Hair : ఈ హెయిర్ మాస్క్ ను ఒక్కసారి ట్రై చేస్తే చాలు… తలలో ఒక్క పేను కూడా ఉండదు…??
ప్రధానాంశాలు:
Hair : ఈ హెయిర్ మాస్క్ ను ఒక్కసారి ట్రై చేస్తే చాలు... తలలో ఒక్క పేను కూడా ఉండదు...??
Hair : ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో పేలు కూడా ఒకటి. అయితే తలలో పేలు అనేవి అధికంగా ఉండడం వలన ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే చాలా మందికి తలలో పేలు విపరీతంగా ఉంటాయి. దీని వలన జుట్టు రాలిపోవడం మరియు చుండ్రు పట్టటం, దురద, జుట్టుకు పోషకాలు అందకపోవడం లాంటి సమస్యలు అధికంగా ఉంటాయి. అలాగే తలలో ఉన్న పేలు అనేవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఈ సమస్య వలన మనం బయట ఎక్కువసేపు తిరగలేము. దీని వలన దురద కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే తలలో పేలు ఏర్పడడానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణం మరియు తలలో మురికి ఉండడం వలన తలలో పేలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఈ పేలు అనేవి క్రమక్రమంగా ఎక్కువ సంఖ్యలో ఏర్పడతాయి. అంతేకాక తలలో పేలు పోవడానికి ఎన్నో రకాల చిట్కాలు కూడా ఉన్నాయి. అలాగే తలలో పేలు పోగొట్టుకోవటానికి ఈ హెయిర్ మాస్క్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరీ ఆ హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
Hair పేలు తొలగించే హెయిర్ మాస్క్
పేలు పోగొట్టడానికి ఈ హెయిర్ మాస్క్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో కొబ్బరి నూనెను తీసుకోవాలి. అలాగే దీనిలో కొద్దిగా కలబంద జెల్ మరియు మూడు లేక నాలుగు చుక్కల ట్రీట్రీ ఆయిల్ ను తీసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుండి చివర వరకు వెంట్రుకల మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ ను ఒక గంట పాటు అలా వదిలేయాలి. అయితే ఈ నూనె మీరు పెట్టుకున్నప్పుడు కళ్ళకు అంటకుండా జాగ్రత్త పడాలి.
తర్వాత షాంపూ లేక కండిషనర్ తో తల స్నానం చేసి జుట్టును క్లీన్ చేసుకోవాలి. ఇలా మీరు వారానికి రెండు సార్లు చేయడం వలన మీ తలలో ఒక్క పేను కూడా ఉండదు. అలాగే కెమికల్ ఉన్న వాటిని వాడటం కంటే ఇలా నాచురల్ పద్ధతులను వాడడం వలన పేలు చక్కగా పోతాయి. అలాగే మీరు ఇలా చేయటం వలన జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా తొందరగా పోతాయి. అలాగే జుట్టు రాలటం మరియు చుండ్రు కూడా ఈజీగా తొలగిపోతుంది. మీరు ఈ ప్యాక్ ను అప్లై చేసుకోవడం వలన తల ఎంతో మెత్తగా తయారవుతుంది. అంతేకాక మీ తలలో పేలు ఉన్న లేకపోయినా ఈ హెయిర్ మాస్క్ ను అప్లై చేయడం వలన మీ జుట్టు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.