Apricots Fruit : ఈ పండు ఆరోగ్యానికి దివ్య ఔషధం… దీని ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Apricots Fruit : ఈ పండు ఆరోగ్యానికి దివ్య ఔషధం… దీని ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు…!

Apricots Fruit : ఆప్రికాట్ పండు తినటానికి ఎంతో రుచిగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే. ఎండిన ఆఫ్రికాట్ రుచి ఇంకా ఎంతో బాగుంటుంది. ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైంది డ్రై ఫ్రూట్. డ్రై ఆప్రికాట్ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో మరియు ఎన్నో వ్యాధుల నుండి దూరంగా ఉండేలా కూడా చూస్తుంది. దీంతో శరీరానికి సమృద్ధిగా పోషకాలు అనేవి అందుతాయి. ఆఫ్రికాట్ లో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, కార్బోహైడ్రేట్ లు,ఐరన్, విటమిన్ A మరియు విటమిన్ C అధికంగా ఉన్నాయి. […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 June 2024,7:00 am

Apricots Fruit : ఆప్రికాట్ పండు తినటానికి ఎంతో రుచిగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే. ఎండిన ఆఫ్రికాట్ రుచి ఇంకా ఎంతో బాగుంటుంది. ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైంది డ్రై ఫ్రూట్. డ్రై ఆప్రికాట్ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో మరియు ఎన్నో వ్యాధుల నుండి దూరంగా ఉండేలా కూడా చూస్తుంది. దీంతో శరీరానికి సమృద్ధిగా పోషకాలు అనేవి అందుతాయి. ఆఫ్రికాట్ లో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, కార్బోహైడ్రేట్ లు,ఐరన్, విటమిన్ A మరియు విటమిన్ C అధికంగా ఉన్నాయి. కెరోటి నాయిడ్స్ లాంటి ఫైటో కెమికల్స్ ఎండిన ఆప్రికాట్ లో కూడా ఉన్నాయి. ఈ పోషకాలు అన్ని కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండు తీసుకోవడం వలన ఏ వ్యాధుల ను నయం చేయడంలో ఎలా సహాయం చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆప్రికాట్ ఫైబర్ అనేది అధిక మోతాదులో ఉంటుంది. ఇవి ప్రేగు కదలికలను మెరుగుపరచడం వలన మలబద్ధక సమస్య నుండి కూడా ఉపసమనం కలిగిస్తుంది. మలబద్ధక సమస్యతో బాధపడుతున్నటువంటి వారు ఈ పండును తీసుకోవడం చాలా మంచిది. ఈ ఆప్రికాట్ పండులో విటమిన్ A పుష్కలంగా ఉంది. ఇది కంటి చూపును మెరుగుపరచటంలో కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఫ్రీ రాడికల్స్ వలన జరిగేటటువంటి నష్టాల నుండి కూడా మనల్ని రక్షిస్తుంది. ఆప్రి కాట్ లో ఉన్న ఫైబర్ రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా ఎంతో బాగా సహాయం చేస్తుంది. దీని వలన గుండె కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి అనుకునే వారు కూడా ఈ ఆప్రి కాట్ పండు తింటే చాలు.

ఎముకల బలానికి అవసరమయ్యే ఐరన్, కాల్షియం, రాగి, మాంగనీస్, ఫాస్పరస్ లాంటి ఆవశ్యక మూలాలు ఆప్రికాట్ పండు లో అధికంగా ఉన్నాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఆఫ్రికాట్ లో రోగనిరోధక శక్తిని పెంచే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ పండు ఇమ్యూనిటీ పవర్ ను పెంచి ఎన్నో రకాల సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది. ఈ ఆప్రికాట్ పండు లో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా ఎంతో దోహదపడుతుంది. దీంతో రక్తహీనతకు కూడా చెక్ పెట్టొచ్చు..

Apricots Fruit ఈ పండు ఆరోగ్యానికి దివ్య ఔషధం దీని ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు

Apricots Fruit : ఈ పండు ఆరోగ్యానికి దివ్య ఔషధం… దీని ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు…!

ఆప్రికాట్ పండు లో శరీరానికి వేడి నుండి ఉపశమనం కలిగించే ఎన్నో లక్షణాలు దీనిలో ఉన్నాయి. అంతే కాక దీనిలో యాంటీ ఇన్ఫ్లోమెంటరీ లక్షణాలు వాపు, నొప్పి లాంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆప్రికాట్ లో విటమిన్ C,విటమిన్ A తో పాటుగా ఫైట్ న్యూట్రియంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని మృదువుగా చేయడంలో కూడా ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. క్యాన్సర్ తగ్గించడానికి సహాయపడే కెరోటి నాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు అనేవి ఆప్రికాట్ పండులో అధికంగా ఉన్నాయి. ప్రతి నిత్యం ఆప్రికాట్ తినడం వలన క్యాన్సర్ అనేది రాకుండా రక్షించవచ్చు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది