Coffee : కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్… మీ ఆయుష్షు పెరుగుతుందంట…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Coffee : కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్… మీ ఆయుష్షు పెరుగుతుందంట…!

 Authored By ramu | The Telugu News | Updated on :26 June 2024,7:00 am

coffee : కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్. ప్రస్తుత సైన్స్ అలెర్ట్ లో ప్రచురితమైన ఒక అధ్యయన ప్రకారం చూస్తే, కాఫీ తాగే వారి వయస్సు పెరుగుతుంది. అవునూ మీరు విన్నది నిజమే. కాఫీ తాగని వారితో పోల్చినట్లయితే కాఫీ అలవాటు ఉన్నవారిలో మరణాల సమస్య చాలా తక్కువగా ఉంది అని పరిశోధనలో తేలింది. US లో జరిపిన ఈ అధ్యయనంలో పలు కీలక విజయాలు గురించి తెలిపారు.. గంటలు తరబడి అదే పనిగా కూర్చోవటం మరియు ఎక్కువసేపు కూర్చొని పని చేయటం వలన అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అని ఇప్పటికే వైద్యులు చాలా సార్లు హెచ్చరిస్తూనే ఉన్నారు.

అయితే ఎక్కువ సేపు కుర్చున ప్పటికీ రోజు కాఫీ తాగటం వలన మరణ ముప్పు అనేది తగ్గించుకోవచ్చు అని తాజా అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో కాఫి ఆశ్చర్యకరమైన పని చేస్తుంది అని పరిశోధకులు తెలిపారు. కాఫీ తాగని వారితో పోల్చినట్లయితే ఎక్కువ సేపు కూర్చొని ఉన్నప్పటికీ రోజు కాఫీ తాగే వారి ఇతర కారణాల వలన చనిపోయే ముప్పు చాలా తక్కువగా ఉంది అని తెలిపారు. పదివేల మందిపై జరిపిన ఈ అధ్యయనంలో విషయాలనేవి బయటకు వచ్చాయి. నిచ్చల జీవనశైలి కలిగి కాఫీ అలవాటు ఉన్న వారు హృదయ సమస్యలతో మరణించే ముప్పు చాలా తక్కువగా ఉంది అని పరిశోధకులు తెలిపారు. అలాగే ఎక్కువసేపు కూర్చొని కాఫీ తాగే వారితో పోల్చినట్లయితే రోజుకు 2.5 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగే వారిలో మొత్తంగా మరణాల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంది.

Coffee కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్ మీ ఆయుష్షు పెరుగుతుందంట

Coffee : కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్… మీ ఆయుష్షు పెరుగుతుందంట…!

అని పరిశోధకులు తెలిపారు. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు ఈ ప్రయోజనాలకు దోహదం చేస్తాయి అని చెప్పారు. క్రమమైన శారీరక శ్రమ మరియు పోషకమైన ఆహారం లాంటి ఇతర ఆరోగ్యకరమైన జీవన శైలి అలవాట్ల తో సమతుల్య ఆహారంలో భాగంగా ఈ కాపీని కూడా ఎక్కువగా తీసుకోవటంలో తప్పు ఏమీ లేదు అని పరిశోధకులు తెలుపుతున్నారు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది