Hair Growth : వీటితో చేసిన తిన్నారంటే… జుట్టు రాలిపోయే సమస్య పరార్… కేశ సౌందర్యం కొరకు వీటిని తినండి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Growth : వీటితో చేసిన తిన్నారంటే… జుట్టు రాలిపోయే సమస్య పరార్… కేశ సౌందర్యం కొరకు వీటిని తినండి…?

 Authored By ramu | The Telugu News | Updated on :16 March 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Hair Growth : వీటితో చేసిన తిన్నారంటే... జుట్టు రాలిపోయే సమస్య పరార్... కేశ సౌందర్యం కొరకు వీటిని తినండి...?

Hair Growth : శతకాలంలో చాలామంది నివేదిస్తున్న సమస్య జుట్టు రాలడం. ఈ సమస్య వలన అధిక ఒత్తిడి, ఆందోళన మొదలవుతాయి. బట్టతల వస్తుందేమో అని భయపడి పోతారు. జుట్టు పలుచబడటం చూసి మానసిక వేదనకు గురవుతారు. దీనికి గల కారణం, నేటి జీవనశైలిలో, ఆహారపు అలవాట్లు కారణంగా , చిన్న వయసులోనే చాలామందికి జుట్టు రాలే సమస్యలు పెరిగిపోయాయి. జుట్టు రాలిపోవడం, తెల్ల జుట్టు సమస్య తీవ్రంగా వేధిస్తుంటుంది. చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు. అయితే, రోజు తీసుకునే ఆహారంలో జుట్టుకు సంబంధించిన ప్రోటీన్లు తీసుకోవడం చేత జుట్టు రాలే సమస్యను నివారించవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. రోజు తినే ఆహారాలతో పాటు కొన్ని ఆహారాలను చేర్చుట ద్వారా జుట్టు పెరుగుదలకు ఎంతో దోహదపడుతుంది. పెరుగుదలకు అవసరమయ్యే విటమిన్ “బయోటిన్ “.

Hair Growth వీటితో చేసిన తిన్నారంటే జుట్టు రాలిపోయే సమస్య పరార్ కేశ సౌందర్యం కొరకు వీటిని తినండి

Hair Growth : వీటితో చేసిన తిన్నారంటే… జుట్టు రాలిపోయే సమస్య పరార్… కేశ సౌందర్యం కొరకు వీటిని తినండి…?

ఈ బయోటిన్, విటమిన్ బి7, ఎన్నిసార్లు విటమిన్ H అని కూడా పిలుస్తారు.ఇది నీటిలో కరిగే విటమిన్. ఇది బి -కాంప్లెక్స్ సమూహానికి చెందిన విటమిన్. ఇందులో కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల జీవక్రియలో ఎంతో సహకరిస్తుంది. జీవక్రియ ప్రక్రియను ఇది కీలక పాత్ర పోషిస్తుంది. చర్మం, జుట్టు, గోల ఆరోగ్యానికి బయోటిన్ అవసరం. అయితే జుట్టు పెరుగుదల శరీరంలో బయోటిన్ కొరతను తీర్చేందుకు ఈ లడ్డూలను తప్పనిసరిగా తింటే.. మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా, నల్లని నిగారింపుతో, అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది. అని నిపుణులు తెలియజేస్తున్నారు.

Hair Growth బయోటిన్ ఉపయోగం

బయోటిన్ పెరుగుదలకు ఎంతో కీలక పాత్రను పోషిస్తుంది. బయోటిన్ లో విటమిన్ బి 7 లేదా కొన్నిసార్లు విటమిన్ H అని కూడా పిలుస్తారు. ఈ విటమిన్ నీటిలో కరుగుతుంది. బీ -కాంప్లెక్స్ సమూహానికి చెందిన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు జీవక్రియలో సహకరిస్తాయి. తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయుటకు ముఖ్యపాత్రను పోషిస్తుంది. ఈ బయోటిన్ చర్మం, జుట్టు, గోళ్లను ఆరోగ్యంగా ఉంచుటకు అవసరం. జుట్టు బాగా పెరగాలి అంటే ఈ లడ్డును తప్పకుండా తీసుకోవాలి.

బయోటిన్ లోపం వలన : శరీరంలో బయోటిన్ లోపిస్తే జుట్టు రాలడం. చర్మం పొడిబారటం, ఒళ్ళు తెలుసుగా మారటం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే, ఈ లడ్డుతో శరీరానికి అవసరమైన బయోటిన్ పుష్కలంగా అందుతుంది. ఈ ఇంటిలో తేలిగ్గా తయారు చేసుకోవచ్చు.

లడ్డు తయారీ విధానం : ఈ లడ్డును తయారు చేయుటకు, మొదట నువ్వులు, వేరుశనగలు, బాదం, వాల్ నట్స్, ఖర్జూరాలు, ఓట్స్, అవిసె గింజలు, ఎండు కొబ్బరి, గుమ్మడికాయ గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, బెల్లం, తేనె, నువ్వులు, వేరుశనగ పప్పులు, బాదం, వాల్ నట్స్, అవిసె గింజలను విడివిడిగా వీటన్నిటిని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసి. దానిలో కొంచెం నెయ్యి వేసి, లడ్డూ లాగా ఉండలు చుట్టుకోవాలి. ఇలా చేసిన లడ్డుని ప్రతిరోజు ఒకటి చొప్పున తీసుకుంటే, జుట్టు రాలే సమస్య నుంచి బయటపడటమే కాదు, జుట్టు ఎంతో ఆరోగ్యంగా, మృదువుగా, పొడవుగా, ఒత్తుగా, బలంగా తయారవుతుంది. ఇంకా శరీరానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇంకా ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ లడ్డు. ఆరోగ్య సమస్యల భారీ నుండి మన శరీరాన్ని కాపాడుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది