Chicken : చికెన్ స్కిన్ తో మంచిదా..? స్కిన్ లెస్ మంచిదా.? ఎవరు ఎటువంటి చికెన్ తీసుకోవాలంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chicken : చికెన్ స్కిన్ తో మంచిదా..? స్కిన్ లెస్ మంచిదా.? ఎవరు ఎటువంటి చికెన్ తీసుకోవాలంటే…!

Chicken : చాలామంది నాన్ వెజ్ అంటే ఇష్టంగా తింటూ ఉంటారు. ఇక అందుట్లో చికెన్ అంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు. ప్రతి వారంలో మాంసాహారులు ఒక్కసారైనా వారి ఆహారంలో చికెన్ ను యాడ్ చేస్తూ ఉంటారు. అయితే చికెన్ ఎక్కువగా తీసుకునేవారు అలాగే వారంలో రెండు మూడు సార్లు ఫ్రై లేదా చికెన్ కర్రీ తయారు చేసుకుని ఏదో ఒక డిష్ అయితే తింటూ ఉంటారు. కొందరైతే నీచు లేకుండా ముద్ద దిగని […]

 Authored By prabhas | The Telugu News | Updated on :11 November 2022,6:30 am

Chicken : చాలామంది నాన్ వెజ్ అంటే ఇష్టంగా తింటూ ఉంటారు. ఇక అందుట్లో చికెన్ అంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు. ప్రతి వారంలో మాంసాహారులు ఒక్కసారైనా వారి ఆహారంలో చికెన్ ను యాడ్ చేస్తూ ఉంటారు. అయితే చికెన్ ఎక్కువగా తీసుకునేవారు అలాగే వారంలో రెండు మూడు సార్లు ఫ్రై లేదా చికెన్ కర్రీ తయారు చేసుకుని ఏదో ఒక డిష్ అయితే తింటూ ఉంటారు. కొందరైతే నీచు లేకుండా ముద్ద దిగని వాళ్లు కూడా ఉంటారు. సహజంగా చికెన్ తీసుకోవడానికి షాప్ కి వెళ్ళగానే చాలామంది స్కిన్ లెస్ చికెన్ ఇంకొందరు స్కీంతో ఉన్న చికెన్ కొంటూ ఉంటారు. అయితే మనకి కావాల్సింది ఏది చెప్తే దానికి అనుగుణంగా డ్రెస్సింగ్ చేసి ఇస్తూ ఉంటారు. చాలామంది స్కిన్ తో ఉన్న చికెన్ ఇష్టపడరు. స్కిన్ చికెన్, స్కిన్లెస్ చికెన్ ధరల్లో కూడా తేడా ఉంటుంది. పోయిన సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 13.30 కోట్ల టన్నుల కోడి మాంసాన్ని ఉపయోగించినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ అంచనా వేయడం జరిగింది. భారత్లో అయితే ఈ వినియోగం 41 లక్షల టన్నుల కన్నా అధికంగానే ఉపయోగించినట్లు తెలిసింది.

కొవ్వు తక్కువగా ఉండడం, పోషక ఆహార పదార్థాలు అధికంగా ఉండడంతో పాటు శరీరానికి ఉపయోగం కలిగించే మ్యానోశాచురేటడ్ కొవ్వులు కోడి మాంసములో గణనీయంగా ఉంటుంటాయి. ఈ కొవ్వులు ఉండే సంబంధిత ఆరోగ్యానికి మంచి చేస్తూ ఉంటాయి. చికెన్ తీసుకునేటప్పుడు స్కిన్ తో తినడం మంచిదా.? స్కిన్లెస్ తీసుకోవడం మంచిదా.? అనే ప్రశ్న ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. చికెన్ స్కిన్ లో 32 శాతం కొవ్వు ఉంటుంది. అంటే ఒక కిలో చికెన్ స్కిన్ తీసుకుంటే అందులో 320 గ్రాముల కొవ్వు ఉంటుందని పోషకాహార నిపుణులు తెలియజేయడం జరిగింది. చికెన్ స్కిన్ లో ఉండే కొవ్వులలో మూడింట, రెండింతలు అసంతృప్తి కొవ్వులు కలిగి ఉంటుంది. వీటినే మంచి కొవ్వుగా కూడా అంటుంటారు. బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మెరుగుపరచటంలో ఈ కొవ్వు చాలా ఉపయోగపడుతుంది. స్కిన్ తో తీసుకుంటే సహజంగా కంటే దాదాపు 50 శాతం క్యాలరీలను పొందవచ్చు. 170 గ్రాముల స్కిన్లెస్ చికెన్ ని తీసుకుంటే 284 క్యాలరీల శరీరంలోకి చేరుతాయి. ఎత్తుకు తగినంత బరువు ఉండి శారీరకంగా చురుగ్గా ఉండే మనుషులు దీనిని వండేటప్పుడు చికెన్ స్కిన్ అలాగే ఉంచి తినే ముందు స్కిన్ ని తీసేస్తే మంచిది.

Good with skin or good with skin or skinless who should take which chicken

Good with skin or good with skin or skinless who should take which chicken

అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. వండేటప్పుడు చికెన్ ఫ్రై స్కిన్ ఉండడం వలన కూరకు తగిన రుచి కూడా ఉంటుంది అంటున్నారు. ఈ విషయంలో జాగ్రత్తలు వహించాలి… కొంతమంది చికెన్ ఫ్రిజ్లో పెడుతూ ఉంటారు. వండడానికి ముందు ఫ్రిజ్ లో నుంచి తీసి వంట గదిలో పెడుతూ ఉంటారు. చాలామంది ఫ్రిజ్లో నుంచి తీసి బయటికి కొంతసేపు ఉంచిన తర్వాత మళ్ళీ ఫ్రిజ్లో పెడుతూ ఉంటారు. అలా ఫ్రిడ్జ్ నుంచి తీశాక గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చిన చికెన్ మళ్లీ ఫ్రిజ్లో పెట్టకూడదని పోషక ఆహార వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఆహార పదార్థాలు సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపడం కోసం చికెను ఫ్రిజ్లో నిల్వ ఉంచుతుంటారు. దాన్ని బయటకు తీసి సహజంగా ఉష్ణోగ్రతకు తెచ్చిన తర్వాత సూక్ష్మజీవులు మళ్లీ అధికమవడం మొదలుపెడతా యి. కాబట్టి ఒకసారి ప్రిజ్ నుంచి తీసిన చికెన్ను సాధారణ ఉష్ణోగ్రతకి తెచ్చిన ఆహార పదార్థాన్ని మళ్లీ ఫ్రిజ్లో ఉంచకూడదు. అన్ని రకాల మాంసాలకు ఇవే జాగ్రత్తలు పాటించాలి. అంటున్నారు పోషక ఆహార నిపుణులు. ఒకవేళ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే చికెన్ వండిన తర్వాత దానిని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది