Health Benefits : ఈ మూడు కలిపి తీసుకుంటే నొప్పులన్నీ పది నిమిషాల్లో మాయం
Health Benefits : శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహారలోపం, వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు, ఒకే భంగిమలో కూర్చుని పనులు చేయడం కీళ్లనొప్పులు వేధిస్తాయి. ఇదివరకు యాభైలు, అరవైలు దాటిన తర్వాత వచ్చే కీళ్లనొప్పులు ఇటీవల కాలంలో ముప్ఫైలు, నలభైలలోనే చాలామందిని వేధిస్తున్నాయి. కీళ్లకు సంబంధించిన సమస్యలను ఆర్థరైటిస్ అంటారు. దీన్లో చాలా రకాలున్నాయి. మోకాళ్లలో కార్టిలేజ్ అరగడం వల్ల, సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గడం వల్ల కీళ్లు రెండూ ఒరుసుకుపోయి నొప్పి,
వాపు మొదలై కీళ్లు కదపడం ఇబ్బందిగా మారుతుంది. కొన్ని రకాల సహజ పద్దతుల్లో నొప్పులకు ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం…కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్, క్యారెట్, బీట్రూట్, కాప్సికం, బీన్స్, చిక్కుడు లాంటి కూరగాయల్ని సలాడ్లు, కూరలు లేదా సూప్ రూపంలో రోజూ తీసుకోవాలి. అలాగే క్యాబేజి, కాలీఫ్లవర్, బ్రొకొలి, ముల్లంగి లాంటివి అధికంగా తీసుకోవాలి. ఇంకా ఆహారంలో పసుపు, అల్లం, వెల్లుల్లి ఎక్కువగా తీసుకుంటే మంచిది.

Health Benefits natural remedies for rheumatoid arthritis pain relief
Helth Benefits : ఎండు కొబ్బరి…
ఎండు కొబ్బరి బంధన కణజాలాలకు మేలు చేస్తుంది. కొబ్బరి శరీరంలోని బంధన కణజాలాలను బలోపేతం చేసే అనేక పోషకాలను కలిగి ఉంటుంది. కొబ్బరిని ఆహారంలో చేర్చడం వలన ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలను రాకుండా నివారిస్తుంది. ఆర్థ్రైటిస్, ఓస్టిరియోఫోసిస్ వంటి వ్యాధులను నివారించడంలో డ్రై కోకనట్ సహాయపడుతుంది. ఉండుకొబ్బరిలో ఉండే మినిరల్స్ టిష్యులన్ స్ట్రాంగ్ గా ఉంచుతుంది. హెల్తీ బాడీకి సహాయపడుతుంది. అవును మితంగా ఎండుకొబ్బరి తినడం వల్ల మలబద్దకం, అల్సర్ , హెమరాయిడ్స్ వంటి జీర్ణ సమస్యలుండవు. డ్రైడ్ కోకనట్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు.
Helth Benefits : నువ్వుల ద్వారా..
నువ్వుల నూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా నల్ల నువ్వుల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీహిస్టమైన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని ‘పవర్ హౌజ్’ అని పిలుస్తారు.
Helth Benefits : పటిక బెల్లం..
పటికబెల్లం శరీరానికి చలువ చేస్తుంది, జీర్ణశక్తిని పెంచి దేహానికి బలాన్ని ఇస్తుంది. వాత, పిత్త , కఫ దోషాల వల్ల కలిగే అనేక రోగాలకు ఔషధంగా పనిచేస్తుంది. అయితే తియ్యగా ఉంది కదా అని ఎక్కువ తింటే మాత్రం మలబద్దకం వస్తుంది. ఎండు కొబ్బరి, నువ్వులు, పటికి బెల్లం లేదా బెల్లం ఒక జార్ లోకి తీసుకుని మొత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత ఒక్క పాత్రలో గ్లాసు పాలు మరిగించుకోవాలి. అలాగే సోంపు గింజలు ఒక చెంచా అందులో వేసుకోవాలి. మరో ఐదు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత మొత్తగా చేసుకున్న పొడి ఇందులో వేసి మరిగించాలి. గొరువెచ్చగా చేసుకుని ఈ మిశ్రమాన్ని తినాలి. దీంతో ఎముకలలో నొప్పి, వాపు, మెడనొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలు తగ్గిపోతాయి.