Hair Tips : ఎన్ని ట్రై చేసిన పెరగని జుట్టు.. ఇది ట్రై చేసి చూడండి ఇక మీ జుట్టు పెరుగుతూనే ఉంటుంది…
Hair Tips : ప్రస్తుతం అందరిలోనూ జుట్టు రాలే సమస్య రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. ఈ సమస్య వయసు తరహా లేకుండా అందరికీ చుట్టుముట్టుతుంది. ఈ సమస్య నుంచి బయటపడడం కోసం ఎన్నో రకాల చిట్కాలను ట్రై చేసి అలసిపోయి ఉంటారు. అయితే ఇప్పుడు ఈ చిట్కాని ట్రై చేసి చూడండి.. ఇక మీ జుట్టు రాలే సమస్య ఆగి ఇక పెరుగుతూనే ఉంటుంది. జుట్టుకు అందాల్సిన మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్స్ సరియైన క్రమంలో అందకపోవడం వలన ఇలా జుట్టు రాలుతూ ఉంటుంది. చాలామందిలో మానసిక ఆందోళన ఒత్తిడి, వలన కూడా ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఇలా ఎన్నో రకాల సమస్యలతో జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ చిట్కా అని ట్రై చేసి మీ జుట్టు రాలే సమస్య అలాగే దురద, చుండ్రు లాంటి ఇబ్బందులు అన్నీ కూడా తగ్గి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది.
దానికోసం పెసలు తీసుకొని వాటిని నైట్ అంతా నానబెట్టుకుని తర్వాత ఆ నీటిని వంపేసి ఒక గుడ్డలో వాటిని కట్టి గాలిచూరకుండా చూసుకోవాలి. మరుసటి రోజు అవి మొలకలుగా మారుతాయి. ఆ మొలకలను మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ మొలకలలో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ అధికంగా కలిగి ఉంటాయి. వీటి వలన జుట్టు రాలే సమస్య తగ్గి పొడవుగా, ఒత్తుగా పెరుగు పెరగడం మే కాకుండా దురద, ఇన్ఫెక్షన్ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఈ మొలకలలో, గుప్పెడు మందరాకులను కూడా వేసుకోవాలి. ఈ ఆకులలో బేటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. దీని వలన జుట్టు రాలే సమస్య తగ్గిపోయి జుట్టు చివర్లు చిట్ల కుండ కూడా తగ్గిస్తుంది.
అలాగే కుదుర్లు బలంగా తయారు చేస్తుంది. తర్వాత దీంట్లో నాలుగు మందార పువ్వులను కూడా వేసుకోవాలి. దీనిని మెత్తని పేస్టులా చేసుకుని దీనిలో ఆముదం కూడా వేసి కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు మంచిగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 45 నిమిషాల పాటు ఉంచిన తర్వాత. ఏదైనా గాఢత తక్కువ ఉన్న షాంపూను తీసుకొని తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేసినట్లయితే ఈ సమస్య తగ్గి జుట్టు సిల్కీగా, ఒత్తుగా, పొడుగా పెరుగుతుంది. అదేవిధంగా తలలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న కానీ వాటిని కూడా తగ్గిస్తుంది. ఈ విధంగా రెండు వారాల వరకు చేసినట్లయితే మంచి ఫలితం మీరు చూస్తారు. ఇక మీ జుట్టు రాలడం ఆగి పెరుగుతూనే ఉంటుంది.