Health Benefits : ఈ ఎండిన పండ్లు ఒక కప్పు తీసుకుంటే… పదినిమిషాల్లో ఆ సమస్యకు చెక్
Health Benefits : ఆప్రికాట్ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ ఏ, ఐరన్, విటమిన్ సీ పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి కావాల్సిన అనేక న్యూట్రీషియన్స్ అందిస్తుంది. పలు రకాల వ్యాధులను కూడా నివారిస్తోంది. పండు ఆప్రికాట్ల కంటే ఎండిన వాటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్ శరీర బరువును కూడా తగ్గిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారికి చక్కటి ఔషధం. డ్రై ఆప్రికాట్ రెగ్యూలర్ గా తీసుకుంటే హీమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనతను దూరం చేస్తుంది. డ్రై ఆప్రికాట్ లో పెక్టిన్ అధికంగా ఉంటుంది.
ఇందులో ఉన్న సెల్యులోస్ మలబద్దక సమస్యను నివారిస్తుంది. సెల్యులోజ్ కరగని ఫైబర్ మరియు పెక్టిన్ శరీరంలో వాటర్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. ఉబ్బసం వంటి సమస్యలు, చర్మ ఆరోగ్యానికి చక్కగా పనిచేస్తుంది.అలాగే భోజనానికి ముందు ఎండిన ఆప్రికాట్ తినడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఈ డ్రై ఫ్రూట్ లో ఉన్న ఆల్కలైన్ మరియు న్యూట్రలైజ్ యాసిడ్స్ అందుకు బాగా సహాయపడుతాయి. డ్రై ఆప్రికాట్ జ్వరాన్ని తగ్గిస్తుంది. వీటిని జ్యూస్ గా తయారు చేసి తేనె మిక్స్ చేసి తీసుకుంటే వెంటనే ఉపషమనం లభిస్తుంది.
అలాగే దాహార్తి సమస్య ఉన్న వారుకి కూడా మంచి సొల్యూషన్ లభిస్తుంది.డ్రై ఆప్రికాట్ జ్యూస్ తీసుకుంటే చర్మ సమస్యలు దరిచేరవు. ఎక్జిమా, దురద, తామర వంటివాటిని నివారించి కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. ఎండిన ఆప్రికాట్ లో అధిక న్యూట్రీషియన్స్ విటమిన్ ఏ అధికంగా ఉండి కంటి చూపునకు బాగా సహాకరిస్తుంది. డ్రై ఆప్రికాట్ పెద్ద పేగులను శుభ్రపరచి అందులో నిల్వ ఉన్న వ్యర్థాలను బయటకు పంపించడానికి సహాయపడుతుంది. అలాగే మజిల్ ఫంక్షన్స్, హార్ట్ బీట్ ను రెగ్యులేట్ చేస్తుంది. ఇంకా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలకు ఎండిన లేదా పండు ఆప్రికాట్ చక్కటి ఔషదంలా పనిచేస్తుంది.