Health Benefits : పిల్లలకు ఇది తినిపిస్తే సూపర్ మ్యాన్ లా తయారవుతారు.. సూపర్ ఆక్టీవ్ గా ఉంటారు..
Health Benefits : మానవ శరీరానికి విటమిన్స్ ఎంతో ముఖ్యం. అందులో విటమిన్ డీ చాలా ముఖ్యం. విటమిన్ డీ అనగానే ముందుగా ఎముకల ఆరోగ్యమే గుర్తుకొస్తుంది. ఇది ఆహారం ద్వారా లభించే క్యాల్షియాన్ని శరీరం బాగా గ్రహించుకునేలా చేస్తుంది. ఇలా ఎముకలు గుల్లబారకుండా చూస్తుంది. అంతేకాకుండా రోగనిరోధకశక్తిని పెంపొందించి, ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికీ శరీరానికి సహకరిస్తుంది. నిస్సత్తువ, అలసట, నిద్రలేమి వంటి వాటినీ పోగొడుతుంది. ఉల్లాసం, ఉత్సాహం, సంతోషాన్నీ కలిగిస్తుంది. మెదడు సక్రమంగా పనిచేయటానికి వివిధ న్యూరోస్టిరాయిడ్లను వాడుకుంటుంది. వీటిల్లో విటమిన్ డి ఒకటి.ఎండ తగిలితే సెరటోనిన్ అనే హార్మోన్ కూడా ఉత్పత్తి అవుతుంది.
ఇది మానసిక స్థితిని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కుంగుబాటు లక్షణాలు తగ్గుతాయి. ప్రస్తుతం విటమిన్ డి కలిపిన పాల వంటివీ దొరుకుతున్నాయి. పాలలో ట్రిప్టోఫాన్ అనే ప్రొటీన్ కూడా ఉంటుంది. ఇది నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.అయితే విటమిన్ డీ లోపం వల్ల ఎముకల ఎదుగుదల తగ్గుతుంది. ఎముకలు క్రమంగా గుళ్లబారుతాయి. అంతేకాదు నిస్సత్తువ, అలసట, నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఎవరికైనా విటమిన్ డి చాలా అవసరం. సంవత్సరంలోపు పిల్లలు బయట తిరుగరు కాబట్టి వారికి ఉదయం, సాయంత్ర సూర్యరశ్మి తాగిలేలా చూడాలి. ఎదిగే పిల్లలకు విటమిన్ డీ చాలా అవసరం.పిల్లలకు ఆరోగ్యమైప అలవాట్లను చిన్నప్పటినుంచే అలవాటు చేయాలి.
Health Benefits : పిల్లలకు చాలా ముఖ్యం
మార్నింగ్ లేవగానే రెండు లేదా మూడు గ్లాసుల నీళ్లు తాగించాలి. క్యారెట్, బీట్ రూట్, కొత్తిమీర, టమాటో, మునగాకు వేసి జ్యూస్ చేసి ఒక గ్లాస్ తాగించాలి. కొబ్బరితురుము, దానిమ్మ గింజలు, ఖర్జూరం ముక్కలు తేనెతో కలిపి ఇవ్వాలి. డైలీ ఒక ఫ్రూట్ తప్పనిసరిగా తినిపించాలి. గుడ్లు మంచి పోషక విలువలు కలిగిన ఆహారం. గుడ్డులోపల ఉండే పచ్చ సొనలో కూడా విటమిన్ డీ పుష్కలంగా లభిస్తుంది. దీన్ని రోజూవారి ఆహారంలో చేర్చండి.పుట్టగొడుగులలో విటమిన్ డీ సమృద్ధిగా దొరుకుతుంది. ఈ పుట్టగొడుగులను రుచికరమైన వంటకాల్లో ఎన్నో వెరైటీలుగా తయారుచేసుకోవచ్చు. ముఖ్యంగా పుట్టగొడుగులతో చేసే సూప్‌లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ సూప్ ను కాస్త పట్టిస్తే.. విటమిన్ డీ శరీరంలో పేరుకుపోతుంది.