Health Benefits : కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే… ఈ నాలుగింటిని తప్పక తినాలి…
Health Benefits : మనకు శరీరంలో రెండు మూత్రపిండాలు ఉంటాయి. మూత్రపిండాల యొక్క పని ఏంటంటే అనవసరమైన ద్రవం మరియు వ్యర్ధపదార్థాలను రక్తంలో నుంచి బయటకు పంపించడం. మూత్రపిండాలు ప్రతి వైపు కటి వెన్నెముక యొక్క పృష్ట భాగానికి ఉంటాయి. అంటే ఎడమవైపు ఒక మూత్రపిండం, కుడి వైపున ఒక మూత్రపిండం ఉంటాయి. అయితే రక్తం నుండి వ్యర్థ పదార్థాలను బయటకు పంపే సామర్థ్యం కిడ్నీలకు తగ్గినప్పుడు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. అందులో ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు చేరటం. ఈ రాళ్లు అనేవి ఉంటే కిడ్నీ నొప్పి వస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది ఈ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటివారు తము రోజు తినే ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకుంటే కొద్ది వరకు ఈ కిడ్నీ సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే కిడ్నీ సమస్యతో బాధపడేవారు ఏ ఆహార పదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1) కిడ్నీ సమస్యతో బాధపడేవారు గుడ్డులోని తెల్లసొన ను తింటే చాలా మంచిది. దీనిని తింటే కిడ్నీలకు అవసరమైన ప్రోటీన్ లభిస్తుంది. అలాగే ఈ తెల్ల సోన డయాలసిస్ చికిత్స చేయించుకున్న వారు కూడా తినడం మంచిది. గుడ్లని ఆమ్లెట్స్ గా వేసుకున్నప్పుడు తెల్లసోనను మాత్రమే వేసుకోవాలి. అలాగే సాండ్ విచ్ లు కోసం తెల్ల సోనని వాడాలి. గుడ్లని బాగా ఉడికించి ట్యూనా, గ్రీన్ సలాడ్స్ లో కలిపి తినండి. ఇలా తినడం వలన కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
2)అలాగే కిడ్నీ సమస్యలు ఉన్నవారు క్యాబేజీని ఎక్కువగా తినాలి. క్యాబేజీలో పొటాషియం, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. ఈ క్యాబేజీలో సోడియం తక్కువగా ఉండడం వలన కిడ్నీ సమస్యల నుంచి సులువుగా బయటపడవచ్చు. క్యాబేజీలో విటమిన్స్, మినరల్స్, శక్తివంతమైన ప్లాంట్ కాంపౌండ్స్, విటమిన్ కె, విటమిన్ సి, బి పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచి ప్రేగు కదలికలు బాగుండేలా చేస్తుంది.
3) క్యాలీఫ్లవర్ లో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి, ఫోలేట్ వంటి విలువైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవి మన శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపిస్తాయి. కాలిఫ్లవర్ ని ఉడికించి కూడా తినవచ్చు. అంతేకాకుండా కాలీఫ్లవర్ లో సోడియం చాలా తక్కువగా ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాలిఫ్లవర్ ను తినే ఆహారంలో తీసుకోవడం వలన కిడ్నీ సమస్యలు తగ్గుతాయి.
4) కిడ్నీ సమస్యలు ఉన్నవారు సోడియం తక్కువగా ఉన్న ఆహారం తీసుకోమని వైద్యులు చెబుతుంటారు. వెల్లుల్లిలో సోడియం తక్కువగాను పొటాషియం ఎక్కువగాను ఉంటుంది. ఇది కూరలకు మంచి రుచిని కలిగిస్తాయి. అలాగే ఉప్పుకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. రెండు రెబ్బల వెల్లుల్లిని ఉడికించి తీసుకోవచ్చు లేదా కూరలలో అయినా వేసుకొని తినవచ్చు. ప్రతిరోజు రెండు వెల్లుల్లి రెబ్బలను తినేలా చూసుకోవాలి. ఇలా చేస్తే కిడ్నీలు ఆరోగ్యం ఉంటాయి.