Health Benefits : ఈ ఆహారాలను తిన్నారంటే… పేగులు ఆరోగ్యంగా ఉంటాయి…
Health Benefits : మన శరీరంలో ప్రేగులు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచిది. మనం తీసుకున్న ఆహార పదార్థాలు లేదా ద్రవపదార్థాలు పొట్ట లోపలికి వెళ్లిన తర్వాత రక్తంలోనికి వెళతాయి. ఆహారం ద్వారా క్రీములు పొట్టలో నుంచి రక్తం లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. నోట్లో రక్షణ వ్యవస్థ, పొట్టలో రక్షణ వ్యవస్థ బాగా పనిచేస్తే కనుక ఆ క్రీములు లోపలికి వెళ్లే అవకాశం ఉండదు. కాకపోతే మనం అన్నాన్ని సరిగా నమలం కాబట్టి నోట్లో […]
Health Benefits : మన శరీరంలో ప్రేగులు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచిది. మనం తీసుకున్న ఆహార పదార్థాలు లేదా ద్రవపదార్థాలు పొట్ట లోపలికి వెళ్లిన తర్వాత రక్తంలోనికి వెళతాయి. ఆహారం ద్వారా క్రీములు పొట్టలో నుంచి రక్తం లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. నోట్లో రక్షణ వ్యవస్థ, పొట్టలో రక్షణ వ్యవస్థ బాగా పనిచేస్తే కనుక ఆ క్రీములు లోపలికి వెళ్లే అవకాశం ఉండదు. కాకపోతే మనం అన్నాన్ని సరిగా నమలం కాబట్టి నోట్లో నుంచి మిస్ అయ్యి పొట్టలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. పొట్టలో హానికరమైన కెమికల్స్ తొలగించడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. కొన్ని రకాల హెల్ప్ ఫుల్ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇలాంటివి కూడా మన రక్షణ వ్యవస్థను చాలావరకు యాక్టివ్ చేస్తాయి.
పేగులలో అనేక లాభాలు కలిగించే ఫ్రెండ్రీ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి ఈ మధ్య చాలా తగ్గిపోతున్నాయి. హాని కలిగించే చెడు బ్యాక్టీరియాలు పెరిగిపోతున్నాయి. అందువలన ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ప్రేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ముందుగా ఆల్కహాల్ త్రాగడం మానేయాలి. నిద్ర సరిగా పోకపోవడం, ఒత్తిడి మరియు ఆత్రుత, స్మోకింగ్, కూల్ డ్రింక్స్ వంటివి తాగడం వీటి వలన ప్రేగులోని ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు చనిపోతాయి. అలాగే ఫ్రిజ్ లో ఉండే చల్లటి పదార్థాలు ఐస్ క్రీమ్ వంటివి తినకూడదు. ఇవన్నీ పేగులలో ఉండే గుడ్ బ్యాక్టీరియాని చంపేస్తాయి.
యాంటీబయాటిక్స్ వాడడం, కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు పవర్ఫుల్ మెడిసిన్స్ వాడడం వలన ఇలాంటివి బాగా చనిపోతాయి. ఫైబర్ ఫుడ్ తినకపోవడం, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, పదార్థాలు తయారు చేసేటప్పుడు లేదా పెంచేటప్పుడు వేసే ఎరువులు పెస్టిసైడ్స్, పండడానికి వేసే కార్బైడ్లు, కెమికల్ తో ఉన్న ఫుడ్ ఐటమ్స్ మనకు ప్రేగులలో రక్షణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రధానంగా పేగులు హెల్తీ బ్యాక్టీరియాతో ఉండాలి. కాబట్టి మంచి బ్యాక్టీరియా పెరగాలంటే పుల్లటి మజ్జిగ, పుల్లటి పెరుగు వాడడం వలన హెల్తీ బ్యాక్టీరియా పెరుగుతుంది. అలాగే మగ్గిన అరటిపండు, సోయాబీన్ వంటి ఆహారాలను తీసుకుంటే ప్రేగులలో హెల్తీ బ్యాక్టీరియా పెరుగుతుంది. దీనివలన ప్రేగులు ఆరోగ్యంగా ఉంటాయి.