Hair Tips : ఈ ఆయిల్ తో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు..!!
Hair Tips : ప్రస్తుతం మన జీవిస్తున్న జీవనశైలి విధానంలో కొన్ని ఆహారం అలవాట్ల వలన ప్రతి ఒక్కరు జుట్టు రాలే సమస్య రోజురోజుకీ ఎక్కువవుతుంది.. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అయినా కానీ వాటి నుంచి ఎటువంటి ఫలితం ఉండకపోగా ఇంకా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వారందరికీ ఈ ఆయిల్ తో ఆ సమస్యకి చెక్ పెట్టవచ్చు..
సమస్యకి ఆహారపు అలవాట్లు కాలుష్యం అయిపోయింది. దీనికి తోడుగా వెంట్రుకలు సరిగా పెరగకపోవడం, జుట్టు పగిలిపోవడం, చుండ్రు రావడం ఎలా ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇటువంటి సమస్యలకు అన్నిటికీ చెక్ పెట్టడానికి ఇప్పుడు చక్కటి హెర్బల్ ఆయిల్ ను గురించి తెలుసుకోబోతున్నాం..
ఈ ఆయిల్ ను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. మందార పువ్వులు, ఆలివ్ గింజలు, మెంతి గింజలు, కరివేపాకు, కొబ్బరి నూనె, ఒక ఇనప కడాయి.. వీటితో తయారు చేసిన ఈ ఆయిల్ జుట్టు రాలే సమస్యకి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ హెర్బల్ ఆయిల్ జుట్టు సంరక్షణకు చాలా సహాయంగా ఉంటుంది. ఈ ఆయిల్ జుట్టు రాలడాన్ని ఆపి జుట్టు బాగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.. ఈ ఆయిల్ ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.. ముందుగా ఈ ఆయిల్ ని తయారు చేయడానికి ఒక ఇనప కడాయి తీసుకోవాలి. తర్వాత దానిలో కొబ్బరి నూనె వేసి మరిగించాలి. దాని తర్వాత వేడి ఆయిల్ లో కొన్ని కరివేపాకు ఆకులను వేసి గ్యాస్ ఆఫ్ చేయాలి. దాని తర్వాత ఒక చిన్న స్పూన్ అలివ్ గింజలు, ఒక స్పూన్ మెంతి గింజలు వేసి బాగా కలుపుకోవాలి.
దాని తర్వాత మందార పువ్వులను కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ ఆయిల్ న్ని రాత్రి అంతా అలాగే మూత పెట్టి ఉంచుకోవాలి. అంతే హెర్బల్ ఆయిల్ రెడీ అయిపోయినట్లు.. ఈ ఆయిల్ ఎలా ఉపయోగించాలో మనం చూద్దాం.. ఈ ఆయిల్ అప్లై చేసే ముందు ఈ ఆయిల్ ను ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. తర్వాత అరిచేతిలో ఈ ఆయిల్ ని వేసుకొని జుట్టుకి బాగా కుదురుల నుంచి చివర్ల వరకు అప్లై చేస్తూ మసాజ్ చేస్తూ ఉండాలి. తర్వాత మీ స్కాల్ప్ వెనుక భాగంలో కింద నుంచి పైకి బాగా మసాజ్ చేయాలి. మీ చేతి వేళ్ళతో వృత్తాకారంలో మసాజ్ చేసుకోవాలి. ఇలా నిత్యం ఈ ఆయిల్ ని ఇలా అప్లై చేసుకుంటూ ఉంటే జుట్టు రాలడం ఆగి జుట్టు బాగా ఎదుగుతుంది.. అలాగే చుండ్రు, ఇన్ఫెక్షన్లు జుట్టు చిట్లడం లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది..