Health Benefits : ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌కి ఈ జ్యూస్ తాగితే ప‌రిగెత్త‌డ‌మే.. అవేంటో తెలుసుకోండి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌కి ఈ జ్యూస్ తాగితే ప‌రిగెత్త‌డ‌మే.. అవేంటో తెలుసుకోండి

Health Benefits : మన శరీరానికి ఆయువు రక్తం. వాహనాన్ని నడిచేందుకు ఇంధనం ఎంత ముఖ్యమో.. శరీరానికి రక్తం అంతే ముఖ్యం. శరీరంలోని అవయవాలు సక్రమంగా పని చేయాలంటే రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు బాగుండాలి. ఈ ప్రసరణ వ్యవస్థలో ఏమాత్రం తేడా వచ్చినా ఏదో ఒక సమస్యకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. రక్త ప్రసరణ వల్ల శరీరంలోని అవయవాలకు రక్తం అందించడం వల్ల జీవక్రియలు పనిచేయడానికి , అవయవాలకు అవసరం అయ్యే న్యూట్రీషియన్స్, విటమిన్స్ అందిస్తుంది. […]

 Authored By mallesh | The Telugu News | Updated on :8 April 2022,3:00 pm

Health Benefits : మన శరీరానికి ఆయువు రక్తం. వాహనాన్ని నడిచేందుకు ఇంధనం ఎంత ముఖ్యమో.. శరీరానికి రక్తం అంతే ముఖ్యం. శరీరంలోని అవయవాలు సక్రమంగా పని చేయాలంటే రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు బాగుండాలి. ఈ ప్రసరణ వ్యవస్థలో ఏమాత్రం తేడా వచ్చినా ఏదో ఒక సమస్యకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. రక్త ప్రసరణ వల్ల శరీరంలోని అవయవాలకు రక్తం అందించడం వల్ల జీవక్రియలు పనిచేయడానికి , అవయవాలకు అవసరం అయ్యే న్యూట్రీషియన్స్, విటమిన్స్ అందిస్తుంది. మరియు హార్మోనుల ఉత్పత్తికి మరియు శరీర ఉష్ణోగ్రతలు క్రమబద్దం చేయడానికి రక్తప్రసరణ ఎంతో అవసరం.మన శరీరంలో రక్తశుద్ధి చాలా అవసరం.

శరీరంలో రక్తం శుభ్రంగా లేకుంటే రక్తహీనత, అలసట, జ్వరం, కడుపునొప్పి, శ్వాస సంబంధిత రోగాలు ఏర్పడే అవకాశం ఉంది. బలహీనమైన రక్తప్రసరణ వల్ల శరీరంలో అవయవాలకు తక్కువ ఆక్సిజన్ మరియు పోషకాలు సప్లై అవుతాయి . దాంతో అలసిపోయినట్లు అనుభూతి కలుగుతుంది. బలహీనమైన రక్తప్రసరణ వల్ల శరీరం మొత్తానికి రక్త శుద్ది తక్కువగా ఉంటుంది. గ్యాస్ట్రోఇన్టెషనల్ కూడా బలహీనమైన రక్తప్రసరణ వల్ల జీర్ణక్రియ తగ్గుతుంది మరియు మలబద్దక సమస్యలకు దారితీస్తుంది. బ్రెయిన్ ఫంక్షన్స్ చురుగ్గా ఉండాలంటే, రక్తప్రసరణ మెరుగ్గా ఉండాలి . రక్తప్రసరణ మెరుగ్గా లేనట్లైతే అలసటకు గురిచేస్తుంది. ఏకాగ్రత ఉండదు మరియు మతిమరుపు వంటి లక్షణాలు ఎదుర్కోవల్సి వస్తుంది.

Health Benefits in Beetroot Juice Recipe

Health Benefits in Beetroot Juice Recipe

Health Benefits : బ్ల‌డ్ స‌ర్క్యూలేష‌న్ లేక‌పోతే ఎన్నో స‌మ‌స్య‌లు

అయితే కొన్ని ఆహార‌పు అల‌వాట్ల‌తో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌ర్చ‌వ‌చ్చు. సోర‌కాయ‌, పూదీనా, కొత్తిమీర‌, తుల‌సి ఆకుల‌ను మిక్స్ ప‌ట్టాలి. ఈ మిశ్ర‌మాన్ని రోజు తాగ‌డం వ‌ల్ల ర‌క్తంలోని మ‌లినాలు తొల‌గిపోయి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగ‌వుతుంది. అలాగే ఎక్కువ‌గా నీరు తాగాలి. ఆకు కూర‌లు, కూర‌గాయ‌లు, ఫ్రూట్స్ ఎక్కువ‌గా తీసుకోవాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.ఖర్జూరాన్ని తేనెలో మూడు రోజుల పాటు నానబెట్టి మూడు పూటలా తీసుకోవాలి. అలాగే బీట్‌రూట్ జ్యూస్‌తో పాటు బీట్‌రూట్‌తో చేసే వంటకాలను కూడా ఆహారంలో తీసుకోవాలి. దీంతో శరీరంలో రక్త ఉత్పత్తి, రక్త ప్రసరణ క్రమంగా జరుగుతుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది