Hair Tips : ఈ మిశ్రమంతో తెల్ల జుట్టు మాయం.. ఆ ఆకుల పసరుతో మంచి ఫలితం
Hair Tips : తెల్ల జుట్టు సమస్య ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరికీ ఉంది. చాలామందికి వారి వయస్సు కంటే ముందే జుట్టు తెల్లగా మారుతోంది, చాలా మంది జన్యువులు చిన్న వయస్సులోనే జుట్టును వృద్ధాప్యం చేస్తాయని చెబుతారు. అయితే, తెల్ల జుట్టుకు జన్యుపరమైన అంశాలు, మనం తీసుకునే ఫుడ్, ఒత్తిడి మాత్రమే కారణం కాదు.. ఎక్కువగా ఆయిల్ ఫుడ్ మరియు కారంగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా, బయటి ఆహారాన్ని ఎక్కువగా తిన్నా జుట్టు త్వరగా తెల్ల బడుతుంది. జుట్టును కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆకు కూరలు, కూరగాయలు ఎక్కువగా తింటే జుట్టును కాపాడుకోవచ్చు. అలాగే సహజ సిద్దంగా కొన్ని చిట్కాలు పాటించి కూడా తెల్లజుట్టును నల్లగా మార్చవచ్చు.
ఒక స్పూన్ ఉసిరికాయ పొడి బ్లాక్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఈ పొడిలో రెండు స్పూన్ ల హెన్నా పౌడర్, ఒక స్పూన్ కాఫీ పౌడర్, ఒక స్పూన్ ఇండిగో పౌడర్,రెండు స్పూన్ల పెరుగు, కొంచెం డికాక్షన్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలస్నానం చేసి తలకి పట్టించాలి. ఆరిన తర్వాత ఏదైనా హెర్బల్ షాంపుతో తలస్నానం చేయాలి. టీ పొడి జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు రాలడం తగ్గిస్తుంది.అలాగే రెండు టీ స్పూన్ల వేపాకుల చూర్ణం, రెండు టీ స్పూన్ల మెంతుల చూర్ణం, నాలుగు టీ స్పూన్ల బ్రాహ్మి చూర్ణం, నాలుగు టీ స్పూన్ల చందనం చూర్ణం, నాలుగు టీ స్పూన్ల శీకాకాయ చూర్ణం, ఆరు టీ స్పూన్ల కుంకుడు కాయల చూర్ణం తీసుకొని పక్కన పెట్టుకోవలి.
Hair Tips : ఈ మిశ్రమాన్ని పట్టించాలి
ముందుగా అన్ని రకరకాల చూర్ణాలు కలిసిపోయేలా కలపాలి. ఆ కలిపిన చూర్ణం ఒక స్టీలు గిన్నెలో వేసి చూర్ణం మునిగే వరకు నీళ్లు పోయాలి. తర్వాత చిన్నమంటమీద కొద్దిగా వేడి చేయాలి. ఈ విధంగా చేస్తే పేస్టులాగా తయారవుతుంది. ఇలా తయారైన పేస్టును నెమ్మదిగా జుట్టు కుదుళ్లకు, జుట్టుకు మంచిగా పట్టించి జుట్టును ఆరనివ్వాలి. తర్వాత శుభ్రమైన నీళ్లతో స్నానం చేయాలి.తాజా కరివేపాకులను పొడి చేసి, నీటితో పేస్టులాగ చేసి, 2 కప్పుల కొబ్బరి నూనెను దానికి కలిపి, ఆ మిశ్రమంలోని తేమ ఆవిరయ్యే వరకు వేడి చేయాలి. చల్లర్చిన తర్వాత ఒక సీసాలో భద్ర పరచుకోవాలి. వారంలో రెండు సార్లు తలకి ఈ మిశ్రమాన్ని వాడితే క్రమంగా వెంట్రుకలు తెల్లబడతాయి.