Health Benefits : ఈ గింజలు గుప్పెడు తీసుకుంటే.. కేవలం పది రోజుల్లో మీ వాధ్యులన్నీ మాయం
Health Benefits : అవిసె గింజలు గురించి అందరికీ తెలిసేఉంటుంది. ఈ గింజలు ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను కలిగి ఉన్నాయి. రోజు తీసుకునే ఆహారంలో వీటిని తీసుకుంటే అనేక వ్యాధులనుంచి విముక్తి పొందవచ్చు. అవిసె గింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బీ1, ప్రొటీన్స్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, జింక్, సెలీనియంలు వంటి పౌష్టిక విలువలు కూడా అవిసె గింజల్లో లభిస్తాయి. ఇవి శరీరానికి శక్తిని అందించి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
అధిక బరువుతో బాధపడేవారికి ఈ అవిసె గింజలు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా కడుపు నిండిన భావన కలిగి తొందరగా ఆకలి వేయదు. దీంతో ఎక్కువగా తినే అవకాశం ఉండదు.అవిసె గింజలలో యాంటి ఇన్ ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరిచి గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. అలాగే జీర్ణశక్తి ని మెరుగుపరుస్తుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. అలాగే ఆహార నియమాల్లో అవిసె గింజలను చేర్చుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.
స్త్రీలకు పీరియడ్స్ వల్ల వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. అవిసె గింజల్లో జుట్టును కాపాడే గుణం ఉంది. ఎయిర్ ఫాల్, తెల్లజుట్టును తగ్గించి జుట్టుకి మంచి పోషణ అందిస్తుంది.కొద్దిగా వేయించిన అవిసె గింజలను తీసుకుని అందులో కాస్తా పటిక బెల్లం లేదా సాధారణం బెల్లంతో కలిపి తీసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వేడి వాటర్ తాగాలి. ఇలా చేస్తే మెటబాలిజం పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అలాగే మార్నింగ్ నిద్రలేవగానే పరిగడుపున గోరువెచ్చని నీటిని తాగితే బాడీలో పేరుకుపోయిన మలినాలు, టాక్సిన్స్ బయటకు పంపబడతాయి. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.