Hair Tips : ఈ ఐదు కారణాల వలనే జుట్టు రాలుతుంది… శ్రద్ధ వహించకపోతే… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : ఈ ఐదు కారణాల వలనే జుట్టు రాలుతుంది… శ్రద్ధ వహించకపోతే…

Hair Tips : ఇప్పుడు చాలామందికి జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. అయితే ఆరోగ్య సంరక్షణ మరియు అందం సంరక్షణకు దగ్గరి సంబంధం ఉంది. చాలా సందర్భాలలో జుట్టు రాలే సమస్య సవాలుగా ఉంటుంది. అటువంటి పరిస్థితులకు పరిష్కారం కనుగొనాలంటే మనం తప్పక శ్రద్ధ వహించాలి. చర్మవ్యాధుల నిపుణుల చెప్పిన దాని ప్రకారం రోజుకు సాధారణ వెంట్రుకలలో 50 వరకు రాలడం సాధారణం. అయితే ఇంతకంటే ఎక్కువ జుట్టు రాలినపుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని […]

 Authored By prabhas | The Telugu News | Updated on :2 August 2022,3:00 pm

Hair Tips : ఇప్పుడు చాలామందికి జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. అయితే ఆరోగ్య సంరక్షణ మరియు అందం సంరక్షణకు దగ్గరి సంబంధం ఉంది. చాలా సందర్భాలలో జుట్టు రాలే సమస్య సవాలుగా ఉంటుంది. అటువంటి పరిస్థితులకు పరిష్కారం కనుగొనాలంటే మనం తప్పక శ్రద్ధ వహించాలి. చర్మవ్యాధుల నిపుణుల చెప్పిన దాని ప్రకారం రోజుకు సాధారణ వెంట్రుకలలో 50 వరకు రాలడం సాధారణం. అయితే ఇంతకంటే ఎక్కువ జుట్టు రాలినపుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తున్నారు.జుట్టు బాగా రాలితే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. పొడవాటి జుట్టు ఉన్నవారు జుట్టు రాలడాన్ని త్వరగా గమనిస్తారు. అందువలన అటువంటి పరిస్థితులన్నింటిని జాగ్రత్తగా చూసుకోవాలి.

హెయిర్ స్టైల్ అలవాట్లు మరియు రెగ్యులర్ హెయిర్ కలరింగ్ కారణంగా స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ జుట్టును కోల్పోతారు. అంతేకాకుండా గర్భం మరియు మెనోపాజ్ వంటి జీవితం సంఘటనల వలన ఎక్కువ మంది మహిళల్లో జుట్టు రాలడానికి కారణం అవుతుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. 1)) ప్రతిరోజు తలస్నానం చేయడం మంచిది. తలస్నానం చేయకపోతే స్కాల్ప్ మురికిగా మారుతుంది. మురికి, చెమట, మలినాలు మరియు చుండ్రు పెరగటం వలన జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. మరియు కొత్త జుట్టు పెరగడాన్ని నిరోధిస్తాయి. ఫలితంగా మీరు జుట్టు రాలడాన్ని అనుభవించక తప్పదు. అందువల్లనే ప్రతిరోజు శుభ్రంగా తల స్నానం చేయడం వలన వెంట్రుకలు రాలే సమస్య తగ్గుతుంది.

Hair Tips on Reasons for hair falling

Hair Tips on Reasons for hair falling

2)) మనలో చాలామంది బిగుతుగా ఉండే హెయిర్ క్లిప్పులు మరియు హెయిర్ బ్యాండ్లను ధరించడం ద్వారా జుట్టు ఎదుగుదలకు దోహదపడుతుంది. అంతేకాకుండా జుట్టు కూడా రాలిపోతుంది. ప్రతిరోజు హెయిర్ పోనిటేల్ ను మరియు టైట్ బ్యాండ్లు వలన తల ఒత్తిడికి గురి అయి జుట్టు డ్యామేజ్ అవ్వడానికి కారణం అవుతుంది. కాబట్టి జుట్టును కట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

3) అలాగే క్రమం తప్పకుండా హెయిర్ డ్రయర్స్, కర్లీంగ్ మరియు స్ట్రైయిట్నర్ వంటి సాధనాలను వాడటం వలన జుట్టు పొడిబారుతుంది. అలాగే విరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. చాలా వరకు వీటి వలన జుట్టు రాలిపోయే అవకాశం ఉంది. అధిక వేడి వలన జుట్టు బలహీన పడిపోతుంది మరియు జుట్టులో తేమ తొలగిపోతుంది. వెంట్రుకలు విరిగిపోయే అవకాశం ఉంది. అందువలన వాటిని ఎక్కువగా వాడకూడదు.

4) చుట్టు రాలడానికి మరొక కారణం పోషకాహార లోపం. ఐరన్ మరియు అమైనో ఆమ్లాలు లోపం వలన జుట్టు రాలిపోతుంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ చాలా అవసరం. ఇది మీ శరీరంలో కణాల పెరుగుదల మరియు మరమ్మత్తు కోసం ఆక్సిజన్ ను తీసుకువెళుతుంది, జుట్టు పెరుగుదలను ప్రేరేపించే కణాలతో సహా. మీ జుట్టు ఎక్కువగా కెరాటిన్ తో తయారవుతుంది. కరాటే ఉత్పత్తి కావడానికి శరీరానికి మొత్తం 18 అమైనో ఆమ్లాలు అవసరం.

5) జుట్టు రాలిపోవడానికి ఇంకొక కారణం ఒత్తిడి. ఒత్తిడి అనేది చిన్న విషయం కాదు. అవి తరచుగా వస్తూనే ఉంటాయి. ఒత్తిడి వల్లనే జుట్టు సగం రాలిపోతుంది. హెయిర్ పోలికల్స్ ను విశ్రాంతి దశలోకి నెట్టి వేస్తుంది మరియు కాలక్రమేనా జుట్టు దువ్వినప్పుడు లేదా తలస్నానం చేసినప్పుడు వెంట్రుకలు రాలిపోతాయి. ముఖ్యంగా ఈ ఐదు కారణాల వలన జుట్టు రాలిపోతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది