Hibiscus Flower : జుట్టు ఎక్కువగా ఊడిపోతుందా… మందార పువ్వులను ఇలా వాడండి…!
Hibiscus Flower : ప్రతి ఒక్కరూ తమ జుట్టు పొడుగ్గా మరియు బలంగా ఉండాలి అని ఎంతో మంది ఆడవారు కోరుకుంటూ ఉంటారు. అయితే దీని కోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే మార్కెట్లో వచ్చే కొత్త కొత్త ప్రోడక్ట్స్ కూడా వాడుతూ ఉంటారు. కానీ మారిన ఆహారపు విధానాలు మరియు జీవన శైలి కారణంగా జుట్టు కూడా విపరీతంగా ఊడిపోతూ ఉంటుంది. అయితే మొదట్లోనే ఈ సమస్యను తగ్గించుకోకపోయినట్లయితే ఈ సమస్య మరింత పెరిగి […]
ప్రధానాంశాలు:
Hibiscus Flower : జుట్టు ఎక్కువగా ఊడిపోతుందా... మందార పువ్వులను ఇలా వాడండి...!
Hibiscus Flower : ప్రతి ఒక్కరూ తమ జుట్టు పొడుగ్గా మరియు బలంగా ఉండాలి అని ఎంతో మంది ఆడవారు కోరుకుంటూ ఉంటారు. అయితే దీని కోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే మార్కెట్లో వచ్చే కొత్త కొత్త ప్రోడక్ట్స్ కూడా వాడుతూ ఉంటారు. కానీ మారిన ఆహారపు విధానాలు మరియు జీవన శైలి కారణంగా జుట్టు కూడా విపరీతంగా ఊడిపోతూ ఉంటుంది. అయితే మొదట్లోనే ఈ సమస్యను తగ్గించుకోకపోయినట్లయితే ఈ సమస్య మరింత పెరిగి జుట్టు పల్చగా మారే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేయడంలో మందార పువ్వులు ఎంతో అద్భుతంగా పని చేస్తాయి. ఈ మందార పువ్వులలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఈ పువ్వులతో జుట్టును బలంగా మరియు దృఢంగా తయారు చేసుకోవచ్చు. అంతేకాక జుట్టు కూడా పొడవుగా మరియు నల్లగా మారుతుంది. మరి ఈ హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేసేందుకు జుట్టును పొడవుగా మార్చేందుకు మందార పువ్వు ఎలా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
హెయిర్ ఫాల్ కంట్రోల్ కి ఎలా ఉపయోగించాలి : ముందుగా 10 నుండి 15 మందార పువ్వులను తీసుకోవాలి. వాటిని బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను జుట్టుకు మొత్తాన్ని పట్టించి సున్నితంగా మాడ పై మర్దనా చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ ను కనీసం అరగంట పాటైనా ఉంచుకోవాలి. దాని తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపులతో తల స్నానం చేస్తే చాలు. మీరు ఇలా వారంలో రెండు సార్లు ట్రై చేస్తే మీ జుట్టు అనేది అస్సలు ఊడదు…
ఇలా కూడా వాడవచ్చు : మందార పువ్వుల పేస్ట్ ను పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు కొబ్బరి నూనెలో కూడా కలిపి వాడవచ్చు. దీనికోసం ఒక గిన్నెలో రెండు కప్పుల కొబ్బరి నూనె వేసి దానిలో మందార పువ్వులను శుభ్రంగా కడిగి ఆరబెట్టి వాటిలో వేసి బాగా మరిగించాలి. ఆ కొబ్బరి నూనె రంగు మారేంతవరకు నూనెను బాగా మరిగించుకోవాలి. తర్వాత ఈ నూనెను నేరుగా కాకుండా డబల్ బాయిలింగ్ పద్ధతిలో చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ కొబ్బరి నూనె రంగు మారిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని దానిని వడకట్టుకొని గిన్నెను పక్కకు పెట్టాలి. తర్వాత ఈ నూనెను గనుక మీ తలకు బాగా పట్టించుకుని సున్నితంగా మర్దన చేసుకోవాలి. మీరు ఒక పూట తలకు కొబ్బరి నూనె ఉంచి దాని తర్వాత తల స్నానం చేస్తే చాలు. మీరు ఇలా వారంలో రెండు లేక మూడు సార్లు గనక ట్రై చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది…